MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!

Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!

Zodiac signs: ఏ సంబంధానికైనా పునాది నమ్మకమే. చిన్న అనుమానం ఎలాంటి బంధమైనా దెబ్బతినే అవకాశం ఉంది.కాగా, జోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని రాశుల పురుషులు తమ భార్యలను విపరీతంగా అనుమానిస్తారు. ఆ రాశులు ఇవే...

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 22 2026, 09:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వృశ్చిక రాశి :
Image Credit : Asianet News

వృశ్చిక రాశి :

జోతిష్య శాస్త్రంలో వృశ్చిక రాశి వారిని అత్యంత గంభీరమైన, రహస్య స్వభావం కలవారిగా అభివర్ణిస్తారు. వీరు ఎవరినీ అంత తేలికగా నమ్మరు. భాగస్వామితో బంధంలో ఉన్నప్పుడు కూడా వారి మాటల కంటే ప్రవర్తనను, చర్యలను నిశితంగా గమనిస్తారు. గతంలో ఎదురైన చేదు అనుభవాలు లేదా మోసాలు వీరిని మరింత జాగ్రత్తపడేలా చేస్తాయి. భాగస్వామి ప్రతి చిన్న విషయాన్ని దాచకుండా చెప్పాలని ఆశిస్తారు. ఒకవేళ ఏ చిన్న రహస్యం ఉందని అనిపించినా, వెంటనే అనుమానించడం ప్రారంభిస్తారు. కానీ ఒకసారి నమ్మకం ఏర్పడితే, వీరికంటే నిజాయితీ గల భాగస్వామి మరొకరు ఉండరు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వృషభ రాశి:
Image Credit : Getty

వృషభ రాశి:

వృషభ రాశి వారు ఏ బంధాన్నైనా చాలా తీవ్రంగా పరిగణిస్తారు. జీవిత భాగస్వామి విషయంలో వీరు పొసెసివ్ గా ఉంటారు. ఒకరిని తమ జీవితంలోకి ఆహ్వానించే ముందు వారి గురించి ప్రతీ చిన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత కూడా భాగస్వామి ప్రవర్తనపై ఎక్కువ ప్రశ్నలు అడగటం వల్ల, వీరు అనుమానిస్తున్నారనే భావన అవతలి వారికి కలుగుతుంది. తమ భాగస్వామి కేవలం తమకే సొంతం అనే భావన ఎక్కువ కావడం వల్ల వీరు చిన్న విషయాలకూ అతిగా స్పందిస్తుంటారు.

35
మకర రాశి:
Image Credit : Getty

మకర రాశి:

మకర రాశి వారు ప్రాక్టికల్ ఆలోచనలు, బాధ్యతాయుతమైన ప్రవర్తనకు మారుపేరు. చాలా బాధ్యతగా ఉంటారు. నిర్ణయాలు తీసుకోవడంలో చాలా సమయం తీసుకుంటారు. తమ చుట్టూ ఉన్న పరిసరాలను, వ్యక్తులను నిశితంగా పరిశీలించడం వీరి అలవాటు. ఈ జాగ్రత్త స్వభావమే కొన్నిసార్లు భాగస్వామికి మితిమీరిన అనుమానంగా అనిపిస్తుంది. వీరు నమ్మకం ఏర్పడే వరకు తమ పూర్తి భావాలను వ్యక్తపరచకుండా దాచి ఉంచుతారు.

45
ధనుస్సు రాశి :
Image Credit : Asianet News

ధనుస్సు రాశి :

సాధారణంగా ధనుస్సు రాశి వారు స్వేచ్ఛను కోరుకుంటారు, కానీ బంధంలో నమ్మకం విషయానికి వస్తే చాలా సమయం తీసుకుంటారు. తమ భాగస్వామి పట్ల ఉండే విపరీతమైన శ్రద్ధ కారణంగా... వారు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ అతి జాగ్రత్తే కొన్నిసార్లు అపార్థాలకు, అనుమానాలకు దారితీస్తుంది.

55
కర్కాటక రాశి:
Image Credit : Asianet News

కర్కాటక రాశి:

కర్కాటక రాశి వారు అత్యంత సున్నితంగా ఉంటారు. తమ భాగస్వామిని ప్రాణంగా ప్రేమిస్తారు. కానీ జోతిష్యం ప్రకారం వీరిలో అభద్రతా భావం కాస్త ఎక్కువ. భాగస్వామి ఎక్కడ తమను నిర్లక్ష్యం చేస్తారో లేదా వదిలేస్తారో అనే భయం వీరిలో అనుమానాన్ని రేకెత్తిస్తుంది. అతిగా ఆలోచించి ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా ఊహించుకోవడం వీరి బలహీనత.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Related Stories
Recommended image1
Zodiac Signs: జీవితాన్ని ఎంజాయ్ చేయడంలో ఈ 5 రాశులవారు టాప్! మీది ఏ రాశి?
Recommended image2
Zodiac signs: పెళ్లి తర్వాత ఈ రాశుల జాతకమే మారిపోతుంది, అదృష్టం రెట్టింపు అవ్వడం పక్కా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved