MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Sports
  • Cricket
  • IPL: కెప్టెన్సీ భారం పోయింది.. జాగ్రత్త, ఇప్పుడు అతడు మరింత ప్రమాదకారి: ఐపీఎల్ జట్లకు మ్యాక్స్వెల్ హెచ్చరిక

IPL: కెప్టెన్సీ భారం పోయింది.. జాగ్రత్త, ఇప్పుడు అతడు మరింత ప్రమాదకారి: ఐపీఎల్ జట్లకు మ్యాక్స్వెల్ హెచ్చరిక

Glenn Maxwell About Virat Kohli: ఐపీఎల్ లో తొమ్మిదేండ్ల పాటు ఆర్సీబీని నడిపించిన నాయకుడు కోహ్లి.. కానీ ఈ ఏడాది నుంచి ఫాఫ్ డుప్లెసిస్ ఆ బాధ్యతలను నిర్వర్తించనున్నాడు. అయితే సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడంతో... 

1 Min read
Author : Srinivas M
Published : Mar 18 2022, 10:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కు తొమ్మిదేండ్ల పాటు  సారథిగా ఉన్న  మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి గత సీజన్ లో  ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఈ ఐపీఎల్ సీజన్ నుంచి అతడు కొత్త సారథి ఫాఫ్ డుప్లెసిస్ సారథ్యంలో ఆడనున్నాడు. అయితే కెప్టెన్సీ భారం దిగిపోవడంతో కోహ్లి ఇప్పుడు మరింత ప్రమాదకారి అని ఆర్సీబీ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్వెల్ అన్నాడు. ప్రత్యర్థి జట్లకు ఇక కష్టమే అని హెచ్చరికలు జారీ చేశాడు. 

38

మ్యాక్సీ మాట్లాడుతూ.. ‘అతడిపై ఇన్నాళ్లు ఉన్న కెప్టెన్సీ భారం దిగిపోయింది.  నా దృష్టిలో కోహ్లికి అది పెద్ద బాధ్యత.  దానివల్ల అతడు  అనుకున్న స్థాయిలో రాణించలేకపోవచ్చు. కానీ ఇప్పుడలా కాదు. 

48

ఆ  బాధ్యతల నుంచి కోహ్లి తప్పుకున్నాడు. ఇది ప్రత్యర్థి జట్లకు మరింత ప్రమాదకరం.  కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో అతడు ఇప్పుడు మరింత స్వేచ్ఛగా ఆడతాడు.  

58

తనపై ఏ ఒత్తిడి లేకుండా అతడి ఆటను అతడు  స్వేచ్ఛగా ఆడేందుకు ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుంది.  నా తొలి రోజుల్లో అతడికి వ్యతిరేకంగా ఆడేప్పుడు అతడితో తీవ్రమైన పోటీని భావించేవాడిని. 

68

ఈ సంవత్సర కాలంలో నేను అతడిలో ఎక్కువ గమనించిన విషయమేమిటంటే.. తన నిర్ణయాధికారం, భావోద్వేగాలతో నన్ను ఆశ్చర్యపరిచాడు. ఈ ఏడాది కాలంలో నేను కోహ్లితో మరింత సన్నిహితంగా ఉండగలిగాను...’ అని మ్యాక్స్వెల్ చెప్పుకొచ్చాడు. 

78

ఇదిలాఉండగా.. కెప్టెన్సీ నుంచి వైదొలిగాక  జాతీయ జట్టు తరఫున కోహ్లి పెద్దగా మెరుపులు మెరిపించిందేమీ లేదు. టీ20లతో పాటు అన్ని ఫార్మాట్లలోనూ అతడు ఇప్పుడు  ఒక సీనియర్ ఆటగాడిగా ఉన్నాడు. 
 

88

కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ తో వన్డేలలో గానీ,  టీ20లలో,  శ్రీలంకలతో  టెస్టులలో గానీ  పెద్దగా ఆకట్టుకోలేదు. మరి ఆర్సీబీ తరఫున ఏ స్థాయిలో ఆడతాడనేది ఇప్పుడు ఆసక్తికరం. 

About the Author

SM
Srinivas M
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Recommended image2
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Recommended image3
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved