MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Gold Price Crash: ఇవాళ కుప్పకూలిన బంగారం ధరలు..అంతర్జాతీయ పరిస్థితులతో పసిడిపై ఒత్తిడి

Gold Price Crash: ఇవాళ కుప్పకూలిన బంగారం ధరలు..అంతర్జాతీయ పరిస్థితులతో పసిడిపై ఒత్తిడి

Gold Price Crash: బంగారం ధరలు ఇవాళ కీలక మలుపు తీసుకున్నాయి. ఇటీవల వరుసగా పెరుగుతూ ఆందోళన కలిగించిన పసిడి...ఈరోజు శాంతించింది. ప్రతి రోజు బంగారం ధరలు ఎందుకు మారుతున్నాయి?

2 Min read
Author : Nandini Arava
Published : Jul 24 2026, 11:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్
Image Credit : chatgpt

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్

బంగారం కొనాలనుకునేవారికి, పెట్టుబడి పెట్టాలనుకునేవారికి, అలాగే పెళ్లిళ్లు లేదా శుభకార్యాల కోసం పసిడి కొనుగోలు చేయాలని గుడ్ న్యూస్. బంగారం ధరలు ఇవాళ కీలక మలుపు తీసుకున్నాయి. ఇటీవల వరుసగా పెరుగుతూ ఆందోళన కలిగించిన పసిడి...ఈరోజు శాంతించింది. ముందుగా బంగారం ధరల విషయానికి వస్తే... హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1850 తగ్గి రూ.1,44,330కు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారంపై 10 గ్రాములకు రూ.1700 పతనమై రూ.1,32,300 చేరుకుంది. అటు కేజీ వెండి ధర రూ.2,40,000గా కొనసాగుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ప్రతి రోజు బంగారం ధరలు ఎందుకు మారుతున్నాయి?
Image Credit : X

ప్రతి రోజు బంగారం ధరలు ఎందుకు మారుతున్నాయి?

బంగారం ధరలు కేవలం హైదరాబాద్ మార్కెట్‌ను బట్టి నిర్ణయించబడవు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులే ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి. ప్రపంచ మార్కెట్‌లో బంగారం ధర పెరిగితే మన దేశంలో కూడా ధరలు పెరుగుతాయి. అలాగే అంతర్జాతీయంగా ధరలు తగ్గితే దేశీయ మార్కెట్‌లో కూడా ప్రభావం కనిపిస్తుంది. ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు చాలామంది పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతారు. దీంతో డిమాండ్ పెరిగి ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహా ప్రపంచంలోని ప్రధాన సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచినా, తగ్గించినా బంగారం ధరలపై ప్రభావం ఉంటుంది. సాధారణంగా వడ్డీ రేట్లు తగ్గితే బంగారంపై పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంటుంది.

34
బంగారంపై ప్రభావం చూపిస్తున్న డాలర్
Image Credit : Gemini AI

బంగారంపై ప్రభావం చూపిస్తున్న డాలర్

ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారం నిల్వలను కొనుగోలు చేసినా కూడా అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరుగుతాయి. డాలర్ విలువలో మార్పులు కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. డాలర్ బలపడితే చాలాసార్లు బంగారం ధరలు ఒత్తిడికి గురవుతాయి. డాలర్ బలహీనపడితే బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంటుంది.

44
మరో ముఖ్యమైన అంశం
Image Credit : Getty

మరో ముఖ్యమైన అంశం

ఇక భౌగోళిక ఉద్రిక్తతలు, యుద్ధాలు, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి వంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా బంగారాన్ని ఎంచుకుంటారు. దీంతో డిమాండ్ ఒక్కసారిగా పెరిగి ధరలు ఎగబాకుతాయి.

భారత్‌లో మరో ముఖ్యమైన అంశం... పెళ్లిళ్ల సీజన్, పండుగల సీజన్. ఈ సమయంలో నగల కొనుగోళ్లు భారీగా పెరగడం వల్ల డిమాండ్ పెరుగుతుంది. ముఖ్యంగా శ్రావణం, దసరా, దీపావళి, వివాహాల సీజన్‌లలో మార్కెట్‌లో కొనుగోళ్లు ఎక్కువగా కనిపిస్తాయి.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Hike: పసిడి ప్రియులకు మరో షాక్...తగ్గుతూ ఒక్కసారిగా బాంబ్ పేల్చిన బంగారం
Recommended image2
ATM పిన్ 4 అంకెలే ఎందుకు ఉంటుంది? దీని వెనుకున్న‌ ఆసక్తికరమైన కథ ఏంటో తెలుసా?
Recommended image3
రైల్వే స్టేషన్‌లో ఎవ‌రైనా షాప్ ఓపెన్ చేయొచ్చా.? ఇంత‌కీ ప్రాసెస్ ఎలా ఉంటుంది.?
Related Stories
Recommended image1
Gold Price Hike: ఇంకా చల్లారని యుద్ధ మంటలు..బ్రేక్ లేకుండా పెరుగుతున్న బంగారం ధరలు
Recommended image2
Gold Price Hike: మళ్లీ పశ్చిమాసియాలో ముసురుతున్న యుద్ధం.. రాకెట్ లా దూసుకెళ్తున్న బంగారం ధరలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved