- Home
- Entertainment
- Nayanthara: 14 కోట్లు వసూలు చేసిన నయనతార, లేడీ సూపర్ స్టార్ హాయ్ సినిమాకు రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసా?
Nayanthara: 14 కోట్లు వసూలు చేసిన నయనతార, లేడీ సూపర్ స్టార్ హాయ్ సినిమాకు రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసా?
Nayanthara: నయనతార తనకంటే చిన్నవాడైన కవిన్ జంటగా నటించిన సినిమా 'హాయ్'. ఈమూవీకి మిశ్రమ స్పందన వస్తోంది. ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూలు చేసిందంటే..

నయనతార హాయ్ సినిమా కలెక్షన్లు..
లేడీ సూపర్ స్టార్ నయనతార తాజాగా నటించిన సినిమా 'హాయ్'. ఈ సినిమాలో కవిన్ హీరోగా చేశాడు. ప్రముఖ తమిళ గేయ రచయిత విష్ణు ఇడవన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆగస్టు 28న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే, నయనతార, కవిన్‌ల నటన సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అని టాక్. ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 14 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
నయనతార పోస్టర్ వైరల్..
'హాయ్' ఒక రొమాంటిక్ సినిమా. ఈ చిత్రానికి జెన్ మార్టిన్ సంగీతం అందించగా, రాజేష్ శుక్లా సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూసుకున్నారు. ఫిలోమిన్ రాజ్ ఎడిటర్‌గా, బి శేఖర్ ఆర్ట్ డైరెక్టర్‌గా, దినేష్ కాశీ స్టంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు.ఇదిలా ఉంటే, నయనతార హీరోయిన్‌గా నటించిన మరో సినిమా 'మన్నన్‌కట్టి సిన్స్ 1960' షూటింగ్ కూడా పూర్తయింది.
ఈ సినిమా సెట్ నుంచి నయన్ కెమెరా లెన్స్‌లోంచి చూస్తున్న ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది అభిమానుల్లో క్యూరియాసిటీని పెంచింది. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై డ్యూడ్ విక్కీ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో గౌరీ కిషన్, దేవదర్శిని, నరేంద్ర తదితరులు నయన్‌తో పాటు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
నయన్ కు కలిసి రాని కన్నడ సినిమా..
నయనతార నటించిన మరో సినిమా 'టాక్సిక్' కూడా ఇటీవలే విడుదలైంది. ఇందులో కన్నడ స్టార్ యష్ హీరో. గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 26న థియేటర్లలోకి వచ్చింది. ఇందులో నయనతార 'గంగ' అనే పాత్రలో కనిపించింది. యష్, గీతు మోహన్‌దాస్ కలిసి ఈ సినిమాకు కథ అందించారు. 'టాక్సిక్' సినిమాను కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి షూట్ చేశారు. హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లోనూ రిలీజ్ చేశారు. ఈ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఓపెనింగ్స్ అద్భుతం అనిపించినా.. ఆతరువాత ఈమూవీ కలెక్షన్లు పడిపోయాయి.
