దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రతో దర్శకుడు మహి వి రాఘవ్ 'యాత్ర' సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో లేవనే చెప్పాలి.

మూడు రోజులకు కలిపి ఈ సినిమా రూ.5 కోట్ల షేర్ ని రాబట్టింది. మొదటిరోజు ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్ల షేర్ రూ.1.93 కోట్లు రాబట్టగా.. రెండో రోజు రూ.97 లక్షలు రాబట్టింది. సీడెడ్, గుంటూరు, నెల్లూరు వంటి ప్రాంతాల్లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

వసూళ్లు ఎక్కువగా సాధించే నైజాం, ఉత్తరాంధ్రలలో మాత్రం ఈ సినిమాకి అంత బజ్ రావడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.12 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఇప్పటివరకు సినిమా నలభై శాతం రికవరీ చేసింది. ఈ వారం కూడా సినిమా స్టడీగా ఉంటే బ్రేక్ ఈవెన్ అయ్యే చాన్స్ లు ఉన్నాయి. 

ఇక ఏరియాల వారీగా మూడు రోజుల షేర్స్ ఇలా ఉన్నాయి. 

నైజాం..............................................0.64 కోట్లు

నెల్లూరు..........................................0.29 కోట్లు

గుంటూరు........................................0.82 కోట్లు 

కృష్ణా................................................0.41 కోట్లు 

వెస్ట్...................................................0.30 కోట్లు 

ఈస్ట్..................................................0.21 కోట్లు 

సీడెడ్.............................................. 0.96 కోట్లు 

ఉత్తరాంధ్ర.....................................0.33 కోట్లు 
 
రెస్ట్ ఆఫ్ ఇండియా...........................0.40 కోట్లు 

ఓవర్సీస్............................................0.70 కోట్లు 

మొత్తం 3 రోజుల వరల్డ్ వైడ్ షేర్స్ ..... 5.06 కోట్లు 

'యాత్ర' లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

'యాత్ర' ఫస్ట్ డే కలెక్షన్లు!

'యాత్ర'కు షాక్.. ఆన్‌లైన్‌లో సినిమా లీక్!

పార్టీకి అమృత పాత్ర కానీ... (‘యాత్ర’ మూవీ రివ్యూ)

యాత్ర సినిమా: సబితా ఇంద్రారెడ్డి పాత్ర హైలైట్

'యాత్ర' మూవీ ట్విట్టర్ రివ్యూ!

యాత్ర ప్రీమియర్ షో టాక్.. జగన్ తో ఎండింగ్ టచ్

‘యాత్ర’: చంద్రబాబు, జగన్ పాత్రల గురించి దర్శకుడు ఇలా

‘యాత్ర’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌: ఆ హీరో చీఫ్ గెస్ట్ గా?

'యాత్ర' కోసం జగన్ వస్తాడా..?

'యాత్ర'కి నో కట్స్!

ఎన్టీఆర్ కి లేని సీన్ వైఎస్ కి ఉందా..?

వైఎస్సార్ బయోపిక్.. పట్టించుకునేవారే లేరా..?

వైఎస్ 'యాత్ర' కోసం మెగాస్టార్ డబ్బింగ్ పాట్లు!

'యాత్ర' బయోపిక్: నిజ పాత్రలో వైఎస్ జగన్!