Asianet News TeluguAsianet News Telugu

షకలక శంకర్‌ని అడ్డుకున్న పోలీసులు.. దానికి అనుమతి కావాల్సిందే!

జయవాడలోని బెంజ్‌ సర్కిల్‌లో విరాళాలు సేకరిస్తున్న నటుడు షకలక శంకర్ని పోలీసులు అడ్డుకున్నారు. కోవిడ్‌ కారణంగా విరాళాలు సేకరించవద్దని తెలిపారు. 

vijayawada police intercepting shakalaka   shankar
Author
Hyderabad, First Published Oct 6, 2020, 3:02 PM IST

హాస్య నటుడు షకలక శంకర్‌ ఇటీవల కరోనా బాధితులను ఆదుకునేందుకు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికే ఆయన విరాళాలు సేకరించి కొంత మందికి సహాయం చేశారు. అందులో భాగంగా ఆయన విజయవాడలోనూ విరాళాల కోసం వెళ్ళారు. 

విజయవాడలోని బెంజ్‌ సర్కిల్‌లో విరాళాలు సేకరిస్తున్న నటుడు షకలక శంకర్ని పోలీసులు అడ్డుకున్నారు. కోవిడ్‌ కారణంగా విరాళాలు సేకరించవద్దని తెలిపారు. అనుమతి లేకుండా విరాళాలు సేకరిస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీంతో శంకర్ అసహనం వ్యక్తం చేశారు. తాను చేస్తున్న సేవా కార్యక్రమాలకు అడ్డుతగలడంతో ఆయన ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. 

కరోనా కారణంగా చాలా మంది ఉపాది కోల్పోయారని, వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో తాను కరీంనగర్‌లో విరాళాలు సేకరించి బాధితులకు అందజేశామ‌ని పేర్కొన్నారు. ఇంట్లో పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబాలని ఆదుకునే ఉద్దేశంతోనే ఈ విరాళాలు సేకరణ అని శంక‌ర్ అన్నారు. విరాళాల కోసం ప్ర‌త్యేకంగా ఒక చోటుని నిర్ణ‌యించుకోలేద‌ని, ఎక్కడ విరాళాలు సేకరణ చేయాలనిపిస్తే అక్కడికి వెళ్లి పోతానని, అందుకే  విజయవాడ వచ్చానని తెలిపారు. తమని అడ్డుకోవద్దన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios