MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Ibomma Ravi కి ఎట్టకేలకు బెయిల్‌.. రవికి కోర్టు పెట్టిన కండీషన్లు తెలిస్తే మాత్రం మతిపోవాల్సిందే

Ibomma Ravi కి ఎట్టకేలకు బెయిల్‌.. రవికి కోర్టు పెట్టిన కండీషన్లు తెలిస్తే మాత్రం మతిపోవాల్సిందే

సినిమాల పైరసీధారుడు ఐబొమ్మ రవి మూడు నెలల క్రితం అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇన్నాళ్లు రిమాండ్‌లో ఉన్నా ఆయనకు ఎట్టకులకు బెయిల్‌ దొరికింది. కోర్ట్ పెట్టిన కండీషన్లు మాత్రం కఠినంగా ఉన్నాయి. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 17 2026, 06:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఐబొమ్మ రవికి బెయిల్‌
Image Credit : Asianet News

ఐబొమ్మ రవికి బెయిల్‌

సినిమాలను పైరసీ చేసి చిత్ర పరిశ్రమకు వణుకు పుట్టించిన ఐబొమ్మ రవి ఎట్టకేలకు పోలీసులకు దొరికిపోయిన విషయం తెలిసిందే. గతేడాది నవంబర్‌లోనే ఆయన్ని పోలీసులు పట్టుకున్నారు. దాదా మూడు నెలలు పోలీసుల కస్టడీలోనే ఉన్న రవికి ఎట్టకేలకు బెయిల్‌ దొరికింది. పలు షరతులతో కూడిన బెయిల్‌ని మంజూరు చేసింది కోర్ట్. చాలా కఠినమైన షరతులు విధించడం విశేషం. రవి ప్రతి రోజూ హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌(సీసీఎస్‌) అధికారుల ముందు హాజరై సంతకం చేయాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. విచారణకు పూర్తిగా సహకరించాలని స్పష్టం చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఐబొమ్మ రవికి బెయిల్‌ కండీషన్లు
Image Credit : Asianet News

ఐబొమ్మ రవికి బెయిల్‌ కండీషన్లు

అంతేకాదు సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేయకూడదని వెల్లడించింది. అందులో భాగంగా మరో ముఖ్యమైన కండీషన్‌ విధించింది. పాస్‌ పోర్ట్ ని వెంటనే కోర్ట్ లో సమర్పించాల్సి ఉంటుంది. అనుమతి లేకుండా దేశం వదిలి వెళ్లకూడదు. అదే సమయంలో ఇంటర్నెట్‌ని వాడకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనే నెట్‌ని వాడకూడదని వెల్లడించింది కోర్ట్. రవి సైబర్‌ నేరగాడు కేటగిరిలోకి వస్తాడు కాబట్టి ఇంటర్నెట్‌ ఉపయోగించి సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంటుందని కోర్ట్ ఈ కఠినమైన కండీషన్స్ ని పెట్టింది.

35
కొన్నాళ్లుగా నిఘా పెట్టి రవిని పట్టుకున్న హైదరాబాద్‌ పోలీసులు
Image Credit : Asianet News

కొన్నాళ్లుగా నిఘా పెట్టి రవిని పట్టుకున్న హైదరాబాద్‌ పోలీసులు

ఐబొమ్మ రవి అత్యవసర పరిస్థితుల్లో ఇంటర్నెట్‌ని ఉపయోగిస్తే కచ్చితంగా పోలీసుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని కోర్ట్ తన తీర్పులో వెల్లడించింది. ఇమ్మంది రవి ఐబొమ్మ అనే పైరసీ సైట్‌ని నడిపించారు. ఇతరుల భాగస్వామ్యంతో కలిసి ఆయన దీన్ని నిర్వహించారు. హెచ్‌ డీ క్వాలిటీతో సినిమాలను పైరసీ చేసి చిత్ర పరిశ్రమకి కోట్ల నష్టాన్ని తీసుకొచ్చారు. చాలా కాలంగా హైదరాబాద్‌ పోలీసులు రవిపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఆయన్ని ఎట్టకేలకు పట్టుకున్నారు.

45
రవి విచారణలో షాకిచ్చే నిజాలు
Image Credit : Asianet News

రవి విచారణలో షాకిచ్చే నిజాలు

నవంబర్‌ 16న ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు. కూకట్‌పల్లిలోనే తన ఫ్లాట్‌కి వచ్చిన రవిని స్నేహితుల ఫోన్‌ చాట్‌ ద్వారా కనిపెట్టి పట్టుకున్నారు. ప్రాథమిక విచారణ అనంతరం కస్టడీలోకి తీసుకున్నారు. కోట్ల విలువైన స్కామ్‌ కావడంతో ఈ కేసుకి సంబంధించి సుధీర్ఘంగా విచారించారు. ఈ క్రమంలో పలు షాకిచ్చే విషయాలు బయటకు వచ్చాయి. రవి మాత్రమే కాదు ఐబొమ్మ సైట్‌ నిర్వాహకుల్లో మరికొందరు ఉన్నట్టు తేలింది. వేల సినిమాలు పైరసీ చేసినట్టు, కోట్ల రూపాయల్లో స్కామ్‌ జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఇందులో రవి కీలకమైన వ్యక్తిగా, సర్వర్లని హ్యాక్‌ చేసి సినిమాలను పైరసీ చేసినట్టు విచారణలో తేలింది.

55
రవి అరెస్ట్ పై తండ్రి రియాక్షన్‌ ఇదే
Image Credit : ntv

రవి అరెస్ట్ పై తండ్రి రియాక్షన్‌ ఇదే

ఐబొమ్మ రవికి మ్యారేజ్‌ కూడా అయ్యింది. ఆయన హైదరాబాద్‌లో ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ కొన్ని రోజులకే విడిపోయారు. అత్తామామ బాగా అవమానించేవారని, ఆ అవమానం తట్టుకోలేకే, డబ్బు కోసం ఆయన ఇలాంటి తప్పుడు దారి ఎంచుకున్నట్టు తెలిసింది. రవికి తండ్రి కూడా ఉన్నారు. ఆయనకు ఈ విషయాలు తెలియవు. కొడుకు విషయంలో చట్టం తనపని చేసుకుపోతుందని, తప్పు చేస్తే శిక్షించాలని తెలిపారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Actress Roja: రోజా నిద్రపోతుంటే రజనీకాంత్ చేసిన అల్లరి పనికి అంతా షాక్‌.. సెట్‌లో సూపర్‌స్టార్‌ ఎలా ఉంటారంటే?
Recommended image2
Varanasi Update: మహేష్‌ `వారణాసి` నుంచి అదిరిపోయే అప్‌ డేట్‌.. అప్పట్నుంచే అసలైన పండగ షురూ
Recommended image3
Bigg Boss 10: బిగ్ బాస్ నుంచి బయటకొచ్చి షాకింగ్ కామెంట్స్ చేసిన నటుడు కృష్ణుడు.. మరో రచ్చ
Related Stories
Recommended image1
Rajinikanth అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన ఒకే ఒక్క మూవీ ఏంటో తెలుసా? డైరెక్టర్‌ ఆశ్చర్యపోయే సంఘటన
Recommended image2
Vijay Rashmika Wedding Card: విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌.. పెళ్లి చిన్నగా, రిసెప్షన్‌కి రండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved