ఫ్యాన్స్ తో గుడ్ న్యూస్ శేర్ చేసుకుంది బాలీవుడ్ బ్యూటీ స్వర భాస్కర్. తాను తల్లిని కాబోతున్నట్టు  ప్రకటించింది బ్యూటీ.    

బాలీవుడ్‌ లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ సాధించిన బ్యూటీ స్వర భాస్కర్. సోషల్ మీడియాలో ఎప్పుుడూ యాక్టీవ్ గా ఉందే ఈమె.. తాజాగా తన ఫ్యాన్స్ తో ఓ శుభవార్తను శేర్ చేసుకుంది. తాను తల్లి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె వెల్లడించింది. ఈ మేరకు ప్రెగ్నెన్సీ కన్ ఫార్మ్ అయిన తరువాత  భర్త ఫహాద్‌ అహ్మద్‌తో కలిసి సంతోషాన్ని పంచుకుంది బ్యూటీ. 

భర్తతో సంతోషాన్ని పంచుకుని.. తనతో  దిగిన ఫొటోలను స్వరభాస్కర్‌ ట్విటర్‌లో షేర్ చేసింది. అభిమానులతో ఈ విషయాన్ని శేర్ చేసుకుని సంతోషంలో ఉబ్బి తబ్బిబ్బు అయిపోయింది బ్యూటీ. ఇక ఈ  ఫొటోలతోపాటు సమ్‌ టైమ్స్‌ ఆల్‌ యువర్‌ ప్రేయర్స్ ఆర్‌ ఆన్సర్డ్‌ ఆల్‌ టుగెదర్‌..! బ్లెస్స్‌డ్, గ్రేట్‌ఫుల్‌, ఎక్జైటెడ్‌, ఆజ్‌ వుయ్‌ స్టెప్‌ ఇన్‌టు ఎ హోల్‌ న్యూ వరల్డ్‌’ అనే ట్యాగ్‌లైన్‌  కూడా ఇచ్చింది స్వార భాస్కర్. 

 

Scroll to load tweet…

ఈ ట్యాగ్‌లైన్‌తో పాటు మరో ట్యాగ్ కూడా ఇచ్చింది స్వర భాస్కర్. కమింగ్‌ సూన్‌, ఫ్యామిలీ, న్యూ అరైవల్‌, గ్రాట్యిటూడ్‌, అక్టోబర్‌ బేబీ అనే హ్యాష్‌ టాగ్‌లను కూడా స్వరభాస్కర్‌ తన ట్వీట్‌కు ఆడ్ చేసింది. ఇక బాలీవుడ్ బ్యూటీ చేసిన ఈ ట్వీట్‌  సోషల్‌మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇక స్వర ఫ్యాన్స్ ఆ విషయంలో రకరకాలుగా స్పందిస్తున్నారు. నెటిజన్‌ల నుంచి వరుస  కామెంట్లు  వస్తున్నారు. 

చాలా మంది ఈజంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అటు బాలీవుడ్ నుంచి కూడా కొంతమంది సెలబ్రీటిలు వారిని విష్ చేసినట్టు తెలుస్తోంది. ఇక  స్వర భాస్కర్‌, ఫహాద్‌ అహ్మద్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. అంతలోనే ఈ ఏడాదిలోనే తల్లి కూడా కాబోతుంది స్వర.