- Home
- Entertainment
- Hebah Patel Pics : మత్తెక్కించే చూపులతో మెస్మరైజ్ చేస్తున్న హేబా పటేల్.. కుమారి క్యూట్ పిక్స్..
Hebah Patel Pics : మత్తెక్కించే చూపులతో మెస్మరైజ్ చేస్తున్న హేబా పటేల్.. కుమారి క్యూట్ పిక్స్..
టాలీవుడ్ హీరోయిన్ హేబా పటేల్ మత్తెక్కించే చూపులతో కుర్రాళ్లను తనవైపు ఆకర్షిస్తోంది. సిట్టింగ్ పోజిషనల్ లో మంత్రముగ్ధులను చేస్తోంది. క్యూట్ లుక్స్ తో కుమారి ఆకట్టకుంటోంది.

సెకండ్ గ్రేడ్ హీరోయిన్లలో ఆడియెన్స్ కు దగ్గరైన ముద్దుగుమ్మ హేబా పటేల్ (Hebah Patel). గ్లామర్, నటనతో వరుస చిత్రాల్లో నటిస్తూ అలరిస్తోందీ బ్యూటీ. ‘కుమారి 21ఎఫ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైందీ సుందరి. ఈ సినిమాతో ఒక్కసారిగా హేబా పటేల్ క్రేజ్ అమాంత పెరిగింది. తన గ్లామర్ తో యూత్ ను ఆకట్టుకుంది.
ఈ సినిమా తర్వాత హేబా పటేల్ ఇలాంటి సక్సెస్స్ మరోటి లేదనే చెప్పాలి. అయినా సినిమా అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. ఏడాదికి రెండు నుంచి మూడు సినిమాల్లో ఈజీగా నటిస్తోంది.
గతేడాది ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) నటించిన ‘రెడ్’ చిత్రంలో మెరిసింది హేబా. రామ్ తో కలిసి స్పెషల్ సాంగ్ లో మాస్ స్టెప్పులేసింది. ఈ చిత్రం అవరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది.
ఈ ఏడాది హేబా ఏకంగా తెలుగు, తమిళ చిత్రాల్లో కలిసి నాలుగైదు సినిమాల్లో నటిస్తోంది. ఏక కాలంలో షూటింగ్స్ లో పాల్గొంటూ బిజీ లైఫ్ ను లీడ్ చేస్తోంది. తెలుగులో ఈ బ్యూటీ ‘తెలిసిన వాళ్లు, గీత, ఆద్య’ చిత్రాల్లో నటిస్తోంది.
అయితే, అటు సినిమాలతో పాటు ఇటు సోషల్ మీడియాలోనూ ఈ హీరోయిన్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. లేటెస్ట్ ఫొటోలతో తన వైపు తిప్పుకుంటూ.. క్రేజ్ మరింత పెంచేస్తోంది. తాజాగా ట్రెడిషనల్ వేర్ లో దర్శనమిచ్చిందీ కుమారి.
ఈ ఫొటోల్లో హేబా క్యూట్ గా కనిపిస్తోంది. లూస్ హెయిర్ లో కుర్రాళ్ల చూపులను తనవైపు తిప్పుకుంటోంది. రెడ్ డ్రెస్ లో హెబా చూపులు నెటిజన్ల మతిపోగొడుతోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.