దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా 'యాత్ర' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మహి వి రాఘవ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది చిత్రబృందం.

ఈ వేడుకకు జగన్ ని ముఖ్య అతిథిగా తీసుకురావడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. జనవరి చివరి వారంలో ఈ వేడుక జరపాలని అనుకున్నారు. కానీ ఇంకా జగన్ డేట్ ఫిక్స్ అవ్వని కారణంగా ఇప్పుడు ఫిబ్రవరి మొదటివారానికి ఈవెంట్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

జగన్ ఎప్పుడు డేట్ కేటాయిస్తే అప్పుడు ఈవెంట్ జరపాలని చూస్తున్నారు కానీ జగన్ మాత్రం తన పార్టీ పనుల్లో బిజీగా గడుపుతున్నాడు. దీంతో యాత్రకి సమయం కేటాయిస్తాడా..? లేదా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

కానీ చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం జగన్ వస్తాడని నమ్మకంగా చెబుతున్నారు. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  

'యాత్ర'కి నో కట్స్!

ఎన్టీఆర్ కి లేని సీన్ వైఎస్ కి ఉందా..?

వైఎస్సార్ బయోపిక్.. పట్టించుకునేవారే లేరా..?

వైఎస్ 'యాత్ర' కోసం మెగాస్టార్ డబ్బింగ్ పాట్లు!

'యాత్ర' బయోపిక్: నిజ పాత్రలో వైఎస్ జగన్!