MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Sports
  • Cricket
  • ఆయన కోచింగ్‌లో చుక్కలు చూశాను... టీమిండియా మాజీ కోచ్‌పై రవిచంద్రన్ అశ్విన్ కామెంట్స్...

ఆయన కోచింగ్‌లో చుక్కలు చూశాను... టీమిండియా మాజీ కోచ్‌పై రవిచంద్రన్ అశ్విన్ కామెంట్స్...

భారత టెస్టు క్రికెట్‌లో అనిల్ కుంబ్లే తర్వాత అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు రవిచంద్రన్ అశ్విన్. మొహాలీ టెస్టులో 6 వికెట్లు తీసి, కపిల్‌దేవ్ (434) వికెట్ల రికార్డును అధిగమించిన అశ్విన్, కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న పరిస్థితులను బయటపెట్టాడు... 

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Mar 11 2022, 03:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112

తమిళనాడు తరుపున 2006లో ఫస్ట్ క్లాస్ ఎంట్రీ ఇచ్చిన రవిచంద్రన్ అశ్విన్, భారత మాజీ క్రికెటర్ డబ్ల్యూవీ రామన్ కోచింగ్‌లో శిక్షణ పొందాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212

భారత మహిళా జట్టుకి హెడ్ కోచ్‌గా వ్యవహరించిన డబ్ల్యూవీ రామన్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు రవిచంద్రన్ అశ్విన్...

312

‘నేను నా మొదటి మ్యాచ్‌ కోసం చెపాక్ స్టేడియానికి వెళ్లినప్పుడు అక్కడ రామన్ కోచ్‌గా ఉన్నారు. ఆయన ఓ హార్డ్ టాస్క్‌మాస్టర్... రామన్‌తో మాట్లాడడానికి కూడా చాలామంది భయపడతారు...
 

412

ఓ రోజు నేను ప్రాక్టీస్ సెషన్స్‌లో ఉన్నప్పుడు ఆయన ఫీల్డింగ్ సెషన్స్ నిర్వహిస్తున్నారు. ఆయన బౌలర్లపై పెట్టే ప్రెషర్ అంతా ఇంతా కాదు...

512

ఒకవేళ స్టంప్స్‌ పైకి బంతి విసరలేకపోతే, ఆయన కోపాన్ని భరించాల్సిందే. అలా... ఇలా... అని అరిచేసేవాడు. ఇలా 10 రోజులు, 12 రోజులు, 2 వారాలు, మూడు వారాలు గడిచాయి...

612

రోజులు గడిచేకొద్ది ఆయనతో కాస్త చనువు పెరిగి, సౌకర్యవంతంగా ఫీల్ అయ్యాడు. ఆయన నన్ను నెట్స్‌లో చాలా ప్రోత్సహించేవాడు, నేను ఆయన్ని రకరకాల ప్రశ్నలు అడిగి విసిగించేవాడిని...

712

టీమ్ మీటింగ్స్‌లో మాట్లాడడానికి కూడా భయపడేవాడిని కాదు. ఓ రోజు, రామన్ నా పక్కనే నిలబడి, ‘అశ్విన్, నువ్వు చాలా మెరుగయ్యావ్. టీమ్ మీటింగ్స్‌లో నువ్వు మాట్లాడిన విధానాన్ని మెచ్చుకోవాల్సిందే...

812

అయితే నువ్వు ఓ విషయం అర్థం చేసుకోవాలి. ఒక్కసారి టీమిండియాలోకి వెళ్లిన తర్వాత బేసిక్స్ నేర్చుకోవడానికి వెతుక్కోవాల్సిన పరిస్థితి రాకూడదు. అందుకే నేను ఇంత కఠినంగా ఉంటాను...

912

ఆ మాటలతో ఆయనపై నాకున్న అభిమానం రెట్టింపు అయ్యింది. ఆయన నెట్స్‌లో ఎంత కఠినంగా ఉంటారో నాకు తెలుసు. అందుకే ఆయన గ్రౌండ్‌లో ఉంటే లోపలికి రావడానికి కూడా అందరూ భయపడతారు...’ అంటూ కామెంట్ చేశాడు రవిచంద్రన్ అశ్విన్...

1012

రవిచంద్రన్ అశ్విన్ కామెంట్లపై టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ కోచ్ డబ్ల్యూవీ రామన్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. అశ్విన్ ఇచ్చిన ఇంటర్వ్యూకి ‘అయ్యో...’ అంటూ కామెంట్ చేశాడు...
 

1112

‘అశ్విన్ ఎంతో చురుకైన క్రికెటర్. క్రికెట్‌ గురించి తెలుసుకోవాలని తపన, అతనిలో రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. ఏ పొజిషన్‌లో అయినా రాణించగల మోడ్రన్ క్రికెటర్...’ అంటూ అశ్విన్ గురించి కామెంట్ చేశాడు డబ్ల్యూవీ రామన్..

1212

తమిళనాడు తరుపున 140 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన రవిచంద్రన్ అశ్విన్ 672 వికెట్లు పడగొట్టాడు. టీమిండియా తరుపున 85 టెస్టుల్లో 436 వికెట్లు తీశాడు... బ్యాటుతోనూ రాణించిన రవిచంద్రన్ అశ్విన్‌కి టెస్టుల్లో 5 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలతో 2905 పరుగులు ఉన్నాయి... 

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Recommended image2
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Recommended image3
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved