ఎన్నో ఏళ్లుగా మెగాఫ్యామిలీ చేయాలనుకున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఫైనల్ గా రిలీజ్ కి సిద్ధమైంది. ఈ కథపై పరుచూరి బ్రదర్స్ రీసెర్చ్ చేశారనే విషయం తెలిసిందే. ఎంతోమంది దర్శకులను అనుకున్న తరువాత ఫైనల్ గా సురేందర్ రెడ్డికి 'సైరా'ని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా స్క్రిప్ట్  పరుచూరి బ్రదర్స్ ది కాదంటున్నాడు సురేందర్ రెడ్డి.

తను రీసెర్చ్ చేసి రాసుకున్న స్క్రిప్ట్ అని అంటున్నాడు. సినిమా కోసం ఎంతో రీసెర్చ్ చేసి మళ్లీ స్క్రిప్ట్ రాసుకున్నట్లు సురేందర్ రెడ్డి చెప్పారు. 'సైరా' సినిమాకి సంబంధించి పరుచూరి బ్రదర్స్ చాలా గొప్పగా రీసెర్చ్ చేశారని.. కాకపోతే వాళ్ల పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా.. తను సొంతంగా కథ రాసుకున్నట్లు చెప్పారు. స్క్రీన్ ప్లే చూసుకొని తను స్టడీ చేసిన ఘటల్ని కూడా పొందుపరిచినట్లు చెప్పారు.

'సైరా నరసింహారెడ్డి' కథ ఈ జెనరేషన్ కి కనెక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో మొత్తం మార్చడం జరిగిందని.. జరిగిన ఘటనలకు నాటకీయత తీసుకొచ్చానని చెప్పారు. నేరేషన్ స్టైల్ పూర్తిగా మార్చేశానని.. అంతా అయినా కూడా మళ్లీ పరుచూరి బ్రదర్స్ సలహా తీసుకున్నానని.. వాళ్లను కూడా కలుపుకొని ముందుకెళ్లానని చెప్పారు. సైరా స్క్రిప్ట్ లో తనకు కూడా భాగముందని స్పష్టంచేశాడు సురేందర్ రెడ్డి.

పరుచూరి బ్రదర్స్ రాసిన బౌండెడ్ స్క్రిప్ట్ పట్టుకొని తను సెట్స్ పైకి వెళ్లలేదని.. తను కూడా చాలా రీసెర్చ్ చేశానని చెప్పుకొచ్చాడు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నయనతార, జగపతి బాబు, విజయ్ సేతుపతి, రవి కిషన్, సుదీప్, తమన్నా, నిహారిక, అనుష్క తదితరులు కీలక పాత్రలలో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందించారు. 

సైరా ట్రైలర్, టీజర్ ఎఫెక్ట్.. హిందీలో ఆశ్చర్యపరిచేలా!

'సైరా' ప్రీమియర్ షో కలెక్షన్లు.. రికార్డులు బద్ధలవ్వాల్సిందే!

సైరా : నొస్సం కోట యుద్ధం విశేషాలు 

లీకైంది: ‘సైరా నరసింహారెడ్డి’ మెయిన్ ట్విస్ట్ ఇదే!

మెగాస్టార్ సైరా ఫీవర్: భోజన ప్రియులకు బంపర్ ఆఫర్లు

హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న సైరా టికెట్లు.. బెంగుళూరులో స్పెషల్ షోలు!

సిరివెన్నెల లిరిక్స్.. వాళ్ళిద్దరి వాయిస్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

'సైరా' సెన్సార్ కంప్లీట్.. సినిమా రన్ టైం ఎంతో తెలుసా!