- Home
- Entertainment
- Alia Ranbir Wedding: రణ్ బీర్ కు అలా పడిపోయిన ఆలియా భట్, ఇద్దరిని కలిపిన స్టార్ ప్రొడ్యూసర్ ఎవరంటే...?
Alia Ranbir Wedding: రణ్ బీర్ కు అలా పడిపోయిన ఆలియా భట్, ఇద్దరిని కలిపిన స్టార్ ప్రొడ్యూసర్ ఎవరంటే...?
బాలీవుడ్ ప్రేమ జంట ఆలియా భట్,రణ్ బీర్ కపూర్ పెళ్లి నిన్న(ఏప్రిల్14) ఘనంగా జరిగింది. పెళ్లి బట్టల్లో ఈ ఇద్దరిని చూసిన ఫ్యాన్స్ మురిసిపోయారు. 5 ఏళ్ళ ప్రేమకు పెళ్ళి బంధం తొడయ్యిందన్న ఆలియా.. రణ్ బీర్ కు ఎక్కడ.. ఎప్పుడు పడిపోయింది..? వీరిని కలిపింది ఎవరు..?

నిన్న(14 ఏప్రిల్) గురువారం బాలీవుడ్ లవ్ కపుల్ ఆలియా భట్,రణ్ బీర్ కపూర్ పెళ్ళి వేడుక ఘనంగా జరిగింది. రణ్ బీర్ ఇంట్లో.. కపూర్ ఫ్యామిలీ సాంప్రదాయాలప్రకారం, కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో వీరు ఘనంగా పెళ్లి చేసుకున్నారు.
ముందుగా ఎటువంటి ఫోటోలు,వీడియోలు బయటకు రాకుండా రహస్యంగా పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకున్నారు ఈ జంట, కాని నిన్న సాయంత్రమే ఆలియా స్వయంగా తన పెళ్ళి ఫోటోలు శేర్ చేస్తూ.. ఓచిన్న నోట్ రాసింది ఆలియా భట్, అత్యంత సన్నిహితమైన బంధువులు, స్నేహితుల మధ్య తమ పెళ్లి జరిగిందని.. దాదాపు 5 ఏళ్ళ తమ స్నేహాన్ని పెళ్లి బంధంతో శాస్వతం చేసుకున్నామంది.
వీరి పెళ్లి ఫోటోస్ క్షణాల్లో వైరల్ అయ్యాయి. ఇద్దరు జంట ఎంతో అందంగా.. పెళ్లి డ్రస్సులో క్యూట్ గా కనిపించడంతో నెటిజన్లు, ఫ్యాన్స్ ముచ్చట పడిపోతున్నారు. అంతే కాదు సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ ఈజంటను సోషల్ మీడియాలో విష్ చేస్తున్నారు.
దాదాపు ఐదేళ్ళకు పైగా ప్రేమించుకున్నారు ఈజంట. అసలు వీరిలో ఎవరు ముందు ప్రేమించారు, ఎవరు ఎవరికి ప్రపోజ్ చేశారు, ఇలాంటి విషయాలను రీసెంట్ గో ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు ఆలియా భట్. తాను రణ్ భీర్ కు ఎక్కడ పడిపోయిందో కూడా చెప్పారు ఆలియా.
సావరియా సినిమా చూసి రణ్ భీర్ కు పడియాపోయనంది ఆలియా భట్. ఈసినిమా తరువాత తనతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలిపోయిందట. 14 ఏళ్ళకే ప్రేమలో పడిందట ఆలియా భట్. అయితే వీరి ప్రేమ విషయంలో.. ఈ ఇద్దరిని కలిపే బాధ్యతను స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ తీసుకున్నారట.
రణ్ బీర్ సినిమాలన్నీ చూస్తూ.. ప్రేమలో ఉన్న తనకు కరణ్ జోహార్ సాయం చేశారట. రాక్ స్టార్ సినిమా ఈవెంట్ లో రణ్ బీర్ తో మాట్లాడించాడట. రణ్ భీర్ తో మాట్లాడు... తనంటే నీకు ఎంత ఇష్టమో చెప్పు అని కరణ్ ప్రోత్సహించాడట. దాంతో ఆలియా వెళ్లిన్ రణ్ బీర్ తో హడావిడిగా.. చకచకా మాట్లాడేసిందట.
అప్పటి నుంచీ వారి పరిచయం స్నేహంగా మారిందట. చిన్నగా రణ్ బీర్ కూడా తనను ఇష్టపడటం మొదలు పెట్టాడంటోంది ఆలియా భట్. అయితే తాము ప్రేమించుకోవడం మొదలెట్టినప్పటి నుంచే.. మానసికంగా తమ పెళ్లి జరిగిపోయిందంటోంది ఆలియా భట్.
చాలా కాలంగా ప్రేమించుకుంటున్న ఈ జంట సోషల్ మీడియాలో సందడి చేస్తూ వచ్చారు. చెట్టా పట్టాల్ వేసుకుని తిరుగుతూ కనిపించారు. రెండు మూడు సార్లు పెళ్ళికి సంబంధించిన ఏర్పాట్లు చేసినా.. కరోనా కారణంగా వాయిదా వేస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు ముహూర్తం పక్కాగా ఫిక్స్ చేసుకుని ఒక్కటైయ్యారు రణ్ భీర్,ఆలియా భట్.
ఇక, రణ్‌బీర్-అలియా పెళ్లి కోసం బాలీవుడ్ అంతా వెయ్యి కళ్ళతో ఎదురు చూసింది. ఇక అభిమానులైతే వీరి పెళ్ళిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.ఈ క్రమంలో వీరి పెళ్ళి వేడుక ముగియడంతో ఫ్యాస్ పండగ చేసుకుంటున్నారు. అంతే కాదు ఆలియా భట్ పెళ్లి ఫోటోలు షేర్ చేయడంతో దిల్ ఖుష్ అయ్యారు ఫ్యాన్స్,