MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కొన్నాళ్ళు అన్నీ వదిలేసి అలా... వారణాసిలో తేలిన యాంకర్ విష్ణుప్రియ, షాకింగ్ లుక్ వైరల్!

కొన్నాళ్ళు అన్నీ వదిలేసి అలా... వారణాసిలో తేలిన యాంకర్ విష్ణుప్రియ, షాకింగ్ లుక్ వైరల్!

యాంకర్ విష్ణుప్రియ లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుంది. వారణాసి వెళ్లిన విష్ణుప్రియ ఆధ్యాత్మిక బాట పెట్టింది. విష్ణుప్రియ సరికొత్త అవతారం షాక్ ఇస్తుంది.  

1 Min read
Author : Sambi Reddy
Published : Jul 22 2023, 04:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Vishnupriya

Vishnupriya


విరామం దొరికితే మలేసియా, థాయిలాండ్ అంటూ రొమాంటిక్ ప్లేసెస్ కి చెక్కేసే విష్ణుప్రియ ఈసారి ఆధ్యాత్మికత వైపు అడుగులు వేసింది. ప్రముఖ శివక్షేత్రం వారణాసిలో తేలింది. కొద్దిరోజులు వృత్తి పరమైన విషయాలు పక్కన పెట్టి భక్తి పారవశ్యంలో మునుగుతుంది. 

 

26

విష్ణుప్రియ తన వారణాసి ట్రిప్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. కాగా విష్ణుప్రియ నటిగా బిజీ అవుతున్నారు. ఆమె నటించిన వెబ్ సిరీస్ దయ ఆగస్టు 4 నుండి హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుంది. ఈ సిరీస్లో విష్ణుప్రియ కీలక రోల్ చేశారు. 

36


చక్రవర్తి, ఈషా రెబ్బా ప్రధాన పాత్రలు చేశారు. గత ఏడాది విష్ణుప్రియ వాంటెడ్ పండుగాడ్ మూవీలో నటించిన విషయం తెలిసిందే. దర్శకుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో తెరకెక్కిన వాంటెడ్ పండుగాడ్ విజయం సాధించలేదు. సునీల్, వెన్నెల కిషోర్, అనసూయ వంటి స్టార్స్ ఆ చిత్రంలో నటించారు. 

46


ఆ మధ్య విష్ణుప్రియ ఫేస్ బుక్ అకౌంట్లో నగ్న, అశ్లీల ఫోటోలు దర్శనం ఇచ్చాయి. ఆ అర్థనగ్న ఫోటోలు విష్ణుప్రియవే అని కొందరు అభిప్రాయపడ్డారు.ఈ వీడియోలు, ఫోటోలపై విష్ణుప్రియ స్వయంగా స్పందించారు. ఆమె ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో వీడియో పోస్ట్ చేశారు. సదరు వీడియోలో తన ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయినట్లు వెల్లడించింది. దయచేసి అందరూ తన ఫేస్ అకౌంట్ ని అన్ ఫాలో అవ్వండి, రిపోర్ట్ చేయండని కోరుకున్నారు. 

56

ఇటీవల విష్ణుప్రియ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆమె తల్లి కన్నుమూశారు. దీనికి ఆమె చాలా ఆవేదన చెందారు. తల్లితో తనకున్న జ్ఞాపకాలు పంచుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ఇక నటిగా సత్తా చాటాలని విష్ణుప్రియ కోరుకుంటున్నారు.
 

66
Vishnupriya

Vishnupriya


యూట్యూబ్ లో కామెడీ వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్ చేసిన విష్ణుప్రియ పోవే పోరా షోతో యాంకర్ అయ్యారు. సుడిగాలి సుధీర్, విష్ణుప్రియ కలిసి చేసిన ఈ యూత్ఫుల్ షో పర్లేదు అనిపించుకుంది. ఆ విధంగా బుల్లితెర యాంకర్ గా ప్రమోషన్ పొందింది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Shraddha Kapoor Net Worth: ప్రభాస్‌ హీరోయిన్‌ లగ్జరీ లైఫ్ స్టయిల్‌ చూస్తే మతిపోవాల్సిందే.. వందల కోట్ల ఆస్తులు
Recommended image2
Trisha Krishnan: పెళ్లిపై త్రిష అదిరిపోయే రియాక్షన్‌.. ఎప్పుడు, ఎవరిని చేసుకుంటుందో చెప్పిన స్టార్‌ హీరోయిన్‌
Recommended image3
Virosh Sangeeth Party: తెల్లవారుజామున 4 గంటల వరకు సంగీత్‌ పార్టీ.. నవాబ్‌లను తలపించే లుక్‌.. విజయ్‌, రష్మిక ఎమోషనల్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved