Asianet News TeluguAsianet News Telugu

ప్రేమ గొప్పదా? భయం గొప్పదా?.. కలర్‌ఫోటో అదిరిందన్న విజయ్‌ దేవరకొండ

సుహాన్‌ హీరోగా, ఛాందిని చౌదరి కథనాయికగా, సందీప్‌ రాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌ని బుధవారం విడుదల చేశారు. క్రేజీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ, `బాగా చేశారు. ఈ కుర్రాళ్ళు తమ కలలను సాకారం చేసుకోవడం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. టీజర్‌ చాలా బాగుంది. టీమ్‌కి అభినందనలు` అని పేర్కొన్నారు. 

vijay devarakonda has released a colour photo movie teaser
Author
Hyderabad, First Published Aug 5, 2020, 6:19 PM IST

`నాలాంటి నల్లగున్న అబ్బాయి.. మీలాంటి అందమైన అమ్మాయిని ప్రేమిస్తే ఫ్రెండ్స్ కామెంట్‌ చేస్తారు. ఒకడేమో బ్లాక్‌ అండ్‌ వైట్‌ అని, మరొకడేమో ఆశకు హద్దు ఉండాలని అంటారు` అని అంటున్నారు నటుడు సుహాన్‌. `అబ్బాయిలు అమ్మాయిల విషయంలో సెలక్షన్‌ బాగుంటుంది, కానీ ప్రేమిండమే రాదు.. కానీ అమ్మాయిలకు సెలక్షన్‌ రాదు, కానీ బాగా ప్రేమిస్తారు` అని అంటున్నాడు హస్యనటుడు వైవా హర్ష. 

`నువ్వు ప్రేమించిన అమ్మయి చనిపోయింది. శవం వద్ద కూర్చొని ఏడుస్తున్నారు. అక్కడికో పులి వచ్చింది. ఏం చేస్తారు?` అని సునిల్‌ ప్రశ్నించగా, పారిపోతామని సుహాన్‌ అంటున్నాడు, `ఇప్పుడు చెప్పు ప్రేమ గొప్పదా? భయం గొప్పదా?` అని అడుగుతున్నాడు సునీల్‌. ఇదంతా `కలర్‌ ఫోటో` చిత్ర టీజర్‌లోని డైలాగులు. తాజాగా విడుదలైన ఈ టీజర్‌ విశేషంగా ఆకట్టుకుంటుంది. స్వచ్ఛమైన ప్రేమకి కలర్‌ అడ్డుకాదని చెప్పేలా, ఆద్యంతం కామెడీ, ఎమోషనల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతుందని టీజర్‌ చూస్తే అర్థమవుతుంది. 

`మజిలీ` ఫేమ్‌ సుహాన్‌ హీరోగా, ఛాందిని చౌదరి కథనాయికగా, సందీప్‌ రాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌ని బుధవారం విడుదల చేశారు. క్రేజీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ, `బాగా చేశారు. ఈ కుర్రాళ్ళు తమ కలలను సాకారం చేసుకోవడం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. టీజర్‌ చాలా బాగుంది. టీమ్‌కి అభినందనలు` అని పేర్కొన్నారు. 

 `హృదయ కాలేయం`, `కొబ్బరి మట్ట` లాంటి స్పూఫ్ తో బ్లాక్ బాస్టర్స్ కొట్టిన అమృత ప్రొడక్షన్స్ నుంచి కలర్ ఫోటో అనే చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. `మజిలీ`, `డియర్ కామ్రేడ్`, `ప్రతిరోజు పండగే` వంటి చిత్రాల్లో తనదైన కామెడీతో ఆకట్టుకున్న సుహాస్ కలర్ ఫోటో సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. తెలుగమ్మాయి  చాందిని చౌదరీ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రముఖ నటుడు సునీల్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. యూట్యూబ్ లో పాపులర్ అయ్యిన సందీప్ రాజ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి అబ్బాయి కాల భైరవ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios