MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Mohanbabu: ఎన్టీఆర్‌ ముందే మోహన్‌బాబు కాళ్లు మొక్కిన సూపర్‌ స్టార్‌.. ఏఎన్నార్‌, రామారావుతోపాటు అంతా షాక్‌

Mohanbabu: ఎన్టీఆర్‌ ముందే మోహన్‌బాబు కాళ్లు మొక్కిన సూపర్‌ స్టార్‌.. ఏఎన్నార్‌, రామారావుతోపాటు అంతా షాక్‌

ఎన్టీఆర్‌ ముందే మోహన్‌ బాబు కాళ్లు మొక్కారు సూపర్‌ స్టార్‌. అది చూసిన రామారావు, ఏఎన్నార్‌, దాసరి వంటి వారు కూడా షాక్‌ అయ్యారు. మరి `పెదరాయుడు` సమయంలో అసలేం జరిగిందంటే? 

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 17 2026, 08:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మోహన్‌ బాబు కాళ్లు మొక్కిన సూపర్‌ స్టార్‌
Image Credit : our own

మోహన్‌ బాబు కాళ్లు మొక్కిన సూపర్‌ స్టార్‌

కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌ బాబు ఇప్పుడు చాలా సెలక్టీవ్‌గా మూవీస్‌ చేస్తున్నారు. చివరగా ఆయన `కన్నప్ప` మూవీలో మెరిశారు. ఇప్పుడు నానితో `పారడైజ్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో విలన్‌గా కనిపించబోతున్నారు మోహన్‌ బాబు. ఈ క్రమంలో మోహన్‌ బాబుకి సంబంధించిన ఒక అరుదైన, ఆసక్తికర సంఘటన ఒకటి బయటకు వచ్చింది. అంతా నోరెళ్ల బెట్టే సంఘటన చోటు చేసుకుంది. ఎన్టీఆర్‌ కూడా ఆశ్చర్యపోయారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మోహన్‌ బాబు కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ `పెదరాయుడు`
Image Credit : our own

మోహన్‌ బాబు కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ `పెదరాయుడు`

మోహన్‌బాబు కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ `పెదరాయుడు`. 1995లో విడుదలైన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్‌ గా నిలిచింది. కలెక్షన్ల రికార్డులు తిరగరాసింది. ఈ సినిమాకి రవిరాజా పనిశెట్టి దర్శకత్వం వహించారు. ఇందులో మోహన్‌ బాబుతోపాటు రజనీకాంత్‌ నటించారు. ఆయనది స్పెషల్‌ రోల్‌గా చెప్పొచ్చు. భానుప్రియ, సౌందర్య ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా అటు మోహన్‌బాబు కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది. మరోవైపు ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్‌ చేసింది.

35
రీమేక్‌ చేయమని మోహన్‌ బాబుకి చెప్పిన రజనీకాంత్‌
Image Credit : our own

రీమేక్‌ చేయమని మోహన్‌ బాబుకి చెప్పిన రజనీకాంత్‌

అయితే ఈ మూవీ తమిళంలో వచ్చిన `నట్టమై` అనే చిత్రానికి రీమేక్‌. అందులో శరత్‌ కుమార్‌ నటించారు. కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వం వహించారు. అక్కడ కూడా పెద్ద హిట్‌ అయ్యింది. ఈ సినిమాని చూసిన రజనీకాంత్‌ తెలుగులో రీమేక్‌ చేయాలని మోహన్‌ బాబుకి సలహా ఇచ్చారు. మోహన్‌ బాబు మూవీ చూసి రీమేక్‌ రైట్స్ తీసుకున్నారు. రజనీకాంత్‌ చెప్పడం వల్లే ఈ రీమేక్‌ రైట్స్ మోహన్‌ బాబుకి వరించాయి. అయితే ఇందులో పాపారాయుడు పాత్ర చాలా కీలకమైనది. ఆ పాత్రకి ఎవరిని తీసుకోవాలనేది మోహన్‌ బాబుకి అర్థం కాలేదు. ఇదే చర్చ రజనీకాంత్‌తో వచ్చింది. `అరేయ్‌ ఆ పాత్రని నేనే చేస్తున్నా` అని చెప్పారాట రజనీకాంత్‌.

45
ఎన్టీఆర్‌ ముందే మోహన్‌ బాబు కాళ్లు మొక్కిన రజనీకాంత్‌
Image Credit : our own

ఎన్టీఆర్‌ ముందే మోహన్‌ బాబు కాళ్లు మొక్కిన రజనీకాంత్‌

రజనీకాంత్‌, మోహన్‌ బాబు బెస్ట్ ఫ్రెండ్స్. ఆ స్నేహంతోనే కలెక్షన్‌ కింగ్‌కి ఈ మూవీ వచ్చేలా చేశారు. అంతేకాదు పాపారాయుడు పాత్రని తానే పోషించారు. అయితే ఇందులో మరో విశేషమేంటంటే, పాపారాయుడు పాత్రలో తాను నటించేందుకే మోహన్‌బాబుతో ఈ రీమేక్‌ రైట్స్ కొనిపించారట రజనీ. దానికి మోహన్‌ బాబు కూడా ఒప్పుకున్నారు. ఈ సినిమా ఓపెనింగ్‌ కార్యక్రమానికి ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, దాసరి, రామానాయుడు వంటి దిగ్గజాలు పాల్గొన్నారు. ఎన్టీఆర్‌ క్లాప్స్ అయిపోగానే మోహన్‌ బాబు పూలదండని రజనీకాంత్‌ మెడలో వేశారు. అది వెంటనే తీసి మోహన్‌ బాబుకి వేశారట రజనీకాంత్‌. అంతేకాదు అందరి ముందే మోహన్‌ బాబు కాళ్లు మొక్కారట రజనీకాంత్‌. ఇది చూసి అంతా షాక్‌.

55
మోహన్‌ బాబు మంచి మనసుకి నమస్కారం
Image Credit : our own

మోహన్‌ బాబు మంచి మనసుకి నమస్కారం

మోహన్‌బాబు కాళ్లని రజనీకాంత్‌ మొక్కడమేంటి? అని ఆశ్చర్యపోయారు. ఎందుకంటే రజనీకాంత్‌ అప్పటికే కోలీవుడ్‌లో సూపర్‌ స్టార్‌ గా రాణిస్తున్నారు. అంతటి పెద్ద స్టార్‌ మోహన్‌ బాబు కాళ్లని మొక్కడంతో ఒక్కసారిగా అంతా నోరెళ్లబెట్టారు. అయితే ఈ సందర్భంగా ఏంట్రా ఇది అని మోహన్‌ బాబు అడగ్గా, `అరేయ్‌ నీ మంచి మనసుకి మొక్కానురా` అన్నారట. ఈ విషయాన్ని మోహన్‌ బాబునే స్వయంగా వెల్లడించారు. ఆ వీడియో క్లిప్‌ ఇప్పుడు వైరల్‌ అవుతుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Actress Roja: రోజా నిద్రపోతుంటే రజనీకాంత్ చేసిన అల్లరి పనికి అంతా షాక్‌.. సెట్‌లో సూపర్‌స్టార్‌ ఎలా ఉంటారంటే?
Recommended image2
Varanasi Update: మహేష్‌ `వారణాసి` నుంచి అదిరిపోయే అప్‌ డేట్‌.. అప్పట్నుంచే అసలైన పండగ షురూ
Recommended image3
Bigg Boss 10: బిగ్ బాస్ నుంచి బయటకొచ్చి షాకింగ్ కామెంట్స్ చేసిన నటుడు కృష్ణుడు.. మరో రచ్చ
Related Stories
Recommended image1
Rajinikanth అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన ఒకే ఒక్క మూవీ ఏంటో తెలుసా? డైరెక్టర్‌ ఆశ్చర్యపోయే సంఘటన
Recommended image2
Ibomma Ravi కి ఎట్టకేలకు బెయిల్‌.. రవికి కోర్టు పెట్టిన కండీషన్లు తెలిస్తే మాత్రం మతిపోవాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved