- Home
- Entertainment
- Akhanda 2 Collections: `అఖండ 2` మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు, బాక్సాఫీసు వద్ద దుమారం.. బాలయ్య టాప్ 5 ఓపెనింగ్స్
Akhanda 2 Collections: `అఖండ 2` మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు, బాక్సాఫీసు వద్ద దుమారం.. బాలయ్య టాప్ 5 ఓపెనింగ్స్
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన `అఖండ 2` ఈ శుక్రవారం నుంచి థియేటర్లలో సందడి చేస్తోంది. మరి ఈ చిత్రానికి మొదటి రోజు బాక్సాఫీసు వద్ద ఎంత కలెక్షన్లు వచ్చాయనేది చూద్దాం.

బాక్సాఫీసు వద్ద `అఖండ 2` రచ్చ
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన `అఖండ 2` ఈ శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. గత వారం విడుదల కావాల్సిన ఈ మూవీ ఫైనాన్స్ ఇష్యూస్ వల్ల వాయిదా పడింది. అది ఎట్టకేలకు సెటిల్ అయ్యింది. మద్రాస్ కోర్ట్ కూడా క్లీయరెన్స్ ఇవ్వడంతో గురువారం రాత్రి ప్రీమియర్స్ తో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. బాలయ్య అభిమానులకు నచ్చుతుందని అంటున్నారు. సాధారణ ఆడియెన్స్ మాత్రం దారుణంగా ఉందని కామెంట్ చేస్తున్నారు. చాలా వరకు నెగటివ్ టాక్ వినిపిస్తోంది. ఏమాత్రం ఆకట్టుకునేలా లేదంటున్నారు.
`అఖండ 2` మొదటి రోజు కలెక్షన్లు
ఈ క్రమంలో `అఖండ 2` మూవీ కలెక్షన్ల రిపోర్ట్ బయటకు వచ్చింది. ఈ చిత్రం మొదటి రోజు ఎంత వసూళు చేసిందనేది ఆసక్తికరంగా మారింది. డివైడ్ టాక్‌తోనూ దుమ్ములేపినట్టు సమాచారం. ఈ మూవీ ప్రీమియర్స్, ఫస్ట్ డేతో కలిసి ఇండియాలో భారీ వసూళ్లని రాబట్టింది. ఏకంగా రూ.36కోట్లు వసూలు చేసినట్టు sacnilk.com పేర్కొంది. ప్రీమియర్స్ ద్వారా ఈ చిత్రానికి రూ.9.6 కోట్లు వస్తే, మొదటి రోజు 26.58 కోట్లు రాబట్టింది. ఇలా మొత్తంగా రూ.36.18 కోట్లని వసూలు చేసింది. అయితే చిత్ర బృందం మాత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ ప్రీమియర్స్, ఫస్ట్ డే కలిపి ఏకంగా రూ.59.5కోట్లు వసూలు చేసినట్టు ప్రకటించడం విశేషం.
`డాకు మహారాజ్`ని దాటేసిన `అఖండ 2`
ఇదిలా ఉంటే `అఖండ 2` మూవీ వసూళ్లు బాలయ్య గత చిత్రం `డాకు మహారాజ్`ని దాటేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఆ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.56కోట్లు వసూళు చేసింది. బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు `అఖండ 2` పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ అయ్యింది. దీంతో దాన్ని దాటేసింది. అయితే టీమ్ ప్రకటించిన వసూళ్లలో రియాలిటీ ఎంతనేది తెలియాల్సి ఉంది.
బాలయ్య మూవీస్ టాప్ 5 డే 1 కలెక్షన్లు
బాలయ్య టాప్ ఓపెనింగ్ మూవీస్ చేస్తే, రూ.59.5కోట్లతో `అఖండ 2` నెంబర్ `1గా నిలిచింది. `డాకు మహారాజ్` రూ.56కోట్లతో రెండో స్థానంలో నిలిస్తే, రూ.54కోట్ల కలెక్షన్లతో `వీరసింహారెడ్డి` మూడో స్థానంలో ఉంది. రెండేళ్ల క్రితం సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ వసూళ్ల పరంగా దుమ్ములేపింది. ఇక రూ.32కోట్ల ఓపెనింగ్ కలెక్షన్లతో `భగవంత్ కేసరి` నాల్గో స్థానంలో ఉంది. నాలుగేళ్ల క్రితం వచ్చిన `అఖండ 2` మూవీ రూ.30కోట్లతో టాప్ 5లో ఉంది.
`అఖండ 2`లో ఏం చూపించారంటే
బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన `అఖండ 2`లో ఆదిపినిశెట్టి విలన్‌గా నటించారు. పూర్ణ, హర్షాలీ కీలక పాత్రలు పోషించారు. హీరోయిన్ సంయుక్త మరో ముఖ్య పాత్ర పోషించారు. ఆమె బాలయ్యతో కలిసి డాన్సు కూడా చేసింది. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ మూవీని నిర్మించారు. ఈ శుక్రవారం విడుదలైన ఈ మూవీలో ఎక్కువగా శివతత్వాన్ని చూపించారు. అయితే బాలయ్య ఇందులో యాక్షన్ సీన్లలో, హిందుత్వం గురించి చెప్పే సీన్లలోనే కనిపించారని, ఆయన మిగిలిన సీన్లలో పెద్దగా కనిపించలేదనే టాక్ వినిపిస్తోంది. రొటీన్ యాక్షన్ మూవీ తప్ప, ఇందులో ఏమీ కొత్తదనం లేదని, శివుడు, నరసింహ స్వామి సీన్లతో హడావుడు చేసే ప్రయత్నం చేసినట్టుగా ఆడియెన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ నెగటివ్ టాక్ సినిమా వసూళ్లపై ప్రభావం చూపుతుందని, రెండో రోజు దారుణంగా పడిపోయే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి పెరుగుతాయా? పడిపోతాయా? అనేది చూడాలి. ఈ శని, ఆదివారం వసూళ్లని బట్టి ఈ మూవీ ఫలితం ఆధారపడి ఉంటుంది.

