MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కొత్త పెళ్లి కొడుకు మానస్ సంసారాన్ని కెలికిన అరియానా..అమర్ కి ఓట్ వేయమని ఇద్దరూ వేడుకుంటూ..

కొత్త పెళ్లి కొడుకు మానస్ సంసారాన్ని కెలికిన అరియానా..అమర్ కి ఓట్ వేయమని ఇద్దరూ వేడుకుంటూ..

తాజాగా అరియనా, బుల్లితెర నటుడు మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ మానస్ అమర్ దీప్ కి బహిరంగంగా మద్దతు ప్రకటించారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Dec 14 2023, 05:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

కింగ్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 ఈ ఆదివారం జరగబోయే గ్రాండ్ ఫినాలేతో ముగియనుంది. ప్రస్తుతం హౌస్ లో ఆరుగురు సభ్యులు టైటిల్ రేసులో ఉన్నారు. శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్, అమర్ దీప్ చౌదరి, ప్రియాంక జైన్, అర్జున్ ఫైనల్ వీక్ లో సందడి చేస్తున్నారు. 

27

ఇక ఫైనల్ కి చేరిన వారిలో శివాజీ, అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ మధ్య టైటిల్ ఫైట్ ఉండబోతున్నట్లు అంచనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ముగ్గరు ఓటింగ్ లో ముందు వరుసలో ఉన్నారట. సోషల్ మీడియాలో కూడా ఈ ముగ్గురికి అదే స్థాయిలో మద్దతు లభిస్తోంది. రైతు బిడ్డ అనే సెంటిమెంట్ పల్లవి ప్రశాంత్ కి వర్క్ అవుతోంది. ఇక శివాజీకి సినీ గ్లామర్ తో పాటు,ఆయన ఫాన్స్ జోరుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. 

37

ఇక అమర్ దీప్ కి బుల్లితెర ప్రేక్షకుల నుంచి మంచి మద్దతు లభిస్తోంది. టివి సెలెబ్రిటీలు చాలా మంది అమర్ దీప్ కి సపోర్ట్ గా పోస్ట్ లు చేస్తున్నారు.ఏదైనా మిరాకిల్ జరిగితే తప్ప టైటిల్ పోరు శివాజీ, ప్రశాంత్, అమర్ మధ్యే ఉండబోతోందని ప్రేక్షకులు కూడా బలంగా విశ్వసిస్తున్నారు.  

47

అమర్ దీప్ కి మద్దతుగా సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో మద్దతు లభిస్తోంది. తాజాగా అరియనా, బుల్లితెర నటుడు మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ మానస్ అమర్ దీప్ కి బహిరంగంగా మద్దతు ప్రకటించారు. ఈ మేరకు మానస్, అరియనా వీడియో సందేశం రిలీజ్ చేసారు. 

 

57

'అరియనా మాట్లాడుతూ.. బిగ్ బాస్ సీజన్ 7 లో మా ఫ్రెండ్ అమర్ దీప్ చౌదరి ఉన్నాడు. సీజన్ మొత్తం మేమంతా అమర్ కి సపోర్ట్ ఇస్తూ వచ్చాం. అమర్ గేమ్ చాలా బాగా ఆడుతున్నాడు. నాతో పాటు అమర్ బెస్ట్ ఫ్రెండ్ మానస్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఓటింగ్ కి రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. దయచేసి అమర్ కి ఓట్ వేయండి అని మానస్ ప్రేక్షకులని కోరాడు. 

67

దయచేసి అమర్ ఎలాగైనా టైటిల్ గెలిచేలా సపోర్ట్ చేయండి అంటూ అరియనా వేడుకుంది. నాకైతే పక్కాగా అమర్ గెలుస్తాడనే అనిపిస్తోంది. అమర్ వల్ల నాకు మానస్ కూడా మంచి ఫ్రెండ్ అయ్యాడు. ఆ తర్వాత అరియనా మానస్ పెళ్లి గురించి ఫన్నీ కామెంట్స్ చేసింది. 

77

మానస్ రీసెంట్ గా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. 'కొత్త పెళ్ళికొడకా.. ఎలా ఉంది సంసారం' అంటూ అరియనా మానస్ ని ఫన్నీగా కెలికింది. ఒకే ఒకే అవన్నీ ఇప్పుడు వద్దు.. అమర్ దీప్ కి ఓట్ వేయండి అంటూ మానస్ టాపిక్ మార్చేశాడు. వీళ్ళిద్దరూ అమర్ కి సపోర్ట్ చేయడం తో ఇతర కంటెస్టెంట్స్ అభిమానులు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajinikanth వెక్కి వెక్కి ఏడ్చిన క్షణం... సూపర్ స్టార్ కన్నీళ్ల వెనుక కథ ఏంటో తెలుసా?
Recommended image2
Vijay-Rashmika: హనీమూన్ కి విజయ్- రష్మిక.. ఒక్కరాత్రికి రూమ్ రేటు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!
Recommended image3
Rama Prabha : కుక్క తోక వంకర అంటూ.. రమాప్రభ ను అవమానించిన స్టార్ హీరో భార్య ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved