MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Chiranjeevi: మటన్ పెట్టలేదని చెంప చెళ్లుమనిపించిన చిరంజీవి, మెగా సీక్రెట్ బయటపెట్టిన స్టార్ విలన్ ఎవరు?

Chiranjeevi: మటన్ పెట్టలేదని చెంప చెళ్లుమనిపించిన చిరంజీవి, మెగా సీక్రెట్ బయటపెట్టిన స్టార్ విలన్ ఎవరు?

Chiranjeevi: ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతో మందికి ఎన్నో విధాలుగా సాయం చేశాడు మెగాస్టార్ చిరంజీవి. ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా..సాయంలో ఆయన ముందుంటాడు. ఓసారి మటన్ విషయంలో ఏం జరిగిందంటే?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 16 2026, 09:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఘరానా మొగుడు’ షూటింగ్‌లో జరిగిన సంఘటన..
Image Credit : sun nxt

ఘరానా మొగుడు’ షూటింగ్‌లో జరిగిన సంఘటన..

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి తన అద్భుతమైన నటనతో మాత్రమే కాదు.. తోటి నటీనటులు, సాంకేతిక నిపుణుల పట్ల చూపించే ఆప్యాయత, మానవత్వంతో ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఆయన చేసిన సాయాలు అందుకుని గొప్పవాళ్లు అయినవారు చాలామంది ఉన్నారు. ఇక మెగాస్టార్ కెరీర్ లో నటించిన ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘ఘరానా మొగుడు’ . ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటనను ఆ సినిమా నటుడు నటుడు, ఫైటర్ పొన్నంబలం ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మటన్ కోసం అలిగిన స్టార్ విలన్..
Image Credit : our own

మటన్ కోసం అలిగిన స్టార్ విలన్..

పొన్నంబలం చాలా పెద్ద విలన్ ఆయనతో యాక్షన్ సీన్స్.. అందులో హీరోతో సోలో ఫైట్ పడిందంటే.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయినట్టే. ఇక ఈ సినిమాలోని క్లైమాక్స్ ఫైట్ షూటింగ్ టైమ్ లో పొన్నంబలం ఎంతో శ్రమతో కూడుకున్న సోలో ఫైట్ సన్నివేశాల్లో నటిస్తున్నారు. తీవ్రమైన శారీరక శ్రమ చేయడం వల్ల ఆయనకు విపరీతమైన ఆకలి వేసి, మధ్యాహ్నం భోజనంలో తన శక్తి కోసం ప్రొడక్షన్ వారిని మటన్ కావాలని కోరారు. అయితే, ఆ రోజు షూటింగ్ సెట్‌లో సుమారు 500 మందికి పైగా ఉన్న యూనిట్ సభ్యులందరికీ చికెన్ మాత్రమే అందుబాటులో ఉంది, మటన్ దొరకలేదు. తనకు ఇష్టమైన, ఎనర్జీనిచ్చే మటన్ దొరకలేదనే నిరాశతో పొన్నంబలం షూటింగ్‌లో పాల్గొనకుండా నిరసన తెలియజేసి కూర్చున్నారు.

Related Articles

Related image1
JVAS Movie Review: 15 రోజులు బెడ్ పైనే చిరంజీవి, ప్రాణాలకు తెగించి మెగాస్టార్ చేసిన సాహసం, జగదేకవీరుడు అతిలోకసుందరి రివ్యూ
Related image2
Asha Chocolate: 90s కిడ్స్ ఫేవరెట్ ఆశ చాక్లెట్ ఎందుకు ఆగిపోయింది? 10 దేశాల్లో అమ్ముడుపోయిన ఆశ ఎలా మాయమయ్యింది?
34
మెగాస్టార్ చిరంజీవి ఏం చేశాడంటే?
Image Credit : Asianet News

మెగాస్టార్ చిరంజీవి ఏం చేశాడంటే?

చిరంజీవి గారు సెట్‌లోకి వచ్చి పరిస్థితిని గమనించి, షూటింగ్ ఎందుకు జరగడం లేదని విచారించారు. ప్రొడక్షన్ మేనేజర్లు పొన్నంబలానికి మటన్ లభించకపోవడం వల్లే ఆయన ఫైట్ చేయడం లేదని చెప్పగా..వెంటనే చిరంజీవి పొన్నంబలం ను పిలిచి అసలు విషయం కనుకున్నారు. మటన్ పెట్టనందుకు ప్రొడక్షన్ అతన్ని లాగి పెట్టి కొట్టాడట. ఈ విషయాన్ని పొన్నం బలం స్వయంగా చెప్పారు. అంతే కాదు . "ఆయన హెవీ ఫైట్ చేస్తున్నారు, ఆయనకు ఎనర్జీ కావాలి కదా! నేను కూడా మటన్ ప్రియుడినే" అంటూ చిరంజీవి నవ్వుతూ, వెంటనే ప్రొడక్షన్ వారిని పొన్నంబలం కోసం బయటి హోటల్ నుండి మటన్ తెప్పించాలని ఆదేశించారు.

44
చివరకు సాధించుకున్న పొన్నంబలం...
Image Credit : Asianet News

చివరకు సాధించుకున్న పొన్నంబలం...

చిరంజీవి ఆదేశంతో ప్రత్యేకంగా అరకిలో మటన్ తెప్పించారు. కడుపునిండా మటన్ తిన్న పొన్నంబలం ఎంతో సంతోషించి, రెట్టింపు ఉత్సాహంతో సెట్‌లోకి వచ్చి చిరంజీవితో రెడీ సార్ ఎనర్జీ వచ్చింది చేసేద్దాం అని వచ్చారట. అప్పటికే చిరంజీవి కూడా మటన్ తినడంతో.. నాకు ఫుల్ గా ఉంది.. ఇక ఈ సీన్ రేపు చేద్దాం.. నీకు కావల్సింది ఆర్డర్ చేసుకుని తిను, ప్రశాంతంగా ఫైట్ చేయి" అని పొన్నం బలంకి చిరంజీవి చెప్పారట. ఆతరువాత రోజు ఇద్దరు కలిసి అద్భుతంగా ఫైట్ సీన్లు పూర్తి చేశారు . ఒక చిన్న నటుడి లేదా ఫైటర్ ఆకలిని, అవసరాన్ని అర్థం చేసుకుని స్వయంగా మటన్ తెప్పించి తినిపించిన చిరంజీవి పెద్ద మనసు గురించి పొన్నంబలం రీసెంట్ గా వెల్లడించారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi 3 Days Collections: సండే హైయ్యెస్ట్, రవితేజ మూవీకి ఊహించని కలెక్షన్లు.. 3 రోజుల్లో వచ్చినవి ఇవే
Recommended image2
Tarun - Vadde Naveen: చిరు, బాలయ్య, పవన్ లకు పోటీ ఇచ్చిన కుర్ర హీరోలు.. ఒక్క సినిమాతో పతనం, అసలేం జరిగింది ?
Recommended image3
OTT: వారణాసి విలన్ థ్రిల్లర్ తో పాటు రోజా మూవీ కూడా ఓటీటీలోకి.. ఒంటరిగా చూడాల్సిన రొమాంటిక్ మూవీస్ రెడీ
Related Stories
Recommended image1
JVAS Movie Review: 15 రోజులు బెడ్ పైనే చిరంజీవి, ప్రాణాలకు తెగించి మెగాస్టార్ చేసిన సాహసం, జగదేకవీరుడు అతిలోకసుందరి రివ్యూ
Recommended image2
Asha Chocolate: 90s కిడ్స్ ఫేవరెట్ ఆశ చాక్లెట్ ఎందుకు ఆగిపోయింది? 10 దేశాల్లో అమ్ముడుపోయిన ఆశ ఎలా మాయమయ్యింది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved