MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Vijay Devarakonda - Rashmika: విజయ్, రష్మికల నగల ధర ఎంతో తెలుసా.? ఏకంగా మూడు విల్లాస్ కొనొచ్చు..

Vijay Devarakonda - Rashmika: విజయ్, రష్మికల నగల ధర ఎంతో తెలుసా.? ఏకంగా మూడు విల్లాస్ కొనొచ్చు..

Vijay Devarakonda - Rashmika: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాల వివాహం ఫిబ్రవరి 26న అట్టహాసంగా జరిగింది. ఈ పెళ్లిలో వీరు ధరించిన ప్రత్యేకమైన బంగారు ఆభరణాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. పది నెలల పాటు శ్రమించి చేయించిన ఈ నగల.. 

2 Min read
Author : Pavithra D
Published : Mar 04 2026, 10:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్..
Image Credit : Vijay Devarakonda - Rashmika\Instagram

టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్..

టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఎట్టకేలకు ఫిబ్రవరి 26న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత తమ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే, ఈ పెళ్లి వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం వారు ధరించిన అద్భుతమైన బంగారు ఆభరణాలు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పెళ్లిళ్లలో సింపుల్‌గా..
Image Credit : Virosh\Twitter

పెళ్లిళ్లలో సింపుల్‌గా..

సాధారణంగా సెలబ్రిటీలు పెళ్లిళ్లలో సింపుల్‌గా ఉండటానికి మొగ్గు చూపుతారు. కానీ విజయ్, రష్మిక మాత్రం సాంప్రదాయబద్ధంగా ఒంటినిండా బంగారు ఆభరణాలతో మెరిసిపోయారు.

35
పది నెలల శ్రమ:
Image Credit : Youtube/ T Series

పది నెలల శ్రమ:

ఈ ఆభరణాలు మార్కెట్లో దొరికే సాధారణ డిజైన్లు కావు. వివాహం కోసమే ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి తయారు చేయించినట్లు సమాచారం. హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ నగల దుకాణానికి చెందిన నిపుణులు ఈ నగల తయారీ కోసం దాదాపు 10 నెలల పాటు శ్రమించారట. కేవలం డిజైన్ల ఎంపికకే కొన్ని నెలల సమయం పట్టిందని తెలుస్తోంది. విజయ్, రష్మికలకు అచ్చంగా సరిపోయేలా ఈ ఆభరణాలను తీర్చిదిద్దారు.

45
నగల ప్రత్యేకతలు:
Image Credit : Instagram

నగల ప్రత్యేకతలు:

విజయ్ దేవరకొండ తన మెడలో, చేతులకు ధరించిన ఆభరణాలపై ఏనుగులు, పులులు వంటి జంతువుల రూపాలను పొందుపరిచారు. అంతేకాకుండా కాళ్లకు కడాలు ధరించి మగవారి ఆభరణాల శైలిలో సరికొత్త ట్రెండ్ సెట్ చేశారు. ఇక రష్మిక విషయానికి వస్తే, ఆమె ధరించిన 11 రకాల ఆభరణాలు భారతీయ ఆలయ శిల్పకళను ప్రతిబింబించేలా ఉన్నాయి. ప్రతి నగ కూడా ఒక కళాఖండంలా ఉందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

55
ఖర్చు ఎంతంటే?
Image Credit : instagram

ఖర్చు ఎంతంటే?

విశ్వసనీయ సమాచారం ప్రకారం, కేవలం ఈ పెళ్లి నగల కోసమే ఈ జంట రూ. 4 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. తమ జీవితంలో అత్యంత కీలకమైన ఈ వేడుక కోసం వారు ఎక్కడా రాజీ పడకుండా ప్రతిదీ ఎంతో ప్రత్యేకంగా ప్లాన్ చేసుకున్నారు. పెళ్లి ఫోటోలు వైరల్ అయిన తర్వాత, ఇప్పుడు వారు ధరించిన ఈ ఖరీదైన ఆభరణాలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. మొత్తానికి, 'విరోష్' జంట తమ వివాహం ద్వారా కేవలం ప్రేమలోనే కాదు, సాంప్రదాయ ఆభరణాల ఎంపికలో కూడా తమ ప్రత్యేకతను చాటుకున్నారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వినోదం
తెలుగు సినిమా
విజయ్ దేవరకొండ
రష్మిక మందన్న
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajendra Prasad: నటకిరీటి బిరుదు వెనుక స్టోరీ రివీల్‌ చేసిన రాజేంద్రప్రసాద్‌.. `పిఠాపురంలో` ఎలా ఉంటుందంటే?
Recommended image2
Allari Naresh: అల్లరి నరేష్ ఇంత పెద్ద సూపర్ హిట్స్ రిజెక్ట్ చేశాడా.. ఆ ఇద్దరు హీరోల పంట పండింది
Recommended image3
Irumudi: ఇరుముడి బ్లాక్ బస్టర్ హిట్.. చిరంజీవి, రాంచరణ్ ని కలిసిన రవితేజ
Related Stories
Recommended image1
వెంకటేష్ వద్దన్నాడు.. బాలయ్య సై అన్నాడు.. కట్ చేస్తే.. ఇండస్ట్రీ హిట్.. ఆ సినిమా ఏదంటే
Recommended image2
సూర్య సింగం మూవీ విలన్ గుర్తున్నాడా.? ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా.. చూస్తే ఆశ్చర్యపోతారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved