Asianet News TeluguAsianet News Telugu

#MixUp:'ఆహా' నుంచి మరీ బోల్డ్ కంటెంట్..? టీజర్‌లోనే ఇంతుందంటే..

 జంటల్లో ఒకరికి శృంగారం అంటే ఎక్కువ ఇంట్రస్ట్ ఉంటుంది. కానీ, రెండో వారికి మాత్రం శృంగారం అంటే అంత గా ఉండదు. ప్రేమనే ఎక్కువ కోరుకుంటారు.

Telugu OTT Aha Original MixUp movie Teaser released
Author
First Published Feb 26, 2024, 4:11 PM IST


మిగతా ఓటిటి సంస్దలు అడల్ట్ కంటెంట్ తో  రెచ్చిపోతున్నా...ఆహా మాత్రం మొదటి నుంచి కాస్తంత పద్దతిగానే ఉంది. అయితే నెట్ ప్లిక్స్, అమేజాన్ వంటి సంస్దలు సైతం ఈ రూట్ లోకి వచ్చేస్తూండటంతో ...ఆహా కూడా తను కూడా ఆహా అనిపించకపోతే అలుసైపోతానని భావించినట్లుంది.  ఓ బోల్డ్ మూవీ ని త్వ‌ర‌లో తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తోంది ఆహా.  మిక్స‌ప్ టైటిల్ తో తెర‌కెక్కుతోన్న ఈ మూవీ టీజ‌ర్‌ను గురువారం ఆహా ఓటీటీ రిలీజ్ చేసింది. మిక్స‌ప్‌లో అక్ష‌ర గౌడ‌, ఆద‌ర్శ్ బాల‌కృష్ణ‌న్‌, క‌మ‌ల్ కామ‌రాజు, పూజా జ‌వేరి కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఆహా ఒరిజినల్ ఫిల్మ్ మిక్సప్ ఇప్పుడు అంతటా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది.  తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయడంతో నెక్ట్స్ లెవిల్ కు  చేరింది. దీనిని టాలీవుడ్ లస్ట్ స్టోరీ అంటున్నారు.

ఈ టీజర్ ని చూస్తే మనకు ఇందులో ఉన్న విషయమేంటో అర్దమవుతుంది. ఇందులో ఇద్దరు కపుల్స్ ఉంటారు. ఆ జంటల్లో ఒకరికి శృంగారం అంటే ఎక్కువ ఇంట్రస్ట్ ఉంటుంది. కానీ, రెండో వారికి మాత్రం శృంగారం అంటే అంత గా ఉండదు. ప్రేమనే ఎక్కువ కోరుకుంటారు. ఇలా రెండు జంటల్లో ఒక భార్య, ఒక భర్త ఒకే రకమైన శృంగార ఆసక్తి కలిగిన వాళ్లు ఒక్కటైతే? ఇలా నలుగురిలో ఒకే ఐడియాలజీ, ఆలోచనలు, కోరికలు కలిగిన వాళ్లను కలుసుకుంటే ఎలా ఉంటుంది అనేదే మిగిలిన కథ. కామవాంఛ.. ప్రేమపై విజయం సాధిస్తుందా? అనేదే ఇందులో స్టోరీ లైన్ అని అర్దమవుతోంది. పైగా శృంగార జీవితం, భార్య-భర్త రిలేషన్, ఫాంటసీస్, డిజైర్స్ ఇలా చాలానే  టచ్ చేశారు. మీరూ ఓ లుక్కేయండి.

ఈ సినిమాలో ఉన్న  డ‌బుల్ మీనింగ్ డైలాగ్స్‌, ఇంటిమేట్ సీన్స్‌తో యూత్‌ను అట్రాక్ట్ చేసేలా ఈ టీజ‌ర్‌ను క‌ట్ చేశారు. నాకు మూడ్ రావాలంటే ఎక్సైట్‌మెంట్ కావాలి. ఎంట‌ర్‌టైన్‌మెంట్ కావాలి అనే డైలాగ్‌తోనే టీజ‌ర్ ప్రారంభ‌మైంది. దేవుడు మ‌నుషుల‌కు చేతులు ఎందుకు ఇచ్చాడో ఇప్పుడు అర్థ‌మైంది అంటూ ఆద‌ర్శ్ బాల‌కృష్ణ డైలాగ్‌తో ఎండ్ చేశారు. ఈ టీజ‌ర్‌లో అక్ష‌ర గౌడ్ , పూజా జ‌వేరి క్యారెక్ట‌ర్  రొమాంటిక్‌గా సాగింది. మిక్స‌ప్‌ టీజ‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఆదర్శ్, అక్షర గౌడ, కమల్, పూజ జె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆకాష్ బిక్కి డైరెక్ట్ చేస్తున్నారు. లవ్ అండ్ లస్ట్ నేపథ్యంతో హైమ వర్షిణి ఈ చిత్రానికి కథని అందించారు.  మార్చి 15న ఈ సినిమాని ఆహాలో రిలీజ్ చేయనున్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios