Asianet News TeluguAsianet News Telugu

అసభ్యకరమైన డ్రెస్, దానిపై లక్ష్మీ దేవి ఆభరణం.. నెటిజన్లకు దొరికిపోయిన తాప్సి, దారుణంగా ట్రోలింగ్

సొట్టబుగ్గల సుందరి తాప్సి సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ దక్కించుకుంది. ఝుమ్మంది నాదం చిత్రంతో హీరోయిన్ గా తాప్సి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కొంతకాలం తెలుగులో వరుసగా చిత్రాలు చేసిన తాప్సి ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టింది.

Taapsee gets trolled for wearing  Goddess Lakshmi Necklace like this way
Author
First Published Mar 22, 2023, 11:12 AM IST

సొట్టబుగ్గల సుందరి తాప్సి సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ దక్కించుకుంది. ఝుమ్మంది నాదం చిత్రంతో హీరోయిన్ గా తాప్సి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కొంతకాలం తెలుగులో వరుసగా చిత్రాలు చేసిన తాప్సి ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టింది. బాలీవుడ్ లో తాప్సి ప్రస్తుతం హీరోయిన్ ఓరియెంటెడ్, కథా బలం ఉన్న చిత్రాల్లో ఎక్కువగా నటిస్తోంది. 

Taapsee gets trolled for wearing  Goddess Lakshmi Necklace like this way

తాప్సి బాలీవుడ్ కి వెళ్ళాక మరింత బోల్డ్ గా మారిపోయింది. పలు ఇంటర్వ్యూలలో తాప్సి బోల్డ్ గా మాట్లాడడం చూస్తూనే ఉన్నాం. తాప్సి నటనకు ప్రాధాన్యత ఉన్న రోల్స్ నేచుకుంటూనే.. వీలు చిక్కినప్పుడల్లా గ్లామర్ తో అదరగొడుతోంది. గతంలో తాప్సి హద్దులోనే ఉంటూ అందాలు ఆరబోసేది. కానీ ప్రస్తుతం తాప్సి బాలీవుడ్ కి తగ్గట్లుగా హాట్ హాట్ డ్రెస్సుల్లో మెరుస్తోంది. 

రీసెంట్ గా తాప్సి లాక్మే ఫ్యాషన్ వీక్ లో పాల్గొంది. రెడ్ డ్రెస్ లో తాప్సి క్లీవేజ్ అందాలు డీప్ గా చూపిస్తూ  మైండ్ బ్లాక్ అయ్యే ఫోజులు ఇచ్చింది. ర్యాంప్ పై వయ్యారంగా వాక్ చేసింది. తాప్సి రెడ్ లాంగ్ డ్రెస్ ధరించినప్పటికీ క్లీవేజ్ వద్ద చాలా బోల్డ్ గా ఉంది. క్లీవేజ్ అందాలని కవర్ చేసేందుకు తాప్సి ఓ భారీ ఆభరణం ధరించింది. ఇప్పుడు ఇదే తాప్సిని చిక్కుల్లో పడేసింది. 

Taapsee gets trolled for wearing  Goddess Lakshmi Necklace like this way

నెటిజన్లు ఆమెని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే ఆమె ధరించిన ఆభరణంలో హిందువులు పవిత్రంగా కొలిచే లక్ష్మీదేవి బొమ్మ ఉంది. అసభ్యంగా కనిపిస్తున్న అందాలపై పవిత్రమైన లక్ష్మీ మాత ఆభరణం ధరించడం ఏంటి అంటూ నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఎప్పుడూ నిర్మొహమాటంగా మాట్లాడే తాప్సి ఇలాంటి విషయాల్లో ఎంతో బాధ్యతగా ఉండాలి అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios