Asianet News TeluguAsianet News Telugu

నాన్ స్టాప్ గా నెలరోజులు, గుంటూరు కారం కోసం రంగంలోకి దిగబోతున్న మహేష్ బాబు

ఇక నాన్ స్టాప్ షెడ్యూల్ కు రెడీ అయ్యాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. అసలే నత్త నడకన సాగుతున్న తనసినిమా షూటింగ్ ను పరుగులు పెట్టించడానికి రెడీ అవుతున్నాడు సూపర్ స్టార్. 
 

Superstar Mahesh Babu Guntur Karam Movie Shooting Update JMS
Author
First Published Jun 7, 2023, 1:00 PM IST

 సూపర్ స్టార్ మహేష్ బాబు...  త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న  మూడో సినిమా గుంటూరు కారం.  మహేష్ 28వ  సినిమాగా తెరకెక్కుతున్న ఈసినిమా ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ అయ్యి.. ఇప్పటికి కంప్లీట్ అవ్వాల్సి ఉంది. కాని ఎన్నో అవాంతరాలను ఎదుర్కొన్న ఈ మూవీ  షూటింగ్ ఎట్టకేళకు రెండు షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ మధ్య మహేష్ బాబు సమ్మర్ వెకేషన్ కు వెళ్లడంతో.. షూటింగ్ కాస్తా పెండింగ్ పడిపోయింది. ఈక్రమంలో ఈమధ్యే ఫ్యామిలీ టూర్ ను కంప్లీట్ చేసుకుని హైదరాబాద్ చేశారు మహేష్ బాబు. కాని ఎండలుఎక్కువగా ఉండటంతో.. ఆయన వచ్చి చాలా రోజులు అవుతున్నా షూటింగ్ స్టార్ట్ చేయలేకపోయారు. 

వచ్చే ఏడాది సంక్రాంతిని టార్గెట్ గా పెట్టుకురని ఈసినిమా షూటింగ్ లో వేగం పెంచాలని నిర్ణయించుకున్నారు మూవీ టీమ్. అటు సూపర్ స్టార్ మహేష్ కూడా ఈసినిమాను త్వరగా కంప్లీట్ చేయాలని చూస్తున్నాడట. అందుకే గుంటూరు కారం సినిమా షూటింట్ మేజర్ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారట. ఈ షోడ్యూల్ ను లాంగ్ టైమ్ చి ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

ఈ సినిమా కొత్త షెడ్యూల్ జూన్ 12 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. దాదాపుగా నెలరోజుల పాటు ఈ షెడ్యూల్ జరుగబోతుందట. అంతేకాకుండా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఈ సినిమా షూటింగ్ నాన్ స్టాప్ గా అంతే కాదు దాదాపు సినిమాలో మేజర్ పార్ట్ కంప్లీట్ అయ్యేలా ప్లాన్ చేసిన ఈ షెడ్యూల్ లో సినిమాకు సంబంధించిన మెయిన్ కాస్ట్ అంతా పాల్లొంటారనిసమాచారం.  ఈ మేజర్ షెడ్యూల్లో మహేష్ బాబు, పూజా హెగ్డే, శ్రీలీలతో సహా ప్రధాన తారాగణంపై సీన్స్ చిత్రీకరించనున్నారట. 

అటు మహేష్ అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం ఈ సినిమా గురించి ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అతడు, ఖలేజా వంటి కల్ట్‌ క్లాసిక్స్ తర్వాత వీళ్ల కాంబోలో తెరకెక్కుతున్న హాట్రిక్ సినిమా కావడంతో అందిరిలోనూ ఎక్కడలేని ఆసక్తి నెలకొంది. దానికి తోడు సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా రిలీజైన గ్లింప్స్ కు తిరుగులేని రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాను హారిక అండ్ హాసినీ క్రియేష‌న్స్ ప‌తాకంపై ఎస్.చిన‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మ్యూజిక్ సెన్సేష‌న్ థ‌మ‌న్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

 

Follow Us:
Download App:
  • android
  • ios