MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Sports
  • Cricket
  • లార్డ్స్‌లో ఏం జరిగింది.? భార‌త్‌, ఇంగ్లాండ్ ఆట‌గాళ్లు న‌ల్ల బ్యాడ్జీల‌తో ఎందుకు హాజ‌ర‌య్యారు.?

లార్డ్స్‌లో ఏం జరిగింది.? భార‌త్‌, ఇంగ్లాండ్ ఆట‌గాళ్లు న‌ల్ల బ్యాడ్జీల‌తో ఎందుకు హాజ‌ర‌య్యారు.?

India vs England 3rd ODI: లార్డ్స్ మైదానంలో భారత్–ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డే ప్రారంభానికి ముందు ఆస‌క్తిక‌ర స‌న్నివేశం క‌నిపించింది. ఇరు జట్ల ఆటగాళ్లు చేతులకు నల్ల బ్యాడ్జీలు ధరించి మైదానంలోకి రావడం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

2 Min read
Author : Narender Vaitla
Published : Jul 19 2026, 06:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మ్యాచ్‌కు ముందు మౌనం పాటించిన ఇరు జట్లు
Image Credit : BCCI/X

మ్యాచ్‌కు ముందు మౌనం పాటించిన ఇరు జట్లు

సిరీస్ విజేతను నిర్ణయించే ఈ కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆట ప్రారంభానికి ముందు భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ఇంగ్లాండ్ సారథి హ్యారీ బ్రూక్ నేతృత్వంలో ఇరు జట్ల ఆటగాళ్లు, మ్యాచ్ అధికారులు ఒక నిమిషం పాటు మౌనం పాటించారు. అనంతరం నల్ల బ్యాడ్జీలతో బరిలోకి దిగి క్రికెట్ దిగ్గజానికి తమ గౌరవాన్ని తెలియజేశారు. ఈ దృశ్యం స్టేడియంలో ఉన్న అభిమానులను కూడా భావోద్వేగానికి గురి చేసింది.

#TeamIndia is wearing black armbands to pay tribute to West Indies legend Sir Garfield Sobers following his passing on Friday.#ENGvINDpic.twitter.com/cYXAWc40iT

— BCCI (@BCCI) July 19, 2026

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
89 ఏళ్ల వయసులో గ్యారీ సోబర్స్ కన్నుమూత
Image Credit : X

89 ఏళ్ల వయసులో గ్యారీ సోబర్స్ కన్నుమూత

వెస్టిండీస్ క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన సర్ గార్ఫీల్డ్ సోబర్స్ జూలై 17న బార్బడోస్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 89 సంవత్సరాలు. మరో రెండు వారాల్లో 90వ ఏట అడుగుపెట్టాల్సి ఉండగా ఈ విషాదం చోటుచేసుకుంది. ఆయన మరణాన్ని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించగా, ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ సంఘాలు, మాజీ ఆటగాళ్లు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Related Articles

Related image1
Bullet Train: హైదరాబాద్ టూ శ్రీశైలం.. ఇక జస్ట్ గంటలోనే ప్రయాణం. త్వరలోనే సాకారం..
Related image2
మిడిల్ క్లాస్ వారికి కూడా లగ్జరీ ట్రావెల్ అనుభూతి.. రూ. 50 ల‌క్ష‌ల కారులో ఉండే ఫీచ‌ర్లు ఇందులో ఉన్నాయిగా
36
క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకరు
Image Credit : X

క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకరు

సర్ గ్యారీ సోబర్స్‌ను ప్రపంచ క్రికెట్‌లో "ఏ పని అయినా చేయగల ఆటగాడు"గా అభివర్ణిస్తారు. ఎడమచేతి బ్యాటర్‌గా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడమే కాకుండా, ఫాస్ట్ బౌలింగ్, స్పిన్ బౌలింగ్ రెండింట్లోనూ తన ప్రతిభను చాటుకున్నారు. 1954 నుంచి 1974 వరకు సాగిన టెస్ట్ కెరీర్‌లో 93 మ్యాచ్‌లు ఆడి 8,032 పరుగులు చేశారు. ఇందులో 26 సెంచరీలు, 30 అర్ధసెంచరీలు ఉన్నాయి. బౌలర్‌గా 235 వికెట్లు తీసి ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకరిగా నిలిచారు.

46
ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది
Image Credit : X

ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదిన తొలి బ్యాటర్‌గా గ్యారీ సోబర్స్ చరిత్ర సృష్టించారు. ఆయన సేవలకు గుర్తింపుగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రతి ఏడాది అందించే అత్యుత్తమ క్రికెటర్ అవార్డుకు 'సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ' అనే పేరు పెట్టింది. ఆటగాడిగా మాత్రమే కాకుండా, తరతరాల క్రికెటర్లకు స్ఫూర్తినిచ్చిన గొప్ప ఆట‌గాడిగా ఆయనను ప్రపంచం గుర్తుంచుకుంటోంది.

56
లార్డ్స్‌లో గౌరవ నివాళి.. అభిమానుల్లో భావోద్వేగం
Image Credit : X

లార్డ్స్‌లో గౌరవ నివాళి.. అభిమానుల్లో భావోద్వేగం

క్రికెట్ మక్కాగా పేరొందిన లార్డ్స్ మైదానంలో భారత్, ఇంగ్లాండ్ ఆటగాళ్లు నల్ల బ్యాడ్జీలు ధరించి గ్యారీ సోబర్స్‌కు నివాళి అర్పించడం క్రీడా స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచింది. ఆయన భౌతికంగా లేకపోయినా, క్రికెట్‌కు అందించిన సేవలు, నెలకొల్పిన రికార్డులు ఎప్పటికీ చెరగని ముద్రగా నిలుస్తాయని క్రీడా ప్రపంచం నివాళులర్పిస్తోంది.

66
విధ్వంసం సృష్టించిన బెన్ డకెట్
Image Credit : icc/X

విధ్వంసం సృష్టించిన బెన్ డకెట్

లండన్‌లోని ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లండ్ ఓపెనర్లు బెన్ డకెట్, జాకబ్ బెతెల్ చరిత్ర సృష్టించారు. తొలి వికెట్‌కు 192 పరుగులు జోడించి లార్డ్స్ వన్డే చరిత్రలో అత్యధిక తొలి వికెట్ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. దీంతో 1980లో వెస్టిండీస్‌పై జెఫ్రీ బాయ్‌కాట్–పీటర్ విల్లీ నెలకొల్పిన 135 పరుగుల రికార్డు 46 ఏళ్ల తర్వాత బద్దలైంది. ఈ భారీ భాగస్వామ్యంతో ఇంగ్లండ్ మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యం సాధించగా, బెన్ డకెట్ 122 బంతుల్లో 123 పరుగులతో అజేయంగా బ్యాటింగ్ కొనసాగిస్తూ భారత బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
క్రీడలు
క్రికెట్

Latest Videos
Recommended Stories
Recommended image1
WTC Final రేసులో టీమిండియాకు బిగ్ షాక్.. టాప్‌లో ఆసీస్, సఫారీలు సంచలనం !
Recommended image2
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Recommended image3
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Related Stories
Recommended image1
Bullet Train: హైదరాబాద్ టూ శ్రీశైలం.. ఇక జస్ట్ గంటలోనే ప్రయాణం. త్వరలోనే సాకారం..
Recommended image2
మిడిల్ క్లాస్ వారికి కూడా లగ్జరీ ట్రావెల్ అనుభూతి.. రూ. 50 ల‌క్ష‌ల కారులో ఉండే ఫీచ‌ర్లు ఇందులో ఉన్నాయిగా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved