MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రీసెంట్ గా తల్లయింది, స్టూడెంట్స్ దగ్గరకి అసభ్యకరమైన డ్రెస్ లో హీరోయిన్.. ట్రోలింగ్ కి ఆమె సమాధానం ఊహించలేం

రీసెంట్ గా తల్లయింది, స్టూడెంట్స్ దగ్గరకి అసభ్యకరమైన డ్రెస్ లో హీరోయిన్.. ట్రోలింగ్ కి ఆమె సమాధానం ఊహించలేం

ఇటీవల అమలాపాల్ లెవల్ క్రాస్ అనే చిత్రంలో నటించింది. రీసెంట్ గా విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటోంది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 27 2024, 01:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

డస్కీ బ్యూటీ అమలాపాల్ గురించి పరిచయం అవసరం లేదు. ఇద్దరమ్మాయిలతో, నాయక్ లాంటి చిత్రాలతో అమలాపాల్ టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకుంది. అయితే తన పర్సనల్ లైఫ్ లో జరిగిన ఒడిదుడుకులు, వివాదాలు ఆమెని మరింత స్ట్రాంగ్ గా మార్చాయి. అమలాపాల్ సినిమాల్లో సైతం గ్లామర్ రోల్స్ చేసి మెప్పించింది. 

 

26

గతంలో ఆమె వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.2014లో అమలాపాల్ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ని వివాహం చేసుకోగా విభేదాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత అమలాపాల్ తన సినిమాలతో బిజీ అయిపోయింది. గత ఏడాది అమలాపాల్ తన ప్రియుడు జగత్ దేశాయ్ ని ప్రేమ వివాహం చేసుకుంది. 

36

రీసెంట్ గా అమలాపాల్ ఓ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల అమలాపాల్ లెవల్ క్రాస్ అనే చిత్రంలో నటించింది. రీసెంట్ గా విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటోంది. ఈ చిత్రంలో అమలాపాల్, అసిఫ్ అలీ ప్రధాన పాత్రల్లో నటించారు. 

46

ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా అమలాపాల్ కేరళలోని ఎర్నాకులంలో ఓ కాలేజీని సందర్శించింది. విద్యార్థులతో కలసి ఆమె ఈవెంట్ లో పాల్గొంది. ఈ ఈవెంట్ కి అమలాపాల్ ధరించిన డ్రెస్ తీవ్ర వివాదంగా మారింది. బాగా పొట్టిగా ఉంటూ గ్లామర్ తో అసభ్యంగా కనిపించేలా ఉంది. 

56

వేదికపై ఆమె ఉన్న దృశ్యాలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. కాలేజ్ స్టూడెంట్స్ దగ్గరకి వెళ్ళినప్పుడు ఇంత అసభ్యకరమైన డ్రెస్ లో వెళతారా అంటూ నెటిజన్లు అమలాపాల్ ని దుమ్మెత్తి పోస్తున్నారు. అమలాపాల్ పై అంతకంతకు ట్రోలింగ్ పెరుగుతోంది. 

66

దీనితో అమలాపాల్ స్పందించింది. నేను కాలేజీకి వేసుకుని వెళ్లిన డ్రెస్ నాకు సౌకర్యంగా అనిపించింది. ఆ డ్రెస్ లో నన్ను చూస్తూ విద్యార్థులు కూడా ఎలాంటి అసౌకర్యానికి గురి కాలేదు. కెమెరాల్లో నన్ను చూపించిన విధానం వల్లే సమస్య అంటూ అమలాపాల్ ఊహించని కామెంట్స్ చేసింది. అది కెమెరా మెన్ల తప్పు అన్నట్లుగా మాట్లాడింది. తాను మోడ్రన్ డ్రెస్సులతో పాటు సాంప్రదాయ వస్త్రధారణలో కూడా కనిపిస్తానని అమలాపాల్ పేర్కొంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Anushka Shetty: నాగార్జున చెప్పిన ఈ ఒక్క మాటని ఇప్పటికీ ఫాలో అవుతున్న అనుష్క.. సినిమాలకు గుడ్‌ బై ఎప్పుడంటే
Recommended image2
Karthika Deepam 2 Today Episode: దోషిలా కార్తీక్- నింద తనపై వేసుకున్న దీప- దశరథను ఇరికించిన పారు
Recommended image3
Upasana: కొడుకు మరణంతో తల్లడిల్లిన తల్లి, ఉపాసన జీవితాన్ని మార్చిన ఘటన.. ఇంత జరిగిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved