MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కాజల్‌ బండారం బయటపెడతానంటూ ఆనీ మాస్టర్‌ వార్నింగ్‌.. పీక్‌లోకి వెళ్లిన సిరితో రచ్చ .. ఎంటర్‌టైనర్‌గా సన్నీ

కాజల్‌ బండారం బయటపెడతానంటూ ఆనీ మాస్టర్‌ వార్నింగ్‌.. పీక్‌లోకి వెళ్లిన సిరితో రచ్చ .. ఎంటర్‌టైనర్‌గా సన్నీ

సోమవారం నామినేషన్ల ప్రక్రియ అనంతరం మంగళవారం ఎపిసోడ్‌ మరింత హీటెక్కించింది. ముఖ్యంగా అనీ మాస్టర్‌, సిరి, కాజల్‌ల మధ్య గొడవ హైలైట్‌గా నిలిచింది. ఆనీ మాస్టర్‌ చాలా సీరియస్‌ అయ్యారు.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 13 2021, 12:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బిగ్‌బాస్‌5 ఆరో వారం గేమ్‌ మరింత రసవత్తరంగా నామినేషన్ల ప్రక్రియలోనే ఇంటిసభ్యులు రెచ్చిపోయారు. ఇంట్లో ఉన్నంత సేపు బాగానే ఉంటున్నారు. కానీ నామినేషన్ల విషయానికి వచ్చేసరికి మర్చిపోయిన విషయాలను తోడుకొచ్చుకుంటూ నామినేట్‌ చేస్తున్నారు. సోమవారం నామినేషన్ల ప్రక్రియ అనంతరం మంగళవారం ఎపిసోడ్‌ మరింత హీటెక్కించింది. ముఖ్యంగా అనీ మాస్టర్‌, సిరి, కాజల్‌ల మధ్య గొడవ హైలైట్‌గా నిలిచింది. ఆనీ మాస్టర్‌ చాలా సీరియస్‌ అయ్యారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

సోమవారం ఎపిసోడ్‌లో నామినేషన్లు పూర్తయిన తర్వాత ఇంటి సభ్యులు తమ నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి చర్చించుకున్నారు. ఈ కమ్రంలోనే సిరి, జెస్సీలతో షణ్ముఖ్‌ ఓ మంచి పంచ్‌ వేశారు. ఐన్‌స్టీన్‌ ఈ e=mc2 ఎందుకు కనిపెట్టాడో కూడా కనుక్కోవచ్చు. కానీ ఈ ఎలిమినేషన్స్ అర్థం కావు` అని చెప్పడం నవ్వులు పూయించింది. నామినేషన్ల ప్రక్రియ ఎంత కష్టంగా ఉంటుందో అనే విషయాన్ని షణ్ముఖ్‌ చెప్పారు. 
 

37

మరోవైపు శ్రీరామ్‌, కాజల్‌ మధ్య కూడా బ్రేకప్‌లు జరిగాయి. తనకు ఎమోషన్స్ తో పనిలేదని, ఇక్కడకు ఓ స్ట్రాటజీతో వచ్చానని, తన గేమ్‌ తాను ఆడతానని తెలిపింది కాజల్‌. ఎమోషన్స్, రిలేషన్స్ కి తనకు అవసరం లేదని తెలిపింది. అందులో భాగంగా శ్రీరామ్‌తో ఉన్న అన్నా చెల్లి అనుబంధానికి బ్రేకప్‌ చెప్పింది. అంతేకాదు `బ్రేకప్‌ బ్రో. చరిత్రలో బ్రదర్‌ అండ్‌ సిస్టర్‌ బ్రేకప్‌ ఫస్ట్ టైమ్‌ కదా` అంటూ చెప్పుకొచ్చింది. 

47

కెప్టెన్సీ టాస్క్ ని స్టార్ట్ చేశాడు బిగ్‌బాస్‌. వచ్చే వారానికిగానూ కెప్టెన్సీకి పోటీదారుల టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులకు `బీబీ బొమ్మల ఫ్యాక్టరీ` పేరుతో టాస్క్ ఇచ్చాడు. ఇందులో సభ్యులు నాలుగు టీమ్‌లుగా విడిపోయి, బిగ్‌బాస్‌ ఇచ్చిన బొమ్మల ముక్కలను పట్టుకుని వాటిని బొమ్మకి అమర్చి పర్‌ఫెక్ట్ టెండీలను తయారు చేయాల్సి ఉంటుంది. ఇందులో మాసన్‌, సన్నీ, ఆనీ మాస్టర్‌ బ్లూ టీమ్‌లో, షణ్ముఖ్‌, జెస్సీ,  ప్రియాంకలు ఎల్లో టీమ్‌, విశ్వ, శ్రీరామ్‌,  ప్రియా రెడ్‌ టీమ్‌, రవి, లోబో,  శ్వేత గ్రీన్‌ టీమ్‌లుగా ఉన్నారు. 
 

57

బ్లూ, ఎల్లో టీమ్‌లకు కాజల్‌ సంచాలకురాలుగా, రెడ్‌, గ్రీన్‌ టీమ్‌లకు సిరి సంచాలకురాలిగా ఉన్నారు. ఈ నాలుగు టీమ్‌ సభ్యులు బిగ్‌బాస్‌ నిర్ణయించిన టైమ్‌లో ఎన్ని బొమ్మలను తయారు చేస్తారు, అవి కరెక్ట్ గా ఉన్నాయా లేవా అనేది అపోజిట్‌ టీమ్‌ సంచాలకులు నిర్ణయిస్తారు. ఈ టాస్క్ లో ఇంటి సభ్యులు యాక్టీవ్‌గా పాల్గొన్నారు. ఎప్పటిలాగే తమ ప్రాణం పెడుతున్నారు. కానీ ఆనీ మాస్టర్‌ చెప్పిన ఓ విషయం ఇప్పుడు వివాదంగా మారింది. 

67

పక్క టీమ్‌ వాళ్లు మోసం చేస్తున్నారని,గేమ్‌ల సరిగా ఆడటం లేదని సిరికి ఆనీ మాస్టర్‌ చెప్పింది. దీంతో సిరి  తాను అది చూడలేదని, చూసిందే తప్పా? రైటా అనేది చెబుతానని, బొమ్మలు ఎంపిక చేయడంలో తాను మీ వైపే ఉన్నానని తెలిపింది. కానీ ఆనీ మాస్టర్‌ చెప్పిన విషయం సిరి తీసుకోకపోవడంతో ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. సిరిపై అనీ మాస్టర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. డ్రామాలు ఆడటం రాదని, తన మనసులో ఉన్నదే చెబుతానని తెలిపింది. 

77

సిరిని ఓ రేంజ్‌లో ఆడుకుంది ఆనీ మాస్టర్‌. అంతేకాదు కాజల్ని కూడా వదల్లేదు. కాజల్ తనతో ఎన్నో విషయాలు చెప్పారని అవి చెబుతే  ఆమె ఆట తీరు పట్ల, కాజల్‌ కూతురు ఏమనుకుంటుందో అని వేచి చూస్తున్నానని, లేదంటే కాజల్‌ బండారం మొత్తం బయపెట్టస్తానని తెలిపింది. పరోక్షంగా కాజల్‌కి వార్నింగ్‌ ఇచ్చింది. ఈ విషయంలోనే సిరి సైతం ఫైర్‌ అయ్యింది. కానీ షణ్ముఖ్‌ వెయింట్‌ చేయాలని తెలిపారు. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Raghavendra Rao: ఈ వయసులో ఇవేం పనులు, దర్శకేంద్రుడిపై మండిపడుతున్న నెటిజన్లు
Recommended image2
Nagabandham Trailer Review: అనంత పద్మనాభస్వామి ఆలయ రహస్యాలు, నాగబంధం ట్రైలర్ రివ్యూ..
Recommended image3
Veturi: 'యమహానగరి..కలకత్తాపురి' పాటపై వేటూరి తీరని అసంతృప్తి.. ఎందుకంటే..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved