దివంగత మాజీ ముఖ్యమత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రతో తెరకెక్కిన 'యాత్ర' సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ వస్తోంది. సినిమాలో ఎక్కడా అతి లేకుండా ఉన్నది ఉన్నట్లుగా తీశారనే ప్రశంసలు దక్కుతున్నాయి. మమ్ముట్టి.. వైఎస్సార్ పాత్రలో జీవించేశాడని అభిమానులు సంబరపడిపోతున్నారు.

సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోందని దర్శకనిర్మాతలు సంబరపడే లోపు పైరసీ రూపంలో వారికి పెద్ద షాక్ తగిలింది. తమిళ రాకర్స్ అనే వెబ్ సైట్ 'యాత్ర' సినిమాను పైరసీ చేసింది. సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే సినిమా మొత్తం ఆన్‌లైన్‌లో లీక్ కావడంతో నిర్మాతలకు ఏం చేయాలో అర్ధంకాని పరిస్థితి ఏర్పడింది.

ఈ సైట్ నుండి ఇప్పటికే చాలా మంది సినిమాను డౌన్ లోడ్ చేసుకున్నట్లు గుర్తించారు. ఇది కచ్చితంగా సినిమా వసూళ్లపై ప్రభావం చూపుతుందని నిర్మాతలు భయపడుతున్నారు.  ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు. 

తమిళ రాకర్స్ వెబ్ సైట్ ఇలా కొత్త సినిమాలను పైరసీ చేయడం తొలిసారి కాదు. పెద్ద పెద్ద సినిమాలను సైతం విడుదలైన మొదటిరోజే పైరసీ చేసి తన సైట్ లో పెట్టుకునేవారు. వీరికి ఆగడాలను అడ్డుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. ఫలించడంలేదు. 

పార్టీకి అమృత పాత్ర కానీ... (‘యాత్ర’ మూవీ రివ్యూ)

యాత్ర సినిమా: సబితా ఇంద్రారెడ్డి పాత్ర హైలైట్

'యాత్ర' మూవీ ట్విట్టర్ రివ్యూ!

యాత్ర ప్రీమియర్ షో టాక్.. జగన్ తో ఎండింగ్ టచ్

‘యాత్ర’: చంద్రబాబు, జగన్ పాత్రల గురించి దర్శకుడు ఇలా

‘యాత్ర’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌: ఆ హీరో చీఫ్ గెస్ట్ గా?

'యాత్ర' కోసం జగన్ వస్తాడా..?

'యాత్ర'కి నో కట్స్!

ఎన్టీఆర్ కి లేని సీన్ వైఎస్ కి ఉందా..?

వైఎస్సార్ బయోపిక్.. పట్టించుకునేవారే లేరా..?

వైఎస్ 'యాత్ర' కోసం మెగాస్టార్ డబ్బింగ్ పాట్లు!

'యాత్ర' బయోపిక్: నిజ పాత్రలో వైఎస్ జగన్!