హైదరాబాద్: 'యాత్ర' సినిమాలో  ప్రస్తుత మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి పెద్ద పీట వేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను ఏ పరిస్థితుల్లో  చేవేళ్ల నుండి ప్రారంభించాల్సి వచ్చిందో  ఈ సినిమాలో చూపించారు. 

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి సీఎల్పీ నేతగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి  పాదయాత్రను రంగారెడ్డి జిల్లా చేవేళ్ల నుండి ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  చంద్రబాబునాయుడు నేతృత్వంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో  ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని  ఆ పార్టీ నాయకత్వం ప్లాన్ చేస్తోంది. ఇదే తరుణంలో  అప్పటి సీఎల్పీ నేత  వైఎస్ రాజశేఖర్ రెడ్డి  రాష్ట్రంలో పాదయాత్రను ప్రారంభించారు. 

రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొనే ఉద్దేశ్యంతో  వైఎస్ రాజశేఖర్ రెడ్డి  పాదయాత్రను నిర్వహించారు.  రంగారెడ్డి జిల్లాలోని చేవేళ్లలో పాదయాత్రను ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ పాదయాత్రను ముగించారు.

పాదయాత్ర రూట్‌ మ్యాప్‌ రెండు మూడు రూట్లను ఫైనల్ చేశారు.  అయితే అదే సమయంలో  పాదయాత్ర రూట్ మ్యాప్ గురించి తన అంతరంగికుడు కేవీపీతో  వైఎస్ఆర్ చర్చించే సమయంలో  సబితా ఇంద్రారెడ్డి వైఎస్ఆర్ ఇంటికి వస్తోంది. 

ఈ సమయంలో తాండూరుతో పాటు మరో రెండు రూట్ మ్యాప్‌‌లను రూ‌పొందించారు.  ఇదే విషయాన్ని కేవీపీ వైఎస్ఆర్‌తో చెప్పినట్టుగా చూపారు.  అయితే తాండూరులో యాత్ర ప్రారంభిస్తే తాను చేవేళ్లలో  సభను ఏర్పాటు చేస్తానని సబితా ఇంద్రారెడ్డి అన్నట్టుగా  ఈ సినిమాలో చూపారు.

అయితే తాండూరులో కాకుండా  చేవేళ్లలోనే యాత్రను ప్రారంభిస్తానని వైఎస్ఆర్‌ సబితా ఇంద్రారెడ్డితో చెబుతారు.  అయితే ఏదైనా  కార్యక్రమం ప్రారంభించే సమయంలో  తన  లాంటి వారు ఎదురు రాకూడదని కోరుకొంటారని... వేరేచోటు నుండి యాత్రను ప్రారంభించాలని సబితా ఇంద్రారెడ్డి వైఎస్ఆర్‌ను కోరినట్టు
ఈ సినిమాలో చూపారు.

అయితే  చేవేళ్ల నుండి యాత్రను ప్రారంభిస్తున్నానని సబితా ఇంద్రారెడ్డికి వైఎస్ఆర్ చెబుతారు. అన్నట్టుగానే పాదయాత్రను చేవేళ్ల నుండి  పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్ర నిర్విఘ్నంగా కొనసాగించినట్టుగా సినిమాలో చూపించారు.

వాస్తవానికి చేవేళ్ల నుండి పాదయాత్ర ప్రారంభించిన వైఎస్ఆర్‌ ఇచ్చాపురంలో ముగించారు. ఆ తర్వాత 2004 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఏ కార్యక్రమాన్ని ప్రారభించాలనుకొన్నా వైఎస్ఆర్ చేవేళ్ల నుండి ప్రారంభించేవారు. చేవేళ్ల‌ను వైఎస్ఆర్ సెంటిమెంట్‌గా తీసుకొనేవారు. 

అందుకే సబితా ఇంద్రారెడ్డి చేవేళ్ల చెల్లెమ్మగా మారింది. రచ్చబండ కార్యక్రమం చిత్తూరు జిల్లాలో కాకుండా చేవేళ్ల నుండి ప్రారంభిస్తే  వైఎస్ఆర్‌  హెలికాప్టర్ ప్రమాదానికి గురికాకపోయేవారని అనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

సంబంధిత వార్తలు

'యాత్ర' సినిమా: అచ్చుపోసిన వైఎస్ ఆత్మ కేవీపీ