- Home
- Entertainment
- నిండుగా చీరకట్టి.. సముద్రపు ఒడ్డున అనసూయ సందడి.. ఆ విషయంలో ఫ్యాన్స్ హర్ట్ అయ్యారే.!
నిండుగా చీరకట్టి.. సముద్రపు ఒడ్డున అనసూయ సందడి.. ఆ విషయంలో ఫ్యాన్స్ హర్ట్ అయ్యారే.!
యాంకర్ అనసూయ భరద్వాజ్ బ్యూటీఫుల్ శారీలో మైమరిపిస్తోంది. నిండుగా దర్శనమిచ్చి నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తోంది. సంప్రదాయ దుస్తుల్లో ఫ్లడ్ లైట్ లా వెలిగిపోతోంది. లేటెస్ పిక్స్...

బుల్లితెర అందాల యాంకర్ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెరపై అలరించి.. ప్రస్తుతం వెండితెరపై నటిగా వరుస చిత్రాలతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఇటు సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది.
‘జబర్దస్’ యాంకర్ గా అనసూయ భరద్వాజ్ ప్రయాణం ప్రారంభమైన విషయం తెలిసిందే. కామెడీ షోకు వ్యాఖ్యతగా వ్యవహరించి ఆమె క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతాఇంతా కాదు. తనదైన శైలిలో మెప్పించింది.
ఎంటర్ టైన్ మెంట్ లో ఎదగాలనుకునే వారికి రోల్ మోడల్ గా నిలిచిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. యాంకర్ గానే ఆగిపోకుండా నటిగానూ ఎదిగేందుకు ప్రయత్నాలు చేసింది. సక్సెస్ అయ్యింది.
ఇలా ఆమె జర్నీ అంత ఆసక్తికరంగానే ఉంటుంది. సోషల్ మీడియాలో ఎన్ని ట్రోల్ ఎదురైనా, విమర్శలు వచ్చినా తన పయనంలో దూసుకెళ్తూనే ఉంది. పలు అంశాలపైనా తనదైన శైలిలో స్పందిస్తూ ఆకట్టుకుంటూ ఉంటుంది. నిత్యం వార్తల్లో నిలుస్తుంది.
ఏదేమైనా తన అభిమానులను ఫిదా చేసేందుకు పలు పోస్టులు పెడుతూనే వస్తుంటుంది. ముఖ్యంగా అనసూయ ఆమె బ్యూటీఫుల్ ఫొటోలతో నిత్యం అట్రాక్ట్ చేస్తుంటారు. కొత్త కొత్త అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తుంది.
ఎప్పటికప్పుడు తన అందమైన ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ మరింత దగ్గరవుతోంది. బుల్లితెరకు దూరమైన తర్వాత ఫ్యాన్స్ కు నెట్టింట నిత్యం అందుబాటులోనే ఉంటోంది. తన పోస్టులతో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా గ్లామర్ ఫొటోలతో మెస్మరైజ్ చేస్తోంది.
కొద్దిరోజులుగా అనసూయ నెట్టింట చీరకట్టులోనే దర్శనమిస్తోంది. బ్యూటీఫుల్ శారీలో మెరుస్తూ ఫ్యాన్స్ ను, నెటిజన్లను అట్రాక్ట్ చేస్తోంది. మెరిసిపోయే అందంతో కట్టిపడేస్తోంది. తాజాగా పింక్ అండ్ రెడ్ శారీలో నిండుగా దర్శనమిచ్చింది.
సముద్రపు ఒడ్డున వీచే చల్లగాలికి పురివిప్పిన నెమలిలా నాట్యం చేసింది. ఫొటోలకు అదిరిపోయేలా ఫోజులిచ్చంది. చీరకట్టు, బ్యూటీఫుల్ హెయిర్ స్టైల్, స్మైల్ తో కట్టిపడేసింది. మత్తు కళ్లతో, రూపసౌందర్యంతో ఆకట్టుకుంటోంది. లేటెస్ట్ ఫొటోస్ పై ఫ్యాన్స్ క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు.
సంప్రదాయ దుస్తుల్లో మెరిసినా... వజ్రంలా మెరిసిపోతున్నా..తన హ్యాండ్స్ కు బాంగిల్స్ లేకపోవడం ఫ్యాన్స్ ను హర్ట్ చేసిందంటున్నారు. చేతులకు నిండుగా గాజులు వేసుకుంటే మరింత అందంగా ఉంటారని ఆకాశానికి ఎత్తుతున్నారు. గ్లామర్ విషయంలో ఆమె తీసుకుంటున్న జాగ్రత్తలనూ పొగుడుతున్నారు. ఇక అనసూయ నెక్ట్స్ ‘పుష్ప 2 ది రూల్’తో అలరించనుంది.