MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Bigg Boss Telugu 8: బిగ్ బాస్ షోలో A సర్టిఫికెట్ కంటెంట్... హౌస్లోకి ఆ ఇద్దరు హాట్ యాంకర్స్, జనాలకు పండగే!

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ షోలో A సర్టిఫికెట్ కంటెంట్... హౌస్లోకి ఆ ఇద్దరు హాట్ యాంకర్స్, జనాలకు పండగే!

బిగ్ బాస్ తెలుగు 8కి రంగం సిద్ధమైంది. బోల్డ్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఆ ఇద్దరు హాట్ యాంకర్స్ హౌస్లోకి రావడం ఖాయమే అని తేలిపోయింది. తాజా ఇంటర్వ్యూలో వారు క్లారిటీ ఇచ్చారు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Jul 30 2024, 07:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Bigg boss telugu 8

Bigg boss telugu 8

 బిగ్ బాస్ షోపై ఎన్ని విమర్శలు ఉన్నా... ప్రేక్షకాదరణ దృష్టిలో ఉంచుకుని నిర్వాహకులు కొనసాగిస్తున్నారు. కొన్ని కారణాల వలన బిగ్ బాస్ సీజన్ 6 ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దాంతో బిగ్ బాస్ సీజన్ 7 సరికొత్తగా రూపొందించి మేకర్స్ సక్సెస్ అయ్యారు. ఎన్నడు లేని విధంగా సీజన్ 7 టీఆర్పీ రాబట్టింది. 

 

26

టాస్క్స్, గేమ్స్, రూల్స్ మార్చడం కూడా ప్లస్ అయ్యింది. సామాన్యుడిగా హౌస్లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయ్యాడు. సీజన్ 7 సక్సెస్ నేపథ్యంలో సీజన్ 8 కూడా విభిన్నంగా ప్లాన్ చేస్తున్నారట. ఈసారి బిగ్ బాస్ షోలో రెండు హౌస్లు ఉంటాయనే ప్రచారం జరుగుతుంది.
 
 

36
Bigg Boss Telugu 8 Logo

Bigg Boss Telugu 8 Logo

ఇక కంటెస్టెంట్స్ ఎంపిక దాదాపు పూర్తి అయ్యింది. అమృత ప్రణయ్, నటుడు అలీ తమ్ము ఖయూమ్ అలీ, మై విలేజ్ షో అనిల్, స్వాతి నాయుడు, సోనియా సింగ్, కుమారీ ఆంటీ ఎంపిక అయ్యారని తెలుస్తుంది. వేణు స్వామి, వినోద్ కుమార్, అంబటి రాయుడు, అబ్బాస్, నటుడు రోహిత్.. ఇలా కొన్ని క్రేజీ నేమ్స్ కూడా తెరపైకి వచ్చాయి. 

46

కాగా ఇద్దరు హాట్ యాంకర్స్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లడం ఖాయమే అంటున్నారు. వారు విష్ణుప్రియ, రీతూ చౌదరి. వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. కలిసి విందులు, విహారాలు ఎంజాయ్ చేస్తుంటారు. సోషల్ మీడియా వేదికగా గ్లామరస్ ఫోటో షూట్స్ తో హోరెత్తిస్తూ ఉంటారు. రీతూ చౌదరి, విష్ణుప్రియలు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ షోకి వెళుతున్నారట కదా... అని యాంకర్ అడిగారు. 


 

56
Rithu Chowdary-Vishnupriya

Rithu Chowdary-Vishnupriya

మీరిద్దరూ బిగ్ బాస్ హౌసులోకి వెళుతున్నారని గట్టి ప్రచారం జరుగుతుంది. దీనికి మీ ఆన్సర్ ఏమిటనగా?...  బిగ్ బాస్ హౌస్లోకి వెళితే ఓ పది కేజీల బరువు తగ్గుతానేమో అని ఎదురు చూస్తున్నాను. నాకు బిగ్ బాస్ షోకి వెళ్ళాలని లేదు. కానీ ప్రేక్షక దేవుళ్ళ కోరిక ఫలిస్తే వెళతానేమో. నన్ను బిగ్ బాస్ హౌస్లో చూడాలని చాలా మంది కోరుకుంటున్నారు. వాళ్ళ ప్రార్థనలు నిజమైతే నన్ను బిగ్ బాస్ హౌస్లో చూడొచ్చు... అని విష్ణుప్రియ క్లారిటీ ఇచ్చింది. 

66

నాది కూడా సేమ్ ఆన్సర్ అని రీతూ చౌదరి పరోక్షంగా హింట్ ఇచ్చింది. వారి సమాధానాలను బట్టి చూస్తే బిగ్ బాస్ షోకి విష్ణుప్రియ, రీతూ చౌదరి దాదాపు ఎంపికయ్యారనిపిస్తుంది. సోషల్ మీడియాలో పొట్టిబట్టల్లో రెచ్చిపోయే వీరిద్దరూ హౌస్లోకి వెళితే... గ్లామర్ షోతో రచ్చ చేస్తారు అనడంలో సందేహం లేదు. బిగ్ బాస్ 8లో A సర్టిఫికెట్ కంటెంట్ గ్యారంటీ...

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
Latest Videos
Recommended Stories
Recommended image1
త్రిష తో జంటగా నటించడం వల్ల స్టార్ గా మారిన హీరో ఎవరో మీకు తెలుసా? ఇప్పుడేం చేస్తున్నాడంటే?
Recommended image2
OTT Movies: దద్దరిల్లే క్లైమాక్స్ ట్విస్ట్ ల కోసం ఈ 5 సినిమాలు ఓటీటీలో చూడాల్సిందే..గూస్ బంప్స్ గ్యారెంటీ
Recommended image3
Khushbu Sundar Weight Loss: ఖుష్బూ చెప్పిన ఈ పనిచేస్తే చాలు మీరు ఏనుగులా ఉన్నా సరే దెబ్బకి స్లిమ్‌ అయిపోతారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved