ఫైనల్ గా అరవింద సమేత 100 కోట్ల గ్రాస్ ను అందుకొని చిత్ర యూనిట్ లో సంతోషాన్ని నింపింది. ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఈ సినిమా నిలిచింది. ఇక ఈ రోజు సక్సెస్ మీట్ నిర్వహించిన చిత్ర యూనిట్ వారి సంతోషాన్ని పంచుకున్నారు. త్రివిక్రమ్ మాట్లాడిన విధానం అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. 

ఈ సినిమా స్టార్ట్ చేయడానికి పూర్తి చేయడానికి నాలుగు రోజుల్లో 100 కోట్లు దాటించడానికి ముఖ్య కారణం నందమూరి తారక రామారావుగారని త్రివిక్రమ్ ప్రధానంగా తెలిపారు. అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ ని సీనియర్ ఎన్టీఆర్ తో పోల్చడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తనకు ఇష్టమైన సీనియర్ ఎన్టీఆర్ తో అంత ఈజీగా ఎవరిని పోల్చలేనని ఎందుకంటే అది తన స్వార్ధమని చెబుతూ.. తారక్ కు అయన పేరు నిలబెట్టడమే కాకుండా సమానంగా నిలిచే వ్యక్తి అని గట్టిగా చెప్పగలనని అన్నారు. 

ఇక సినిమా కోసం తారక్ కష్టపడినా విధానం గురించి వివరిస్తూ ఇది తమకి ఏఒక్క ఎమోషనల్ జర్నీ అని అన్నారు. ఎందుకంటే ఒక పరాజయం తరువాత నేను మొదలుపెట్టిన సినిమా. ఆయనకు ఇది ఒక విషాదం తరువాత రిలీజైన సినిమా వీటన్నిటిని దాటుకొని ఒక వెల్లువలా వచ్చి.. ఒక సంతోషకరమైన పండగను మా ఇళ్లల్లోకి కి కూడా తీసుకువచ్చిన అందరికి పాదాభివందనాలు అని త్రివిక్రమ్ తనదైన శైలిలో వివరించాడు.

సంబంధిత వార్తలు

అరవింద సమేత శాటిలైట్ రైట్స్.. తారక్ కెరీర్ లోనే బెస్ట్ డీల్!

త్రివిక్రమ్ నా బావ.. నా భార్యకు అన్న: ఎన్టీఆర్

అరవింద సమేత: ఫస్ట్ డే కలెక్షన్స్..తారక్ కుమ్మేశాడు!

అరవింద సమేత: యూఎస్ లో న్యూ రికార్డ్!

అభినయ సమేత...('అరవింద సమేత' రివ్యూ)

తారక్ తగ్గట్లేదుగా.. యూఎస్ లో రికార్డ్ కలెక్షన్స్!

యూఎస్ ప్రీమియర్ షో టాక్: అరవింద సమేత

ట్విట్టర్ రివ్యూ: అరవింద సమేత

'అరవింద సమేత' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..!

అరవింద సమేత కోసం స్పెషల్ హాలిడే ఇచ్చేశారు!

‘అరవింద సమేత’విడుదల.. టీడీపీ, వైసీపీ గొడవ