సారాంశం
కత్తి పాట్టి సాముచేస్తున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ్. సముద్రం ఒడ్డున ప్రశాంత వాతావరణంలో నిఖిల్ చేస్తున్న ఈ ప్రాక్టీస్ కు కారణం ఏంటీ..?
టాలీవుడ్ కుర్ర హీరోల్లో కాస్త డిఫరెంట్‌గా సినిమాలు చేస్తున్నది నిఖిల్ అనే చెప్పాలి. కథా బలం తో పాటు.. హీరో క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ గా ఉన్నసినిమాలు చేస్తూ.. తనకంటూ ఓ ప్రత్యేకమైన ఆరాను ఏర్పరుచుకుంటున్నాడు నిఖిల్. ఈప్రయత్నంలో ప్లాప్ లు వచ్చినా పట్టించుకోకుండా.. తన లక్ష్యం సాధనదిశగా సాగుతున్నాడు. నిఖిల్ సినిమాలు.. ఆయన స్టోరీ సెలక్షన్స్ చూస్తుంటే.. పెద్ద పెద్ద స్టార్‌లు సైతం నిఖిల్ స్క్రిప్ట్ సెలక్షన్ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే కార్తికేయ-2తో పాన్ ఇండియా లెవల్లో సాలిడ్ గా మార్కెట్ పెంచుకున్న నిఖిల్.. అలాంటి వెరైటీ సినిమాలు మరో రెండు లైన్ లో పెట్టాడు యంగ్ స్టార్.
ఇలానే సినిమాలు చేస్తూ.. ఇంకో రెండు హిట్లు పడితే స్టార్ హీరోల సరసన నిఖిల్ సిద్దార్ధ్ చేరడం ఖాయం అంటున్నారు సినిమా పండితులు. మొన్నటికి మొన్న డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న స్పై సైతం భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. ఫైనల్ రన్‌లోనూ ఈ సినిమా పెద్దగా నష్టాలు తెచ్చిపెట్టలేదు. ఇక ప్రస్తుతం నిఖిల్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్నవే. అందులో స్వయంభు ఒకటి. తమిళంలో పలు సినిమాలు రైటర్‌గా పని చేసిన భరత్ కృష్ణమాచారి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
స్వయంభూ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమా టైటిల్ తోనే సగం మార్కులు కొట్టేశాడు నిఖిల్. మరిసినిమా విషయంలో కూడా ఇలానే ఇప్రెస్ క్రియేట్ చేస్తాడా లేదా అని అంతా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లకు ఊహించని రేంజ్‌లో రెస్పాన్స్ వచ్చింది. యుద్ద వీరుడి గెటప్‌లో ఉన్న నిఖిల్‌ను చూసి ఫిదా అవని సినీ ప్రేక్షకుడు లేడు. ఇక ఈ సినిమా కోసం నిఖిల్ కత్తి సాము నేర్చుకుంటున్నాడు.
కత్తిసాము నేర్చుకుని .. ప్రాక్టీస్ చేయడం కోసం.. ఆయన వియత్నాంం వెళ్ళాడు. .. అక్కడి సముద్ర తీరంలో నిఖిల్ కత్తిసాము ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రొఫెషనల్‌లా కత్తి తిప్పుతున్న నిఖిల్ డెడికేషన్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. టాలీవుడ్ లక్కి గర్ల్ సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను భువన్ , శ్రీకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ పీరియాడిక్ డ్రామా సినిమాకు రవిబస్రూర్, రామకృష్ణ పరమహంస వంటి స్టార్ టెక్నిషన్‌లు పనిచేస్తున్నారు.