మొదటనుంచీ వైయస్సార్ పార్టీతో కింగ్ నాగార్జున అనుబంధం గురించి తెలిసిందే. రాజకీయాల్లో నాగార్జున ప్రత్యక్షంగా లేకపోయినా వైకాపా అంటే ఆయన అభిమానం చూపిస్తుంటారనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ పార్టీ నాయకులతోనూ చక్కని అనుబంధం కలిగి ఉన్నారు. దాంతో ఆయన్ను యాత్ర చిత్రం ప్రీ రిలీజ పంక్షన్ కు చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. 

దివంగత నేత , మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఘట్టాన్ని బేస్ చేసుకుని రూపొందిస్తున్న చిత్రం యాత్ర. పాద యాత్రకు ముందు, యాత్రలో, ఆ తర్వాత చోటు చేసుకున్న సంఘటనలు సన్నివేశాలగా రూపొందించి సినిమాగా రూపొందించారు.  ఈ మూవీలో మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి... వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాత్రలో నటిస్తున్నారు. 

ఇప్పటికే విడుదల  చేసిన పోస్టర్స్‌, టీజర్‌, సాంగ్స్‌తో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.  తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఫిబ్రవరి ఒకటో తేదీన హైద్రాబాద్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌లో ఈ ఈవెంట్‌ జరుగనున్నట్లు నిర్మాతలు తెలిపారు.ఈ  ప్రి రిలీజ్ వేడుకకు నాగార్జున ని ఛీఫ్ గెస్ట్ గా అడిగారని తెలుస్తోంది. అయితే ఆయన వస్తారా ..రారా అన్నది మాత్రం ఇంకా క్లారిటీ లేదట.

కొద్దిగా బిజిగా ఉంటానని, ఆలోచించి చెప్తానని నాగ్ చెప్పినట్లు సమాచారం. అయితే నాగ్ ఈ పంక్షన్ కు వస్తే ..తనకు రాజకీయ రంగు పులుముకున్నట్లు అవుతుందని భావిస్తున్నారని, అందుకే ఎవాయిడ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు.

శివ మేక సమర్పణలో విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్‌ మహి వి. రాఘవ్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 8న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదలకానుంది.