దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందించిన చిత్రం 'యాత్ర'. టైటిల్ కి తగ్గట్లుగా సినిమా మొత్తం వైఎస్ పాదయాత్ర చుట్టూ తిరుగుతుంటుంది. సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను మహి వి రాఘవ్ డైరెక్ట్ చేశారు.  

భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్న 70 ఎంఎంఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అత్యంత భారీ వ్య‌యంతో, ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ  చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి శివ మేక సమర్పకుడు.

ఆంధ్రప్ర‌దేశ్ ఎన్నికులు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ఫిబ్ర‌వరి 8న యాత్ర‌ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.  తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొంది. సెన్సార్ నుండి ఒక్క కట్ కూడా లేకుండా.. క్లీన్ 'యు' సర్టిఫికేట్ ని దక్కించుకుంది. 

అలానే సెన్సార్ సభ్యులు సినిమాపై అభినందనలు కురిపించినట్లుగా నిర్మాతలు వెల్లడించారు. సెన్సార్ విషయంలో ఈ సినిమాకు ఇబ్బందులు తప్పవని చాలా మంది భావించారు. కానీ వారికి షాక్ ఇచ్చే విధంగా సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తవ్వడం గమనార్హం.