Asianet News TeluguAsianet News Telugu

రెచ్చిపోయిన విశ్వక్ సేన్, నా కొడుకులు అంటూ ఘాటుగా పోస్ట్ పెట్టిన యంగ్ హీరో ..

టాలీవుడ్ యంగ్ హీరోలలో దూకుడు మీద ఉన్నాడు విశ్వక్ సేన్. ఉడుకురక్తం ఉరకలు వేస్తుంటే.. తనను తొక్కేయాలని చూస్తున్న వారిపై ఫైర్ అవుతున్నాడు. కాని పోస్ట్ పెట్టిన కాసేపటికే డిలెట్ చేశాడుయంగ్ హీరో..
 

Vishwak Sen Strong Social Media Post on tollywood Nepo Kids JMS
Author
First Published Oct 29, 2023, 2:31 PM IST | Last Updated Oct 29, 2023, 2:31 PM IST


ఇప్పుడున్న యంగ్ హీరోల్లో  దూకుడు  చూపించేది విశ్వక్ సేన్. మనసులో ఏదీ దాచుకోడు..  ముఖం మీదే అనేస్తాడు.. కాకాలుపట్టడం.. లాంటివి మనోడికస్సులు నచ్చదు ముక్కుసూటిగా ఉంటాడు కాబట్టే.. వివాదాలు వెతుక్కుంటూ వస్తుంటాయి. గతంలో కూడా అతనితో వివాదాలు రాగా.. అందులో ఆడియన్స్ విశ్వక్ కే సపోర్ట్ చేశారు. అయితే టాలీవుడ్ లో అందరు హీరోల కంటే ఇంకెక్కువ దూకుడుగా కనిపిస్తుంటాడు విశ్వక్‌ సేన్. 

అది సినిమాల్లోనైనా మరే ఇతర విషయాల్లోనైనా. సినిమాల విషయంలో ఎంత ప్యాషనేట్‌గా ఉంటాడో.. తన సినిమాల జోలికి వస్తే అంతే శివాలెత్తిపోతాడు. తాజాగా విశ్వక్ పెట్టిన పోస్ట్‌ దుమారం రేపుతుంది. తన కొత్త సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్‌ డేట్‌ను ఉద్దేశిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో తిట్ల వర్షం కురిపించాడు. ఛల్ మోహన్ రంగా ఫేమ్.. దర్శకుడు కృష్ణ చైతన్య తెరకెక్కించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో..  విశ్వక్ సరసన.. నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాలో అంజలీ కీలకపాత్ర పోషిస్తుంది. సితారా బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.

ఇక విశ్వక్ పోస్ట్ లో ఏమన్నాడంటే.. బ్యాక్ గ్రౌండ్ లేకపోతే ప్రతీ నా కొడుకు మన గేమ్ మారుద్దాం అనుకుంటాడు. నేను సినిమా చూడకుండా ప్రతీ ఫ్రేమ్ ప్రాణం పెట్టి పని చేసి చెబుతున్నా.. అన్నారు. అంతే కాదు ఈ  డిసెంబర్ 8న వస్తున్నాం. హిట్, ఫ్లాప్, సూపర్ హిట్, అట్టర్ ఫ్లాప్ చేస్తారన్నది మీ ఇష్టం. మీ నిర్ణయం. ఆవేశానికి లేదా ఈగోకి తీసుకునే నిర్ణయం కాదు. తగ్గే కొద్దీ మింగుతారు అని అర్థమైంది. డిసెంబర్ 8న శివాలెత్తిపోద్ది.గంగమ్మ తల్లి కి నా ఒట్టు. మహా కాళి మాతో ఉంది. డిసెంబర్‌లో సినిమా రాకపోతే.. నేను ప్రమోషన్స్‌లో కనిపించను అంటూ ఆగ్రహం తో ఊగిపోయారు విశ్వక్. 

అయితే ఏమనుకున్నారో ఏమో కాని.. ఈ  పోస్ట్‌ పెట్టిన కొద్ది సేపటికే విశ్వక్‌ ఆ పోస్ట్‌ను డిలీట్ చేశాడు. ఇక ముందుగా ఈ సినిమా రిలీజ్‌ను డిసెంబర్‌ 8కి అనుకున్నారు. అయితే పోటీగా హాయ్‌ నాన్న, ఎక్స్‌ట్రార్డినరీ సినిమాలు కూడా ఒకరోజు అటు ఇటు రిలీజ్ కు రెడీ అయ్యాయి. అయితే గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి సినిమా రిలీజ్‌ డేట్‌ను మార్చాలని మేకర్స్ ప్లాన్‌లో ఉన్నరని తెలుస్తోంది. ఈ విషయాన్నిఉద్దేశించి విశ్వక్‌ అలా మాట్లాడాడా.. లేకుంటే.. ఇంకేదైనా కారణం ఉందా అని అంతా ఆలోచనలో పడ్డారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios