MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Cars
  • మిడిల్ క్లాస్ వారికి కూడా లగ్జరీ ట్రావెల్ అనుభూతి.. రూ. 50 ల‌క్ష‌ల కారులో ఉండే ఫీచ‌ర్లు ఇందులో ఉన్నాయిగా

మిడిల్ క్లాస్ వారికి కూడా లగ్జరీ ట్రావెల్ అనుభూతి.. రూ. 50 ల‌క్ష‌ల కారులో ఉండే ఫీచ‌ర్లు ఇందులో ఉన్నాయిగా

Tata Sierra EV: టాటా మోటార్స్ ఇటీవల కొత్త సియెరా EVను భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రారంభ ధర రూ.18.79 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా నిర్ణ‌యించిన ఈ కారులో అదిరిపోయే ఫీచ‌ర్ల‌ను అందించారు. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jul 19 2026, 05:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆల్ వీల్ డ్రైవ్‌తో మెరుగైన పనితీరు
Image Credit : cardekho.com

ఆల్ వీల్ డ్రైవ్‌తో మెరుగైన పనితీరు

టాటా సియెరా EVలో 75 kWh బ్యాటరీ వేరియంట్‌కు ప్రత్యేకంగా క్వాడ్ వీల్ డ్రైవ్ (QWD) సిస్టమ్‌ను అందించారు. ఇందులో ముందు, వెనుక యాక్సిల్‌లకు ఒక్కో ఎలక్ట్రిక్ మోటార్ అమర్చారు. ఈ డ్యూయల్ మోటార్ సెటప్ వల్ల అన్ని వీల్స్‌కి సమానంగా శక్తి అందుతుంది. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే గరిష్ఠంగా  624 కిలోమీటర్ల రేంజ్ లభిస్తుందని కంపెనీ చెబుతోంది. అలాగే 504 Nm టార్క్ అందుబాటులో ఉంటుంది. ఇందులో బూస్ట్ మోడ్, ఆఫ్‌రోడ్ టెర్రెయిన్ మోడ్స్, ఆఫ్‌రోడ్ అసిస్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. దీంతో నగర రోడ్లపైనే కాకుండా కొండ ప్రాంతాలు, కఠినమైన మార్గాల్లో కూడా సులభంగా డ్రైవ్ చేయవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
540 డిగ్రీ కెమెరాతో డ్రైవింగ్ మరింత సులభం
Image Credit : cardekho.com

540 డిగ్రీ కెమెరాతో డ్రైవింగ్ మరింత సులభం

సియెరా EVలో 540 డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరాతో పాటు ట్రాన్స్‌పరెంట్ మోడ్‌ను కూడా అందించారు. దీంతో వాహనం చుట్టూ ఉన్న పరిసరాలను స్పష్టంగా చూడొచ్చు. అంతేకాకుండా అడాప్టివ్ ఫ్రంట్, రియర్ టర్న్ కెమెరాలు, బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటర్ కూడా ఉన్నాయి. ప్రత్యేకంగా ముందు బంపర్ కింద అమర్చిన కెమెరా రోడ్డు పరిస్థితులను నేరుగా చూపిస్తుంది. ఆఫ్‌రోడింగ్ సమయంలో రాళ్లు, గుంతలు, ఎత్తైన మార్గాలు వంటి అడ్డంకులను ముందుగానే గుర్తించి సురక్షితంగా వాహనం నడపడానికి ఇది ఉపయోగపడుతుంది.

35
ఆటో పార్క్ అసిస్ట్, సమన్ మోడ్‌తో స్మార్ట్ డ్రైవింగ్
Image Credit : cardekho.com

ఆటో పార్క్ అసిస్ట్, సమన్ మోడ్‌తో స్మార్ట్ డ్రైవింగ్

హై వేరియంట్లలో ఆటో పార్క్ అసిస్ట్ ఫీచర్‌ను అందించారు. ఇందులో 16కిపైగా పార్కింగ్ ఫంక్షన్లు ఉన్నాయి. సమాంతర పార్కింగ్, నిలువు పార్కింగ్, యాంగిల్ పార్కింగ్, రివర్స్ అసిస్ట్, రిమ్ ప్రొటెక్షన్, మాన్యువర్ వార్నింగ్ వంటి సదుపాయాలు డ్రైవర్‌కు ఎంతో ఉపయోగపడతాయి. రద్దీ ప్రాంతాల్లో లేదా ఇరుకైన పార్కింగ్ స్థలాల్లో ఇది బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

అదే విధంగా సమన్ మోడ్ కూడా ఇందులో ఉంది. కీ ఫాబ్ లేదా మొబైల్ యాప్ ద్వారా డ్రైవర్ వాహనంలో కూర్చోకుండానే SUVను ముందుకు లేదా వెనక్కి కదిలించవచ్చు. ఇరుకైన ప్రదేశాల్లో వాహనాన్ని బయటకు తీయాల్సిన సందర్భాల్లో ఈ ఫీచర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

45
కారులోనే గేమింగ్ అనుభవం
Image Credit : cardekho.com

కారులోనే గేమింగ్ అనుభవం

టాటా సియెరా EVలో AirConsole సపోర్ట్‌ను కూడా అందించారు. దీనివల్ల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ను మల్టీప్లేయర్ గేమింగ్ కన్సోల్‌గా ఉపయోగించవచ్చు. ప్రయాణికులు తమ స్మార్ట్‌ఫోన్‌లను గేమ్ కంట్రోలర్‌లుగా ఉపయోగించి గేమ్స్ ఆడవచ్చు. ఛార్జింగ్ కోసం వాహనం ఆగినప్పుడు లేదా ఎక్కడైనా వేచి ఉండాల్సిన పరిస్థితుల్లో పిల్లలు, పెద్దలు సరదాగా సమయం గడపడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. దీంతో కారులో ప్రయాణం మరింత ఎంట‌ర్‌టైన్మెంట్‌గా మారుతుంది.

55
సౌకర్యవంతమైన సీట్లు, అడ్జస్టబుల్ సన్ వైజర్
Image Credit : cardekho.com

సౌకర్యవంతమైన సీట్లు, అడ్జస్టబుల్ సన్ వైజర్

సియెరా EVలో ముందు సీట్లకు అడ్జస్టబుల్ థై సపోర్ట్ను అందించారు. దీంతో డ్రైవర్, ముందు ప్రయాణికుడు ఎక్కువసేపు ప్రయాణించినా అలసట తక్కువగా ఉంటుంది. అలాగే 8-వే అడ్జస్టబుల్ సన్ వైజర్ కూడా ఉంది. సూర్యరశ్మి ఏ దిశ నుంచి వచ్చినా అవసరానికి అనుగుణంగా వైజర్‌ను సర్దుబాటు చేసుకోవచ్చు. దీంతో కళ్లకు ఇబ్బంది తగ్గి డ్రైవింగ్ మరింత సౌకర్యంగా ఉంటుంది. ముఖ్యంగా లాంగ్ డ్రైవ్‌లు చేసే వారికి ఈ రెండు ఫీచర్లు మంచి అనుభూతిని అందిస్తాయి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Top Selling Cars: మారుతి, టాటా, నిస్సాన్ కార్ల సేల్స్ దెబ్బకి రికార్డులు బద్దలు.. నెంబర్ 1 ఎవరంటే?
Recommended image2
Maruti Suzuki offers: మారుతి కార్లపై మైండ్ బ్లోయింగ్ ఆఫర్లు.. ఏకంగా ₹1.36 లక్షల తగ్గింపు
Recommended image3
Best SUVs Under 8 Lakhs: 8 లక్షల లోపే 5 స్టార్ సేఫ్టీ, 21 కిమీ మైలేజ్ ఇచ్చే బెస్ట్ ఎస్‌యూవీలు ఇవే
Related Stories
Recommended image1
Bullet Train: హైదరాబాద్ టూ శ్రీశైలం.. ఇక జస్ట్ గంటలోనే ప్రయాణం. త్వరలోనే సాకారం..
Recommended image2
వ‌దిలేయ‌డ‌మే నిజ‌మైన సంతోషం.. కాకి, చికెన్ ముక్క క‌థ చ‌దివితే మీకే అర్థమవుతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved