Asianet News TeluguAsianet News Telugu

బాలీవుడ్ సూపర్ హిట్ రీమేక్ లో విజయ్ దేవరకొండ

ర‌ణ‌వీర్ సింగ్‌, అలియా భ‌ట్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన చిత్రం గ‌ల్లీబాయ్. జోయా అక్త‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 14న విడుద‌ల అయి మంచి విజ‌యం సాధించింది. ఈ చిత్రానికి ఇండియ‌న్ క్రిటిక్స్, ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం జ‌ర్న‌లిస్ట్స్ నుండి కూడా ప్ర‌శంస‌లు ల‌భించాయి. 

Vijay Devarakonda In 'Gully Boy' Telugu Remake?
Author
Hyderabad, First Published Apr 14, 2019, 6:48 PM IST

ర‌ణ‌వీర్ సింగ్‌, అలియా భ‌ట్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన చిత్రం గ‌ల్లీబాయ్. జోయా అక్త‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 14న విడుద‌ల అయి మంచి విజ‌యం సాధించింది. ఈ చిత్రానికి ఇండియ‌న్ క్రిటిక్స్, ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం జ‌ర్న‌లిస్ట్స్ నుండి కూడా ప్ర‌శంస‌లు ల‌భించాయి. 

ముంబై మురికి వాడల్లో పెరిగిన ఓ యువకుడు.. ఇండియాలోనే టాప్ ర్యాపర్‌గా ఎదిగిన తీరును ఈ మూవీలో చూపించారు. మేరీ గల్లీ, రూట్స్‌లాంటి హిట్ ర్యాప్ సాంగ్స్ సృష్టికర్త అయిన ఇండియన్ ర్యాపర్ డివైన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రూ.230 కోట్లు రాబట్టినట్లు విశ్లేషకులు అంచనా వేశారు.

అయితే ఈ మూవీని రీమేక్ చేయాల‌ని చాలా మంది యంగ్ హీరోలు ఉత్సాహపడ్డారు. ఆ అవకాసం ఇప్పుడు విజయ్ దేవరకొండకు వచ్చిందని సమాచారం.   మొదట ఇందులో సాయిధరమ్ తేజ్‌ నటించే అవకాశాలు ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు విజయ్‌ను హీరోగా అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నిర్మాతలు విజయ్‌తో సంప్రదింపులు జరిపినట్లు చెబుతున్నారు. ఈ మేరకు మీడియాలో ప్రచారం జరుగుతోంది.

విజయ్‌ ప్రస్తుతం ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. రష్మిక  హీరోయిన్ . భరత్‌ కమ్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. విజయ్‌ ప్రస్తుతం క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుండగా.. శివ నిర్వాణతోనూ ఓ మూవీ ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.  

Follow Us:
Download App:
  • android
  • ios