త‌ల్లిదండ్రులకు  తమ  పిల్లలు ప‌లికే మొద‌టి మాట‌, వారు వేసే తొలి అడుగు.. ప్రతీదీ అపురూప‌మే. 'కేజీఎఫ్' హీరో య‌ష్‌, అత‌ని భార్య రాధికా పండిట్ ఇప్పుడు అలాంటి ఆనంద క్షణాల‌ను ఎంజాయ్ చేస్తున్నారు. య‌థ‌ర్వ్ వారి జీవితాల్లోకి కొత్త కాంతులను తెస్తున్నాడు. ఆ పిల్లవాడితో తమ ఆనందాలను సెలబ్రేట్ చేసుకుంటూ అప్పుడప్పుడూ తమ అభిమానులకు వాటి రుచి చూపిస్తున్నారు. 

రీసెంట్ గా   రాధికా పండిట్ త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో య‌ష్‌, య‌థ‌ర్వ్‌కు చెందిన‌ రెండు అంద‌మైన వీడియోల‌ను షేర్ చేసింది. వాటిలో య‌థ‌ర్వ్‌కు 'జానీ జానీ య‌స్ పాపా' రైమ్‌కు నేర్పుతున్నాడు య‌ష్‌. ఆ రైమ్‌కు య‌థ‌ర్వ్ స్పందించి "హ‌హ్హహ్హ" అన‌డం ముచ్చట‌గా ఉంది.  ఆ వీడియోలకు రాధిక "Lockdown diaries : One Johnny and Another (a rather impatient one)" అనే క్యాప్షన్ పెట్టింది. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.  మీరూ ఇక్కడ ఆ వీడియోని చూడవచ్చు.