MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • నిన్న బాలయ్యతో ..ఇప్పుడు ఎన్టీఆర్ తో..అరవింద్ స్ట్రాటజీ కేక కదా

నిన్న బాలయ్యతో ..ఇప్పుడు ఎన్టీఆర్ తో..అరవింద్ స్ట్రాటజీ కేక కదా

 అల్లు అరవింద్ మెల్లిమెల్లిగా నందమూరి కుటుంబంతో అనుబంధం పెంచుకుంటున్నారు. ఇన్నాళ్లూ మెగా కాంపౌండ్ కే పరిమితమైన తమ సంస్ద, బ్యానర్ ని నందమూరి వంశంతోనూ షేర్ చేసుకుంటున్నారు. 

3 Min read
Author : Surya Prakash
Published : Mar 30 2023, 06:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
Allu aravind

Allu aravind


స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ లెక్కలు ఎప్పుడూ వేరుగా ఉంటాయి. ఆయన బిజినెస్ స్ట్రాటజీలు చాలా మందికి అర్దం కావు. అర్దం అయ్యేలోగా ప్రొడక్ట్ బయిటకు వస్తుంది. రాబోయే ఐదేళ్లలో ఏ తరహా సినిమాలు ఆడతాయి..ఏ హీరోలకు స్టార్ తిరుగుతుందని తెలిసిన నిర్మాత ఆయన. తను అనుకున్నట్లు వాళ్లకు స్టార్ తిరగక పోతే తానే తిప్పుతారు అని అందరికి తెలుసున్న నిజం. ఆయన బిజినెస్ విషయంలో చాలా నిక్కచ్చిగా ఉంటారు. తన హీరోలతోనే సినిమాలు తీయాలి, షోలు చేయాలని రూల్ పెట్టుకోరు. ఏ ప్రాజెక్టు ఏ హీరోతో క్రేజ్ వస్తుంది అనిపిస్తే అటే ముందుకు వెళ్తారు. ఇదంతా మాట్లాడుకోవటానికి కారణం తాజాగా ఆయన రిజిస్టర్ చేసిన టైటిల్. ఆ టైటిల్ హీరో ఎవరనేది ఇప్పుడు అంతటా చర్చనీయాంసంగా మారింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29


 తాజాగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో డ్యాన్సర్ అనే టైటిల్ ని రిజిస్టర్ చేయటం అంతటా చర్చనీయాంశం అయ్యింది. ఈ టైటిల్ బట్టి మూవీ కచ్చితంగా డాన్స్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని ఎవరికైనా అర్దం అవుతుంది. ఈ నేపధ్యంలో బెస్ట్ డాన్సర్ ఎవరు ...ఈ సినిమాలో హీరోగా చేయటానికి అనేది అందరూ మాట్లాడుకునే విషయం. అల్లు అరవింద్ కేవలం తన కుటుంబ హీరోలతోనే సినిమాలు చేస్తే పెద్దగా డిస్కషన్ ఉండదు. కానీ ఆయన కథకు నప్పే హీరోతో ముందుకు వెళ్ళిపోతూంటారు. 
 

39


ఈ క్రమంలో   అల్లు అర్జున్ కోసమే రిజిస్టర్ చేయించిన టైటిల్ అనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఎందుకంటే బన్నీ మంచి డాన్సర్. ఓ టైమ్ లో బన్నీ డాన్స్ లకు జనాలు థియేటర్స్ కు పోటెత్తారు. మరో ప్రక్క రామ్ చరణ్ సైతం బ్రహ్మాండంగా డాన్స్ లు చేస్తున్నాడు. దాంతో ఆయనతో చేసే అవకాసం ఉంది. అల్లు అరవింద్ సొంత మేనమామ కాబట్టి డేట్స్ సమస్య రావు. మరి వీళ్లిద్దరు కాకుండా వేరే వారితో ఎందుకు వెళ్తారు.

49


అయితే అల్లు అర్జున్ వరసగా ప్రాజెక్టులు కమిటై ఉన్నారు. ప్రస్తుతం సుకుమార్ తోనూ, ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ, త్రివిక్రమ్ సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ పూర్తి చేసుకుని అల్లు అర్జున్ ఈ ప్రాజెక్టు దగ్గరకు రావాల్సి ఉంటుంది. అంతకాలం ఓ సబ్జెక్టుని ఫినిష్ చేసి అరవింద్ ఉంచరు.

59
RRR Movie

RRR Movie


మరో ప్రక్క రామ్ చరణ్ పరిస్దితికి వస్తే మరో మూడేళ్ల దాకా ఆయన వరస సినిమాలు కు కమిటై ఉన్నారు. శంకర్ తో చేస్తున్న RC15, గౌతమ్ తో చేస్తన్న RC16, RC17లు ఉన్నాయి.  ఇవన్నీ దాదాపు పాన్ ఇండియా సినిమాలే. దాంతో ఇవి  పూర్తి చేసి ఈ డాన్సర్ కోసం రావాలంటే అరవింద్ వెయిట్ చెయ్యాలి. కానీ ఆయన మూడేళ్లు ఓ హీరో కోసం వెయిట్ చెయ్యాల్సిన అవసరం ఏముంది. అవసరమైతే చరణ్ కోసం మరో కథ ,డైరక్టర్ ని రెడీ చేస్తారు.

69


నిజానికి డాన్సర్ టైటిల్ ఎవరైన సినిమా కోసం ఉపయోగించుకోవచ్చు. ఎన్టీఆర్ తో సినిమా  చేసే అవకాసం ఉందని కొందరంటున్నారు. తమ బ్యానర్ లో ఎన్టీఆర్ తో సినిమా చెయ్యలేదు కాబట్టి ప్యాన్ ఇండియా ప్రాజెక్టుగా ఈ డాన్సర్ ని ఎన్టీఆర్ తో చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో రిజిస్టర్ చేసారంటున్నారు. ఎన్టీఆర్ సైతం గతంలో సాగరసంగమం సినిమా రీమేక్ చేస్తే తాను చేయాలనే ఆలోచన చెప్పారు. కాబట్టి అలాంటి ప్రాజెక్టు అయ్యి ఉంటుందంటున్నారు.

79


ఎన్టీఆర్ తో అరవింద్ సినిమా నిజమైతే బాబాయ్..అబ్బాయ్ లతో చేస్తున్న ఘనత ఆయనదే. బాలకృష్ణతో ఆయన ఆహా కోసం షో చేస్తున్నారు. ఆ షో ఓ రేంజిలో క్లిక్ అయ్యింది. ఇప్పుడు ఎన్టీఆర్ తో సినిమా చేస్తే అదీ అదిరిపోతుంది. ఏది ఏమైనా డ్యాన్సర్ టైటిల్ కి తగినట్టుగా స్టోరీ ఉంటే అది మాత్రం వేరే రేంజ్ లో ఉంటుంది.
 

89


అయితే ఈ లోగా మరో వార్త తెలుగు మీడియాలో రన్ అవుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో గీతా ఆర్ట్స్  సినిమా ప్లాన్ చేసారని సమాచారం. తెలుగు దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. ఆ సినిమాకు తగ్గ ప్యాన్ ఇండియా కావచ్చు.    ఏది ఏమైనా డ్యాన్సర్ టైటిల్ కి తగినట్టుగా స్టోరీ ఉంటే అది మాత్రం వేరే రేంజ్ లో ఉంటుంది.

99


అయితే అరవింద్ దృష్టి మాత్రం ఇప్పుడు  దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన బలగం లాంటి సినిమా చెయ్యాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.  తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ఇంప్యాక్ట్ కలిగిస్తాయని ఆ కథల వేటలో ఉన్నారు గీతా ఆర్ట్స్ టీం. డ్యాన్సర్ టైటిల్ నిజంగానే అల్లు అర్జున్ తో చేస్తే మాత్రం సినిమా వీర లెవల్ లో ఉంటుందని చెప్పొచ్చు. టాలీవుడ్ లో ఎన్.టి.ఆర్, చరణ్ లకు సరి సమానంగా అల్లు అర్జున్ డ్యాన్స్ చేస్తుంటాడు. అందుకే డ్యాన్సర్ టైటిల్ అతనికైతే పర్ఫెక్ట్ అనేది నిజం.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved