MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • అప్పుడు సచిన్ కారణంగా ద్రావిడ్‌కి! ఇప్పుడు విరాట్ కోహ్లీ కారణంగా రోహిత్ శర్మకు... కెప్టెన్ అవుటయ్యాక...

అప్పుడు సచిన్ కారణంగా ద్రావిడ్‌కి! ఇప్పుడు విరాట్ కోహ్లీ కారణంగా రోహిత్ శర్మకు... కెప్టెన్ అవుటయ్యాక...

ఎవరైనా బ్యాటర్ అవుటైతే స్టేడియంలో ప్రేక్షకులు తీవ్ర నిరాశకు లోనవుతుంటారు. టీమిండియా నయా సారథి రోహిత్ శర్మ లాంటి స్టార్ బ్యాటర్ అవుటైతే ఆ డిస్సప్పాయింట్‌మెంట్ మరో రేంజ్‌లో ఉంటుంది. అయితే బెంగళూరు టెస్టులో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Mar 12 2022, 06:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

25 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 15 పరుగులు చేసిన రోహిత్ శర్మ, లసిత్ ఎంబూల్దేనియా బౌలింగ్‌లో ధనంజయ డి సిల్వకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

29

రోహిత్ శర్మ అవుటైన తర్వాత ప్రేక్షకుల అరుపులు, కేకలతో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం మార్మోగిపోయింది... దీనికి కారణం విరాట్ కోహ్లీ...

39

ఆర్‌సీబీ కెప్టెన్‌గా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్‌గా విరాట్ కోహ్లీకి బెంగళూరులో సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ ఉంది...

49

ఈ కారణంగానే తన కెరీర్‌లో 100వ టెస్టు ఇక్కడ ఆడాలనుకున్నాడు విరాట్ కోహ్లీ. అయితే బీసీసీఐ షెడ్యూల్ మార్చడంతో మొహాలీలో నూరో టెస్టు ఆడాల్సి వచ్చింది...

59

101వ టెస్టు మ్యాచ్ అయినా విరాట్ కోహ్లీ క్రీజులోకి వస్తున్న సమయంలో అరుపులు, కేకలతో స్వాగతం పలికారు బెంగళూరు క్రికెట్ అభిమానులు... 

69

విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కేకలు, అరుపుల కారణంగా రోహిత్ శర్మ ఇబ్బందికర పరిస్థితుల్లో పెవిలియన్‌కి నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది...

79

ఇంతకుముందు దశాబ్దంన్నర కిందట ప్రస్తుత భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు. ఈ విషయాన్ని స్వయంగా బయటపెట్టాడు ద్రావిడ్...

89

‘కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు కూడా నేను త్వరగా అవుట్ కావాలని టీమిండియా ఫ్యాన్స్ కోరుకునేవాళ్లు. నేను అవుటైతే సచిన్ టెండూల్కర్ త్వరగా బ్యాటింగ్‌కి వస్తాడని వాళ్లు కోరుకునేవాళ్లు...’ అంటూ కామెంట్ చేశాడు రాహుల్ ద్రావిడ్..

99

ఇప్పుడు విరాట్ కోహ్లీ కారణంగా రోహిత్ శర్మ కూడా ఇలాంటి అనుభవాన్నే రుచిచూడాల్సి వచ్చింది. ఐపీఎల్‌లో ఐదు టైటిల్స్ గెలిచిన రోహిత్‌ కంటే విరాట్ కోహ్లీకి ఫాలోయింగ్, క్రేజ్ టన్నుల్లో ఎక్కువనే విషయం తెలిసిందే...

About the Author

CR
Chinthakindhi Ramu
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
సూర్యకుమార్ ఔట్, అతడికే కెప్టెన్సీ పగ్గాలు.. టీ20 టీమ్ ప్రకటన
Recommended image2
IPL 2026: ఈసారి ఐపీఎల్ చాలా స్పెష‌ల్‌.. చ‌రిత్ర‌లోనే అతిపెద్ద సీజ‌న్‌, ఇంకా ఎన్నో మార్పులు
Recommended image3
Team India : వీరు కదా అసలైన హీరోలు.. గంభీర్ నమ్మిన పంచ పాండవులు !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved