చిరంజీవి ఇండస్ట్రీకి మొగుడవుతాడని ముందే చెప్పిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Megastar చిరంజీవి విలన్ గా బాగుంటాడని ఒక స్టార్ హీరో అంటే.. లేదు లేదు..ముందు ముందు ఇండస్ట్రీకి మొగుడవుతాడని అన్నాడు మరో హీరో. ఇంతకీ ఆ ఇద్దరు హీరోలు ఎవరు? అనుకున్నట్టుగానే మెగాస్టార్ గా ఎదిగాడని స్వయంగా వెల్లడించిన నటుడు ఎవరో తెలుసా?

బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరో
ఎటవంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా.. టాలీవుడ్‌లో మెగాస్టార్ స్థాయికి ఎదిగిన చిరంజీవి సినిమా ప్రయాణం ఎంతో మందికి ప్రేరణగా నిలిచింది. హీరోగా ఎదగాలని కాలేజీ రోజుల నుంచే తపించిన చిరంజీవి, ఇండస్ట్రీలో అడుగుపెట్టే ముందు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. అవకాశాల కోసం తిరుగుతూ అనేక తిరస్కారాలు ఫేస్ చేశాడు. అయిపప్పటికీ.. నిరుత్సాహపడకుండా.. తన ప్రతిభనే నమ్ముకుని ముందుకు సాగారు మెగాస్టార్. చిన్నచిన్న పాత్రతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. ఆతరువాత కాలంలో హీరో అవ్వడం కోసం ఎనర్జీ, డాన్స్ సామర్థ్యంతో మేకర్స్‌ను ఇంప్రెస్ చేశారు.
టాలీవుడ్ మేకర్స్ కు షాక్ ఇచ్చిన చిరంజీవి
చిరంజీవి డ్యాన్స్‌లో స్పీడ్, ట్యాలెంట్, స్క్రీన్‌పై చూపిన ఎనర్జీ ఏ హీరో కూడా అప్పట్లో చేయలేకపోయారు. అప్పటికే స్టార్ డమ్ ఉన్న హీరోలలో కూడా చిరంజీవిలో ఉన్నస్పీడ్ కనిపించకపోవడంతో.. మేకర్స్ షాక్ అయ్యారు, ఆశ్చర్చపోయారు. వరుసగా అవకాశాలు ఇచ్చుకుంటు వెళ్లారు. ‘పునాదిరాళ్లు’ సినిమాతో తొలి అవకాశం అందుకున్న ఆయన, ‘ప్రాణం ఖరీదు’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. తొలి సినిమా విడుదలకు ముందే పలువురు సీనియర్ హీరోలు చిరంజీవిలోని ప్రతిభను గుర్తించారు.
కృష్ణం రాజు -మురళీ మోహన్ మధ్య చర్చ
కసితో, పట్టుదలతో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాడు. చిరంజీవి కెరీర్ బిగినింగ్ లో విలన్ పాత్రల్లోనటించి మెప్పించారు. తాయారమ్మ, బంగారయ్య లాంటి సినిమాల్లో చిరంజీవి విలనిజం.. అద్భుతంగా పండింది. ఆయన కళ్లలో కనిపించిన పవన్ ఫుల్ ఎక్స్‌ప్రెషన్, నటన చూసి అప్పటి స్టార్ హీరో కృష్ణంరాజు, మరో ప్రముఖ నటుడు మురళీమోహన్ మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. చిరంజీవి మంచి విలన్ అవుతాడని కృష్ణం రాజు.. లేదు ఇండస్ట్రీకి మొగుడు అవుతాడని మురళీ మోహన్ అనుకున్నారట. చివరకు మురళీ మోహన్ అన్న మాటలే నిజం అయ్యాయి.
ఇండస్ట్రీకి మొగుడిలా తయారయిన చిరంజీవి..
‘మనవూరి పాండవులు’ సినిమా సమయంలో జరిగిన ఆ చర్చలో, చిరంజీవి నటన చూసిన కృష్ణంరాజు, “ఈ చూపులు చూస్తుంటే నెగటివ్ రోల్స్‌కి బాగా సెట్ అవుతాడు… మంచి విలన్ అవుతాడు చూడు” అని మురళీ మోహన్ తో అన్నారు. దానికి వెంటనే మురళీమోహన్ స్పందిస్తూ, “విలన్ ఏంటి సార్… ఇండస్ట్రీకి మొగుడు అవుతాడు చూడండి” అని అన్నారట. మురళీమోహన్ చేసిన ఆ మాటలు నిజమయ్యాయి. ఈ విషాయన్ని స్వయంగా మురళీ మోహన్ ఓ కార్యక్రమంలో వెల్లడించారు.
టాలీవుడ్ పెద్దన్నగా మెగాస్టార్
చిరంజీవి పడిన కష్టానికి మంచి ఫలితాలు వచ్చాయి.. చిరంజీవి కెరీర్ అద్భుత మలుపులు తిరిగి, ఆయన టాలీవుడ్ చరిత్రలో ఎవరూ అందుకోలేని మెగాస్టార్ స్థాయికి ఎదిగారు. మూడు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీపై ప్రభావం చూపుతూ, తెలుగు సినీ రంగానికి దిక్సూచిగా నిలిచారు. దాసరి మరణం తరువాత చిరంజీవి ఇండస్ట్రీకి పెద్దగా మారారు. టాలీవుడ్ సమస్యల పరిష్కారంలో ముందుంటు.. నాయకుడిగా పరిశ్రమను నడిపిస్తున్నాడు. స్వయంకృషి, పట్టుదల, క్రమశిక్షణతో ఎదిగిన చిరంజీవి అందరి కష్టాలు తెలుసుకుని పరిష్కారాలు చూపుతున్నాడు. ప్రభుత్వాలకు, పరిశ్రమకు వారధిలా మారాడు.

