ఏపీలో ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఎన్టీఆర్, వైఎస్సార్ బయోపిక్ లను తెరకెక్కించారు. ఇప్పటికే ఎన్టీఆర్ 'కథానాయకుడు' విడుదల కాగా, ఎన్టీఆర్ 'మహానాయకుడు' ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సినిమాకి పోటీగా వైఎస్సార్ బయోపిక్ 'యాత్ర'ని రంగంలోకి దించాలని ప్లాన్ చేశారు. మొదటినుండి కూడా యాత్ర సినిమా ఎన్టీఆర్ బయోపిక్ కి పోటీగా వచ్చేలా పావులు కదిపారు. ఆ విధంగా యాత్రపై బజ్ క్రియేట్ అవుతుందని భావించారు. ఎన్టీఆర్, వైఎస్సార్ సినిమాల మధ్య మంచి పోటీ ఉంటుందని ఊహించారు.

కానీ ఇప్పుడు ఎన్టీఆర్ 'మహానాయకుడు' సినిమాని వాయిదా వేయడంతో ఫిబ్రవరి 8న యాత్రం ఒంటరిగానే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటివరకు ఈ సినిమాపై ఎలాంటి హైప్ క్రియేట్ చేయలేకపోయింది చిత్రబృందం. టీజర్, ట్రైలర్ లకు పెద్దగా క్రేజ్ రాలేదు.

సినిమా పోస్టర్లు కూడా రొటీన్ గానే ఉండడంతో ఈ సినిమాపై ఎవరి దృష్టి పడడం లేదు. ఒక మీడియా సంస్థ స్పెషల్ గా ఈ సినిమాను ప్రమోట్ చేస్తుందనుకుంటే అది కూడా లేదు. దీంతో ఈ సినిమాను పట్టించుకునేవారే లేకుండా పోయింది. మరి సినిమాకు ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి!