MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • ఇప్పుడు రండి.. కార్తికేయ 2ని ఎవరాపుతారో చూసుకుందాం.. మరోసారి వివాదం రేపిన నటి

ఇప్పుడు రండి.. కార్తికేయ 2ని ఎవరాపుతారో చూసుకుందాం.. మరోసారి వివాదం రేపిన నటి

దేశవ్యాప్తంగా కార్తికేయ 2 చిత్రం సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో చందూ ముండేటి తెరకెక్కించిన ఈ చిత్రం 100 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 27 2022, 07:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

దేశవ్యాప్తంగా కార్తికేయ 2 చిత్రం సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో చందూ ముండేటి తెరకెక్కించిన ఈ చిత్రం 100 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. అసలు థియేటర్లే దొరకని పరిస్థితి నుంచి ఇండియా మొత్తం సంచలనం సృష్టించే స్థాయిలో ఈ చిత్రం విజయాన్ని నమోదు చేసుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ప్రస్తుతం కార్తికేయ 2కి పోటీగా బలమైన చిత్రాలు ఏవీ లేకపోవడం కూడా నిఖిల్ మూవీకి బాగా కలసి వస్తోంది. ఇటీవల విడుదలైన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. హిందీలో కార్తికేయ 2 క్రేజ్ విపరీతంగా ఉంది. మౌత్ టాక్ తోనే థియేటర్స్ కి జనాలు ఎగబడుతున్నారు. కర్నూలులో చిత్ర యూనిట్ గురువారం రోజు విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. 

36

ఈ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో సీనియర్ నటి తులసి చేసిన కామెంట్స్ వివాదంగా మారేలా కనిపిస్తున్నాయి. తులసి మాట్లాడుతూ.. ఈ మూవీ రిలీజ్ తర్వాత నాకు ఆస్ట్రేలియా నుంచి కాల్ వచ్చింది. ఈ చిత్ర దర్శకుడు టీచరా లేక లెక్చరర్ అని అడిగారు. ఈ చిత్రంలో ప్రతి అంశానికి అద్భుతమైన నిర్వచనం ఇచ్చారు అని ప్రశంసించారు. 

46

శ్రీకృష్ణుడు గురించి చందు ముండేటి మనకు అనేక విషయాలు గుర్తుకు చేశారు అని తులసి అన్నారు. కృష్ణుడు కూడా ఒక మనిషే.. చిన్నప్పుడు అల్లరివాడు.. ఆ తర్వాత కృష్ణుడు అన్ని విషయాలు నేర్చుకున్నాడు. తాను నేర్చుకున్న విషయాలని జనాలకు వదిలేశాడు అని తులసి తెలిపారు. 

56

మాది చిన్న సినిమానే. ఎలుక కూడానా చిన్నదే. ఎలుక చిన్న రంద్రం చేస్తే.. ఆ రంద్రంలోనుంచి చాలానే వచ్చేస్తాయి. ఆ రంద్రంలో నుంచి డైమండ్స్ కూడా తీసుకోవచ్చు అని తులసి అన్నారు. కార్తికేయ 2 చిత్రం పెద్ద ఆర్మీనే క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఎవరు ఆపగలరు.. చూసుకుందాం రమ్మనండి అంటూ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. 

66

కార్తికేయ 2 రిలీజ్ కి ముందు ఈ చిత్రాన్ని అడ్డుకునేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయని ప్రచారం జరిగింది. ఈ వ్యవహారంలో దిల్ రాజు కూడా విమర్శలు ఎదుర్కొన్నారు. వివాదం సద్దుమణిగింది అనుకుంటున్న తరుణంలో నటి తులసి కామెంట్స్ మరోసారి దుమారం రేపుతున్నాయి. కార్తికేయ, కార్తికేయ2 చిత్రాల్లో తులసి నిఖిల్ తల్లి పాత్రలో నటించారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Kota Srinivasa Rao: తాగి సెట్ కు వచ్చిన కోట, బుద్ధి లేదా.. ఇండస్ట్రీలో ఉండాలని లేదా.. అని ఇచ్చిపడేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Recommended image2
Madhuri Rathod: డీజేలను ఊపేస్తున్న మాధురి రాథోడ్ టాప్ 5 బ్లాక్ బస్టర్ ఫోక్ సాంగ్స్ ఇవే
Recommended image3
Irumudi Day 5 Collection: 100 కోట్ల క్లబ్ లో రవితేజ ఇరుముడి, మాస్ మహారాజ జోరుకు సడెన్ బ్రేక్.. 5 రోజు ఎంత వసూలు చేసిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved