MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • Vijay-Ajith మధ్య మళ్లీ బాక్సాఫీసు వార్‌... ఫిబ్రవరి 20న థియేటర్, ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు ఇవే!

Vijay-Ajith మధ్య మళ్లీ బాక్సాఫీసు వార్‌... ఫిబ్రవరి 20న థియేటర్, ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు ఇవే!

ఫిబ్రవరి 20న థియేటర్లలో కొత్త సినిమాల కన్నా రీ-రిలీజ్ చిత్రాల సందడే ఎక్కువగా ఉంది. అజిత్‌, విజయ్‌ మధ్య గట్టి బాక్సాఫీసు పోటీ నెలకొనబోతుంది. అలాగే ఓటీటీలో కూడా కొన్ని సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 17 2026, 08:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఈ వారం కోలీవుడ్ ఆడియెన్స్ ని అలరించే థియేటర్‌, ఓటీటీ మూవీస్‌
Image Credit : times of india

ఈ వారం కోలీవుడ్ ఆడియెన్స్ ని అలరించే థియేటర్‌, ఓటీటీ మూవీస్‌

ఈ వారం కొత్త సినిమాల కంటే రీ-రిలీజ్ చిత్రాలే ఎక్కువగా విడుదల కానున్నాయి. అలాగే ఓటీటీలోనూ కొన్ని సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. కోలీవుడ్‌లో సందడి చేయబోతున్న ఆ సినిమాలేంటో చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
విజయ్‌ అభిమానులకు పండగే పండగ
Image Credit : our own

విజయ్‌ అభిమానులకు పండగే పండగ

ఈ వారం కోలీవుడ్‌ ఆడియెన్స్ భారీ సినిమాల పండగ రాబోతుంది. అయితే అది రీ రిలీజ్‌ చిత్రాల ఫెస్టివల్‌ అని చెప్పొచ్చు. ఫిబ్రవరి 20న విజయ్ నటించిన రెండు సినిమాలు మళ్లీ విడుదల కానున్నాయి. ఒకటి, అట్లీ దర్శకత్వంలో, థాను నిర్మాణంలో వచ్చిన 'తెరి'. మరొకటి, విజయ్ కెరీర్‌లో ఎవర్ గ్రీన్ హిట్‌గా నిలిచిన 'గిల్లీ'. 2024లో 'గిల్లీ'ని రీ-రిలీజ్ చేసినప్పుడు అద్భుతమైన స్పందన వచ్చింది. కలెక్షన్లలో రికార్డులు సృష్టించింది. అందుకే థియేటర్ యాజమాన్యాల కోరిక మేరకు ఈ సినిమాను మళ్లీ విడుదల చేస్తున్నారు. 'జననాయగన్'   సినిమా విడుదల కాకపోవడంతో నిరాశలో ఉన్న విజయ్ అభిమానులకు ఈ రీ-రిలీజ్ కాస్త ఊరటనివ్వనుంది.

Related Articles

Related image1
Mohanbabu: ఎన్టీఆర్‌ ముందే మోహన్‌బాబు కాళ్లు మొక్కిన సూపర్‌ స్టార్‌.. ఏఎన్నార్‌, రామారావుతోపాటు అంతా షాక్‌
Related image2
Rajinikanth అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన ఒకే ఒక్క మూవీ ఏంటో తెలుసా? డైరెక్టర్‌ ఆశ్చర్యపోయే సంఘటన
35
విజయ్‌ కి పోటీ ఇవ్వబోతున్న అజిత్‌
Image Credit : instagram

విజయ్‌ కి పోటీ ఇవ్వబోతున్న అజిత్‌

విజయ్‌కి పోటీగా అజిత్ నటించిన 'తునివు' సినిమా కూడా ఈ వారం రీ-రిలీజ్ అవుతోంది. ఈ చిత్రానికి హెచ్. వినోద్ దర్శకత్వం వహించారు. రోమియో పిక్చర్స్ రాహుల్ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ వారం రీ-రిలీజ్‌లో తల, దళపతి మధ్య పోటీ ఉండటంతో థియేటర్లు నిండిపోయే అవకాశం ఉంది. అలాగే, ఈ రీ-రిలీజ్ పోటీలోకి 'సూదు కవ్వుమ్' కూడా వస్తోంది. నలన్ కుమారస్వామి దర్శకత్వంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన ఈ సినిమా రీ-రిలీజ్‌లో ఎంతటి ఆదరణ పొందుతుందో చూడాలి.

45
చిన్న చిత్రాల పండగ
Image Credit : stockPhoto

చిన్న చిత్రాల పండగ

నటరాజ్, సెంథిల్, ఇమాన్ అన్నాచి నటించిన 'శివ శంభో' సినిమా ఫిబ్రవరి 20న విడుదల కానుంది. అలాగే భావన నటించిన 'అనోమి', జయరాం నటించిన 'ఆశైగళ్ ఆయిరం' అనే మలయాళ చిత్రాలు డబ్ చేసి  ఈ వారం థియేటర్లలోకి వస్తున్నాయి. వీటితో పాటు 'లోకల్ బాయ్స్', 'అరివాన్', 'లవ్ సబ్‌స్క్రైబ్ షేర్స్', 'ఎంజీ 24', 'మై డియర్ డాలీ', 'సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం' వంటి చిన్న బడ్జెట్ చిత్రాలు కూడా ఈ వారం తమిళనాట విడుదల కానున్నాయి.

55
 ఓటీటీలోకి రాబోతున్న చిత్రాలు
Image Credit : X

ఓటీటీలోకి రాబోతున్న చిత్రాలు

ఓటీటీలో ఈ ఫిబ్రవరి 20న జీవీ ప్రకాష్ నటించిన 'లక్కీ' అనే సినిమా విడుదల కానుంది. ఈ చిత్రం నేరుగా జియో హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ అవుతోంది. ఉదయ్ మహేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇందులో జీవీ ప్రకాష్ సరసన అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటించింది. సుబ్బు పంజు, దేవదర్శిని, డాని కూడా ముఖ్య పాత్రలు పోషించారు. ఇది కాకుండా, విఘ్నేష్ కార్తీక్ దర్శకత్వంలో ప్రియా భవానీ శంకర్, అశ్విన్, రక్షణ్ నటించిన 'హాట్‌స్పాట్ టూమచ్' ఈ వారం అమెజాన్ ప్రైమ్, ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదల కానుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Recommended image2
Vijay Deverakonda: మందు, అమ్మాయి, బ్రేకప్‌ ఇప్పుడు పెళ్లి.. తన లైఫ్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసిన రౌడీ బాయ్
Recommended image3
Raviteja Remuneration: ఇరుముడి మూవీకి రవితేజ పారితోషికం ఎంతో తెలుసా? చిరంజీవిని మించి.. టీమ్‌ ఫీజు వివరాలు
Related Stories
Recommended image1
Mohanbabu: ఎన్టీఆర్‌ ముందే మోహన్‌బాబు కాళ్లు మొక్కిన సూపర్‌ స్టార్‌.. ఏఎన్నార్‌, రామారావుతోపాటు అంతా షాక్‌
Recommended image2
Rajinikanth అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన ఒకే ఒక్క మూవీ ఏంటో తెలుసా? డైరెక్టర్‌ ఆశ్చర్యపోయే సంఘటన
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved