MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Agadha 3 Days Collections: అగధకి బాక్సాఫీసు వద్ద పెద్ద షాక్‌, 3 రోజుల కలెక్షన్లు.. ఎంఎస్‌ రాజు బిగ్‌ మిస్టేక్‌

Agadha 3 Days Collections: అగధకి బాక్సాఫీసు వద్ద పెద్ద షాక్‌, 3 రోజుల కలెక్షన్లు.. ఎంఎస్‌ రాజు బిగ్‌ మిస్టేక్‌

Agadha 3 Days Collections: నిర్మాత, దర్శకుడు ఎంఎస్‌ రాజు రూపొందించిన `అగధ` మూవీ తొలి వీకెండ్‌ని పూర్తి చేసుకుంది. మరి మూడు రోజుల్లో ఈ చిత్రం ఎంత వసూలు చేసిందనేది చూస్తే, షాక్ అవ్వాల్సిందే.

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 17 2026, 08:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అగధతో దర్శకుడిగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తోన్న ఎంఎస్‌ రాజు
Image Credit : Asianet News

అగధతో దర్శకుడిగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తోన్న ఎంఎస్‌ రాజు

నిర్మాత ఎంఎస్‌ రాజు లేట్‌ వయసులో దర్శకుడిగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన నిర్మాతగా అనేక బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలు తీశారు. స్టార్‌ ప్రొడ్యూసర్‌గా రాణించారు. కానీ వరుస పరాజయాల తర్వాత నిర్మాణం పక్కన పెట్టారు. అదే సమయంలో తన కొడుకు సుమంత్‌ అశ్విన్‌ కెరీర్‌పై ఫోకస్‌ పెట్టారు. కొడుకుని నిలబెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఆయన కూడా హీరోగా సక్సెస్‌ కాలేకపోతున్నారు. దీంతో ఎంఎస్‌ రాజు దర్శకుడిగా మారి సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే `వాన`, `డర్టీ హరి`, `7నైట్స్ 6డేస్‌`, `మళ్లీ పెళ్లి` వంటి చిత్రాలను రూపొందించారు. ఇవి పెద్దగా ఆడలేదు. లేటెస్ట్ గా `అగధ` చిత్రాన్ని తెరకెక్కించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
హిట్‌ కోసం మిస్టరీ హర్రర్‌ థ్రిల్లర్‌ కాన్సెప్ట్ తో `అగధ`ని రూపొందించిన ఎంఎస్‌ రాజు
Image Credit : Asianet News

హిట్‌ కోసం మిస్టరీ హర్రర్‌ థ్రిల్లర్‌ కాన్సెప్ట్ తో `అగధ`ని రూపొందించిన ఎంఎస్‌ రాజు

కమర్షియల్‌ గా హీరో కొట్టాలని, దర్శకుడిగా సక్సెస్‌ కావాలనే తపనతో మిస్టరీ హర్రర్‌ థ్రిల్లర్‌ `అగధ` చిత్రాన్ని రూపొందించారు ఎంఎస్‌ రాజు. హర్రర్‌, సస్పెన్స్ థ్రిల్లర్‌ చిత్రాలు కంటెంటే బాగుంటే మంచి ఆదరణ పొందుతాయి. హిట్ కొట్టడం ఈజీ. దీంతో ఎంఎస్‌ రాజు కూడా అదే ప్లాన్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్ర పోషించగా, శ్రావణ్‌ రెడ్డి, భానుచందర్‌, వనితా విజయ్‌ కుమార్‌, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌ కుమార్‌ వంటి వారు ఇతర పాత్రలు పోషించారు. ఈ మూవీ గత శుక్రవారం ఆడియెన్స్ ముందుకు వచ్చింది.

Related Articles

Related image1
Travel Movies: ఇంట్లో కూర్చునే ప్రపంచాన్ని చుట్టేయండి.. ఈ 5 సినిమాలు చూస్తే చాలు!
Related image2
Chiranjeevi: మటన్ పెట్టలేదని చెంప చెళ్లుమనిపించిన చిరంజీవి, మెగా సీక్రెట్ బయటపెట్టిన స్టార్ విలన్ ఎవరు?
34
అగధ మూవీ కలెక్షన్లు
Image Credit : Asianet News

అగధ మూవీ కలెక్షన్లు

సినిమా ప్రారంభం నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. థ్రిల్‌ చేయలేకపోయిందని, భయపెట్టలేకపోయిందనే విమర్శలు వచ్చాయి. స్లోగా సాగిందని, ఎంగేజ్‌ చేయలేకపోయిందంటున్నారు. అదే తరహాలో కలెక్షన్లు ఉన్నాయి. ఈ మూవీ పెద్ద రేంజ్‌ లో హిట్ అవుతుందని ఎంఎస్‌ రాజు ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ రిజల్ట్ మాత్రం తేడా కొట్టింది. ఇప్పటి వరకు ఈ మూవీ కోటి వరకు మాత్రమే కలెక్షన్లని రాబట్టింది. మూడు రోజుల్లో ఈ సినిమా రూ.1.17కోట్లు(ఇండియాలో) రాబట్టింది. మూడో రోజు రూ.39లక్షలు వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఇది సుమారుగా రూ.1.30కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్‌ సైట్ల సమాచారం.

44
అగధ హిట్‌ కావాలంటే ?
Image Credit : Asianet News

అగధ హిట్‌ కావాలంటే ?

`అగధ` మూవీ విజయం సాధించాలంటే, హిట్‌ దిశగా వెళ్లాలంటే ఐదో కోట్ల షేర్‌ రావాలి. అంటే పది కోట్ల గ్రాస్‌ వసూలు చేయాల్సి ఉంటుంది. మూడు రోజుల్లో ఈ మూవీ కోటి మాత్రమే దాటింది. సోమవారం నుంచి వీక్‌ డేస్ స్టార్ట్ అవుతాయి. కలెక్షన్లు సగానికి పడిపోతాయి. దీంతో ఈ మూవీ భారీ స్థాయిలో డ్రాప్‌ అయ్యే అవకాశాలున్నాయి. ఈ లెక్కన ఇది బ్రేక్‌ ఈవెన్‌ వరకు వెళ్లడం కష్టమే అని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకి సుమారు పది కోట్ల బడ్జెట్‌ అయ్యిందని సమాచారం. ఓటీటీ కూడా ఇంకా అమ్మలేదు. సినిమాపై నమ్మకంతో ఎంఎస్‌ రాజు ఓటీటీ అమ్మలేదని టాక్‌. ముందే అమ్మి ఉంటే చాలా వరకు సేఫ్‌ అయ్యేవాళ్లు. ఇది ఆయన చేసిన పొరపాటుగానే చెప్పొచ్చు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Srikanth: స్టార్ హీరో ఆఫర్లన్నీ కొట్టేసిన శ్రీకాంత్.. మాస్ హీరో కామ్‌గా ఉండటానికి కారణమేంటో తెలుసా?
Recommended image2
ANR: పెళ్లై పిల్లలున్న హీరోయిన్‌తో ఏఎన్నార్ ఆన్ స్క్రీన్ రొమాన్స్... 275 రోజులు ఆడి రికార్డు సృష్టించిన సినిమా ఏదో తెలుసా?
Recommended image3
Ashika Ranganath: ఫ్లోరల్ ప్రింట్ చీరలో ఆషికా రంగనాథ్‌ మతిపోయే పోజులు.. హైలైట్‌ ఇదే
Related Stories
Recommended image1
Travel Movies: ఇంట్లో కూర్చునే ప్రపంచాన్ని చుట్టేయండి.. ఈ 5 సినిమాలు చూస్తే చాలు!
Recommended image2
Chiranjeevi: మటన్ పెట్టలేదని చెంప చెళ్లుమనిపించిన చిరంజీవి, మెగా సీక్రెట్ బయటపెట్టిన స్టార్ విలన్ ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved