MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • డబుల్ మీనింగ్ డైలాగులతో కరాటే కళ్యాణి, కృష్ణ భగవాన్ రచ్చ.. యాంకర్ సుమకి దిమ్మతిరిగిందిగా..

డబుల్ మీనింగ్ డైలాగులతో కరాటే కళ్యాణి, కృష్ణ భగవాన్ రచ్చ.. యాంకర్ సుమకి దిమ్మతిరిగిందిగా..

యాంకర్ సుమ హోస్ట్ గా చేస్తున్న షో క్యాష్. ప్రతి వారం ఈ షో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ దూసుకుపోతోంది. సుమ చలాకీగా ఉంటూ.. సందర్భానుసారంగా వేసే కామెడీ పంచ్ లు అలరిస్తూ ఉంటాయి.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 07 2022, 08:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యాంకర్ సుమ హోస్ట్ గా చేస్తున్న షో క్యాష్. ప్రతి వారం ఈ షో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ దూసుకుపోతోంది. సుమ చలాకీగా ఉంటూ.. సందర్భానుసారంగా వేసే కామెడీ పంచ్ లు అలరిస్తూ ఉంటాయి. అలాగే షోకి హాజరైన అతిథుల్ని కూడా సుమ ఉత్సాహ పరుస్తూ ఉంటుంది. 

26

తాజాగా క్యాష్ షోకి సీనియర్ కమెడియన్లు పృథ్వీ రాజ్, కృష్ణ భగవాన్, నటి జ్యోతి, కరాటే కళ్యాణి అతిథులుగా హాజరయ్యారు. వీరంతా కలసి ఒక రేంజ్ లో హంగామా చేసినట్లు ఉన్నారు. తాజాగా క్యాష్ ప్రోమో విడుదలై ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఎప్పటిలాగే కృష్ణ భగవాన్ తన సెటైర్స్ తో బాగా నవ్వించాడు. ఆ సెటైర్లకు బలైంది మాత్రం కమెడియన్ పృథ్వీనే. 

36

ఇక వెండి తెరపై నాటీ మేనరిజమ్స్ తో కవ్వించే కరాటే కళ్యాణి, జ్యోతి ఇద్దరూ క్యాష్ షోలో రెచ్చిపోయారు. వీరంతా కలసి సినిమా ఆడియో ఫంక్షన్ అనే సరదా స్కిట్ చేశారు. ఆ చిత్రంలో హీరో కమెడియన్ పృథ్వీ. దర్శకుడు కృష్ణ భగవాన్. నిర్మాత కరాటే కళ్యాణి కాగా.. ఈచిత్ర ఆడియో వేడుకకి యాంకర్ గా జ్యోతి చేసింది. 

46

ఈ స్కిట్ లో కృష్ణ భగవాన్, కరాటే కళ్యాణి ఒక రేంజ్ లో డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోయారు. వారి డబుల్ మీనింగ్ డైలాగులకు సుమ నోటి వెంట మాట కూడా రాలేదు. కృష్ణ భగవాన్ మాట్లాడుతూ.. ఈ చిత్ర షూటింగ్ కోసం హిమాలయాలకు వెళ్ళాం. అక్కడ హీరో పృథ్వీ చలికి తట్టుకోలేకపోయాడు. అందుకే తోడుగా ఇద్దరు హీరోయిన్లని ఇచ్చాం. అయినా కూడా చలికి తట్టుకోలేకపోయాడు అని చెప్పి నవ్వులు పూయించారు. 

56

నిర్మాతగా వ్యవహారించిన కరాటే కళ్యాణి మాట్లాడుతూ.. ఈ చిత్రం కోసం నేను అంతా సమర్పించేసుకున్నాను. నా జీవితం నాశనం అయింది. పృథ్విని చూపిస్తూ.. అమ్మ దీనెమ్మ బత్తాయో.. ఈ బత్తాయి మాత్రం పిండేసాడు బాగా.. అని చెప్పడంతో సుమ నోటి వెంట మాట రాలేదు. వాళ్ళ డబుల్ మీనింగ్ రచ్చకి సుమ ఇబ్బంది పడింది. 

66

అలాగే డాక్టర్స్ గెటప్ లో మరో స్కిట్ వేసి నవ్వించారు. పృథ్వి అర్జున్ రెడ్డి లాంటి డాక్టర్ అని జ్యోతి చెప్పగా.. ఆయన పశువుల డాక్టర్.. పశువులకు మాత్రమే అర్జున్ రెడ్డి అంటూ నవ్వులు పూయించారు. కృష్ణ భగవాన్ తన కామెడీ పంచ్ లతో పృథ్విని బాగా ఇరికించే ప్రయత్నం చేశాడు. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 10న ప్రసారం కానుంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: జ్యోకు దిమ్మతిరిగే షాక్- కూతురి పిల్లలకు ఆస్తి- దశరథ వీలునామా
Recommended image2
Prasad Behara: విరాజితతో సిరీస్ ఆపేయడానికి కారణం అదే.. ప్రసాద్ బెహరా కామెంట్స్
Recommended image3
Band Melam Movie Review: బ్యాండ్‌ మేళం మూవీ రివ్యూ, రేటింగ్‌.. `కోర్ట్` జంట నటించిన సినిమా ఎలా ఉందంటే ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved