సైరా చిత్రం అక్టోబర్ 2న విడుదలకు సిద్ధం అవుతుండడంతో ప్రచార కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఇటీవలే ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. తాజాగా సురేందర్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సైరా చిత్రం గురించి మాట్లాడుతూ.. నరసింహారెడ్డి గురించి పరుచూరి బ్రదర్స్ చెప్పగానే నమ్మశక్యం కాలేదు. అప్పటివరకు నాకు నరసింహారెడ్డి గురించి తెలియదు. పరుచూరి బ్రదర్స్ చెప్పిన తర్వాత నరసింహారెడ్డి గురించి అధ్యయనం చేశాను. 

ఆయన గురించి తెలుసుకోగానే షాక్ అయ్యా. మద్రాసు నుంచి తెప్పిచుకున్నగెజిట్స్, పరుచూరి బ్రదర్స్ ఇచ్చిన సలహాలతో సైరా స్క్రిప్ట్ రెడీ అయింది. సైరా కథని వాస్తవానికి దగ్గరగా తీశారా లేక ప్రేక్షకుల కోసం కమర్షియల్ ఎలిమెంట్స్ జతచేశారా అనే ప్రశ్నకు సురేందర్ రెడ్డి సమాధానం ఇచ్చారు. 

బ్రిటిష్ వారు సిద్ధం చేసిన గెజిట్ లోనే ఆయన్ని ఉరి తీశారని ఉంది. ఆయనవెంట 10 వేలమంది సైన్యంలా నడిచారనేది ఉంది. రెండు యుద్దాలు చేసినట్లు కూడా ఉంది. నరసింహారెడ్డి కథ గురించి ఇంతకంటే ఇంకేం కావాలి. వేరే కమర్షియల్ అంశాల జోలికి ఎందుకు వెళతాం అని సురేందర్ రెడ్డి అన్నారు. 

సైరా చిత్రంలో అనుష్క ఝాన్సీ లక్ష్మీబాయిగా నటించాలనే ఐడియా తనదే అని సురేందర్ రెడ్డి అన్నారు. స్క్రీన్ ప్లేని ఇప్పటి ప్రేక్షకులకు తగ్గట్లు సిద్ధం చేసుకున్నట్లు సురేందర్ రెడ్డి తెలిపారు. 

ఇక క్లైమాక్స్ లో నరసింహారెడ్డిని ఉరితీసే సన్నివేశంపై సురేందర్ రెడ్డి మరోసారి క్లారిటీ ఇచ్చారు. చిరంజీవి లాంటి మెగాస్టార్ లాంటి సన్నివేశంలో కనిపిస్తే అభిమానులు నిరాశ చెందారా అని ప్రశ్నకు బదులిస్తూ.. క్లైమాక్స్ సన్నివేశం భాదించేలా ఉండదు.. మెగా అభిమానులు రొమ్ము విరుచుకుని థియేటర్స్ నుంచి బయటకు వెళ్లేలా తెరకెక్కించినట్లు సురేందర్ రెడ్డి తెలిపారు. 

'సైరా' కథ నాది.. పరుచూరి బ్రదర్స్ ది కాదు.. దర్శకుడి కామెంట్స్!

సైరా ట్రైలర్, టీజర్ ఎఫెక్ట్.. హిందీలో ఆశ్చర్యపరిచేలా!

'సైరా' ప్రీమియర్ షో కలెక్షన్లు.. రికార్డులు బద్ధలవ్వాల్సిందే!

సైరా : నొస్సం కోట యుద్ధం విశేషాలు 

లీకైంది: ‘సైరా నరసింహారెడ్డి’ మెయిన్ ట్విస్ట్ ఇదే!

మెగాస్టార్ సైరా ఫీవర్: భోజన ప్రియులకు బంపర్ ఆఫర్లు

హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న సైరా టికెట్లు.. బెంగుళూరులో స్పెషల్ షోలు!

సిరివెన్నెల లిరిక్స్.. వాళ్ళిద్దరి వాయిస్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

'సైరా' సెన్సార్ కంప్లీట్.. సినిమా రన్ టైం ఎంతో తెలుసా!