హైదరాబాద్ టైమ్స్ లేటెస్ట్ గా ప్రకటించిన 2018 ర్యాంకింగ్స్ లో క్రేజీ యంగ్ హీరో విజయ్ దేవర కొండ, మహేష్, ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ల కంటే ఎక్కువ ర్యాంక్ తెచ్చుకోవడమే కాకుండా మోస్ట్ డిజైరబుల్ 2017 ర్యాంకింగ్స్ లో రెండవ స్థానం దక్కించుకోవడం సంచలనంగా మారింది. అయితే ఈ ర్యాంకింగ్స్ లో హైదరాబాద్ కు చెందిన బషీర్ ఆలీ మొదటి స్థానం పొందాడు. ఎమ్ టివి నిర్వహించే రోడీస్ స్ప్లిట్స్ విల్లా కార్యక్రమాల ద్వారా బషీర్ ఆలీ అందరికీ పరిచయం ఉన్న సెలెబ్రెటీ.

 

ఇక ఈ ర్యాంకింగ్స్ లో ‘బాహుబలి’ తో నేషనల్ సెలెబ్రెటీగా మారిన ప్రభాస్ కు మూడవ స్థానం లబిస్తే ప్రిన్స్ మహేష్, రామ్ చరణ్ లు 4-5 స్థానాలతో సరిపెట్టుకున్నారు. ఆ తరువాత స్థానాలలో అల్లు అర్జున్, రానా, ఎన్టీఆర్, నాని, రామ్, నాగచైతన్య, అఖిల్ లు ఉన్నారు. వీరితో పాటుగా ఈలిస్టులో మంత్రి కేటిఆర్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యా నాదెండ్ల ఉండటం వీరిద్దరికీ ఉన్న క్రేజ్ ను సూచిస్తోంది.

 

 

ఈ ర్యాంకింగ్స్ లో 100 కోట్ల కలక్షన్స్ తెచ్చుకోగల స్టామినా ఉన్న మహేష్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ రామ్ చరణ్ లు తక్కువ ర్యాంకింగ్స్ లో ఉంటే కనీసం ఇప్పటి వరకు 50 కోట్ల కలక్షన్స్ మార్క్ ను అందుకొని విజయ్ దేవర కొండ టాప్ హీరోల ర్యాంకింగ్స్ కు చెక్ పెట్టి రెండవ స్థానంలో నిలవడం అందర్నీ ఆశ్చర్య పరిచే విషయం.

 

 

హైదరాబాద్ టైమ్స్ ప్రకటించే ర్యాంక్ ల విషయంలో సంచలనాలు ఉండటం సర్వసాధారణ విషయమే అయినా టాప్ యంగ్ హీరోల ఇమేజ్ ని షాక్ ఇస్తున్న ఈ ర్యాకింగ్స్ పై ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో అనేక ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. విజయ్ దేవర కొండకు మాత్రం ఈ ర్యాంకింగ్ రిజల్ట్ పూర్తి జోష్ ను ఇస్తాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు..