వైఎస్సార్ బయోపిక్ ఆధారంగా 'యాత్ర' అనే సినిమాను రూపొందిస్తున్నాడు దర్శకుడు మహి వి రాఘవ్. ఈ సినిమాలో వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి కనిపిస్తుండగా.. జగన్ పాత్రలో ఎవరు కనిపిస్తారనే ఆసక్తి అభిమానుల్లో కలిగింది.

కొంతమంది స్టార్ హీరోల పేర్లు వినిపించినప్పటికీ ఇప్పుడు జగన్ పాత్రలో నేరుగా వైఎస్ జగనే కనిపిస్తాడని తెలుస్తోంది. జగన్ నటిస్తున్నాడని అనుకోకండి.. అసలు విషయమేమిటంటే.. ఈ సినిమాలో వైఎస్సార్ పాదయాత్ర పూర్తి చేసుకొని, అధికారం చేపట్టే వరకే చూపించబోతున్నారు. ఆ తరువాత వైఎస్ మరణం వరకు సినిమా ఉంటుంది. 

కానీ అదేదీ చిత్రీకరించకుండా.. ఒరిజినల్ ఫుటేజ్ ని వాడబోతున్నారు. చివరి ఇరవై నిమిషాలు కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికున్నప్పుడు తీసిన ఫుటేజ్ ని ఎడిట్ చేసి తెరపై చూపించబోతున్నారు. వైఎస్ అంతిమ సంస్కారాల సమయంలో జగన్ కనిపిస్తారు. అక్కడ కూడా ఒరిజినల్ ఫుటేజ్ ని చూపించబోతున్నారు. 

బయోపిక్ లో ఒరిజినల్ ఫుటేజ్ ని వాడడం ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి. ఈ సినిమాను ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.