అక్కనే డామినేట్ చేస్తున్న అందాలు... ఈమె ఎవరో తెలుసా..

First Published 10, Mar 2018, 2:45 PM IST
Tapsee planning to introduce her sister in a big way
Highlights
  • సొట్ట బుగ్గల సుందరిగా పాపులర్ అయిన తాప్సి టాలీవడ్ లో పలు చిత్రాల్లో నటించింది
  • చిత్ర పరిశ్రమల్లో తన పాపులారిటీతో తన సోదరి షాగున్ ని హీరోయిన్ గా పరిచయం చేసేందుకు ప్రయత్నాలు ​
  • షాగున్  సినిమాల్లోకి రాకముందు నుంచే సోషల్ మీడియాలో కుర్రకారుని ఉడికించే ప్రయత్నం చేస్తోంది

Image result for tapsee sister hot

సొట్ట బుగ్గల సుందరిగా పాపులర్ అయిన తాప్సి టాలీవడ్ లో పలు చిత్రాల్లో నటించింది. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఝుమ్మందినాదం చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. మొదట్లో తాప్సి క్యూట్ లుక్స్ అందరిని ఆకర్షించాయి. నటిగా కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఆ తరువాత విజయాలు లేకపోవడం, విమర్శలు రావడంతో బాలీవుడ్ బాట పట్టింది. వరుస హిట్లతో తాప్సి బాలీవుడ్ లో మంచి జోష్ లో ఉంది. చిత్ర పరిశ్రమల్లో తన పాపులారిటీతో తన సోదరి షాగున్ ని హీరోయిన్ గా పరిచయం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందనేది లేటెస్ట్ టాక్.తాప్సి తన చెల్లెలు షాగున్ ని వెండి తెరకు పరిచయం చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. తనకు పరిచయం ఉన్న టాలీవుడ్, బాలీవుడ్ దర్శక నిర్మాతలతో షాగున్ విషయాన్ని ప్రస్తావిస్తోందట. వీలైనంత త్వరగా తన సోదరిని సినిమాల్లోకి తీసుకురావడానికి తాప్సి ప్రయత్నాలు మొదలుపెట్టిందట.

తాను సినిమా అవకాశం పొందడానికి చాలా కష్టపడవలసి వచ్చిందని తాప్సి చెబుతుంటుంది. సినిమాల్లో నిలదొక్కుకోవడానికి కూడా చాలా కష్టపడ్డానని తాప్సి తెలిపింది. అందంగా లేనని విమర్శలు సైతం ఎదుర్కొంది. అలాంటి పరిస్థితి తన సోదరికి రాకూడదని, మంచి చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యేలా సోదరికోసం ప్రయత్నాలు చేస్తోందట.


తాప్సి సినిమాల్లోకి వచ్చిన మొదట్లో గ్లామర్ విషయంలో హద్దులు పాటించింది. కానీ షాగున్ మాత్రం సినిమాల్లోకి రాకముందు నుంచే సోషల్ మీడియాలో కుర్రకారుని ఉడికించే ప్రయత్నం చేస్తోంది. సోషల్ మీడియాలో షాగున్ పోస్ట్ చేసే పిక్స్ చూస్తే కుర్రకారు మతి పోవలసిందే.

loader